Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!

ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు , విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి నోటిలోని హానికరమైన బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లతో పోరాడి చిగుళ్లను కాపాడతాయి. ఉసిరి సహజ క్లెన్సర్ లా పనిచేసి నోటి దుర్వాసన పోగొడుతుంది.

Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!

Dental

Dental Care : నోటి సంరక్షణ విషయంలో జాగ్రతలు పాటించటం తప్పనిసరి. లేకుంటే వివిధ రకాల సమస్యల బారిన పడాల్సి వస్తుంది. నోరు, దంతాల సంరక్షణ కోసం చాలా మంది మార్కెట్లో లభించే వివిధ రకాల పేస్టులను, ఇతరత్రా జెల్స్ ను ఉపయోగిస్తుంటారు. అయితే మన ఇంట్లోనే కొన్ని రకాల పదార్ధాలతో నోరు, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చాలా మందికి తెలియదు. అయితే అలాంటి పదార్ధాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

వేపాకు ; వేపలో అనేక ఔషదగుణాలున్నాయి. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చిగుళ్ల సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపేస్తాయి. దంతాలకు, చిగుళ్లకు బలాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. కొన్ని చుక్కల వేపరసాన్ని పళ్లు, చిగుళ్లపై రాయాలి. కాసేపటి తరువాత గోరు వెచ్చటి నీటితో కడిగితే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

లవంగం ; ఇందులోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పంటి నొప్పిని తగ్గించి ఉపశమనం కలిగిస్తాయి. చిగుళ్ల సమస్యలు పెరగకుండా నియంత్రిస్తాయి. పావు చెంచా నువ్వుల నూనెలో కొన్ని చుక్కల లవంగం నూనె కలిపి, అందులో దూదిని ముంచి పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో ఉంచాలి. బుగ్గన రెండు లవంగాలను పెట్టుకున్నా ఉపశమనం లభిస్తుంది.

వంట సోడా ; దీని లోని ఆల్కలైన్ సమ్మేళనాలు నోటిలో ఎక్కువైన ఆమ్లాలను పీల్చుకుంటాయి. దంత క్షయానికి , చిగుళ్ల సమస్యలకు కారణమయ్యే ఆమ్లాలను వంటసోడాలోని ఆల్కలైన్ సమ్మేళనాలు నియంత్రిస్తాయి. అయితే దీనిని అదే పనిగా వాడరాదు. ఇలా చేస్తే దంతాలపై ఎనామిల్ కు హాని కలుగుతుంది.

ఉసిరి ; ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు , విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి నోటిలోని హానికరమైన బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లతో పోరాడి చిగుళ్లను కాపాడతాయి. ఉసిరి సహజ క్లెన్సర్ లా పనిచేసి నోటి దుర్వాసన పోగొడుతుంది. రోజుకు ఒక ఉసిరి కాయను తిన్నా లేదంటే పావు స్పూను ఉసిరి పొడిని అరకప్పు నీటిలో కలిపి తాగినా ఫలితం ఉంటుంది.