Drinking In Plastic Cup : ప్లాస్టిక్ కప్‌లో తాగితే ఏమౌతుందో తెలుసా? ఈ సైడ్ ఎఫెక్ట్‌తో జాగ్రత్త.. నిపుణుల హెచ్చరిక!

ప్లాస్టిక్ కప్ లో తెగ తాగేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ప్లాస్టిక్ కప్ లలో తాగడం ద్వారా ప్రధానంగా ఒక సైడ్ ఎఫెక్ట్ ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ప్లాస్టిక్ పర్యావరణానికి హాని చేస్తుందని తెలుసు.. సూక్ష్మంగా విషపూరితమైన పదార్థాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

Drinking In Plastic Cup : ప్లాస్టిక్ కప్‌లో తాగితే ఏమౌతుందో తెలుసా? ఈ సైడ్ ఎఫెక్ట్‌తో జాగ్రత్త.. నిపుణుల హెచ్చరిక!

One Major Side Effect Of Drinking From A Plastic Cup

Side Effect of Drinking From a Plastic Cup : ప్లాస్టిక్ కప్ లో తెగ తాగేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ప్లాస్టిక్ కప్ లలో తాగడం ద్వారా ప్రధానంగా ఒక సైడ్ ఎఫెక్ట్ ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ప్లాస్టిక్ పర్యావరణానికి హాని చేస్తుందని తెలుసు.. అలాగే ప్లాస్టిక్ లో సూక్ష్మంగా విషపూరితమైన పదార్థాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ కప్ లలో ఎక్కువగా జ్యూస్ వంటి ఇతర ద్రావణ పదార్థాలు తాగడం ద్వారా మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని అంటున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీ శరీరంపై ప్లాస్టిక్ కప్పులు తీవ్ర స్థాయిలో సైడ్ ఎఫెక్ట్ కలిగిస్తాయని చెబుతున్నారు. త్వరగా అనారోగ్యానికి గురి చేస్తాయని చెబుతున్నారు. ఈ ముప్పు రెండు విధాలుగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చెమోస్ఫియర్ జర్నల్‌లో ఇటీవల ఒక అధ్యయనాన్ని ప్రచురించారు. అందులో ప్లాస్టిక్ కప్పు ద్వారా అనారోగ్యానికి ఎలా దారితీస్తుందో వివరించారు. ఒక కప్పుకు 3 మిల్లీగ్రాములు మైక్రో ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి వెళ్తాయని, తద్వారా అనారోగ్యానికి గురవుతారని పేర్కొంది. మైక్రోప్లాస్టిక్స్ తీసుకోవడం ద్వారా మీ రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.

ప్లాస్టిక్‌లో BPA కంటెంట్ అధికంగా ఉంటుందని, అలాంటి కప్పుల తాగడం వల్ల మన రోగనిరోధక శక్తి తగ్గే ముప్పు పెరుగుతుందని అంటున్నారు. ప్లాస్టిక్ కప్పులు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కప్పులపై తరచుగా సూక్ష్మక్రిములు తిష్టవేసి ఉంటాయని, నోటి లాలాజలాల ద్వారా లోపలికి వెళ్లిపోతాయని అంటున్నారు.

రోజులో ఈ కప్పులను అధికంగా వాడటం ద్వారా బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీస్తుందని, తద్వారా మీరు అనారోగ్యానికి గురవుతారని హెచ్చరిస్తున్నారు. అందుకే ప్లాస్టిక్ కప్ ల బదులుగా ఏదైనా పానీయాలను గాజు గ్లాసులో తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. అలాగే రోగనిరోధక శక్తిని బలంగా ఉంటుందని ఎలాంటి ప్రభావం పడదని సూచిస్తున్నారు.