VRS ఇస్తాం.. వెళ్లిపోండి : BSNL/MTNLలో 60వేల ఉద్యోగుల దరఖాస్తు

  • Published By: sreehari ,Published On : November 9, 2019 / 12:52 PM IST
VRS ఇస్తాం.. వెళ్లిపోండి : BSNL/MTNLలో 60వేల ఉద్యోగుల దరఖాస్తు

ప్రభుత్వ రంగ టెలికం సంస్థలైన BSNL, MTNLలోని వేలాది మంది ఉద్యోగాలు స్వచ్చంధ విమరణ పథకం (VRS)కు దరఖాస్తు చేసుకున్నారు. కేవలం 4 రోజుల్లోనే 60వేల మంది ఉద్యోగులు VRS కోసం దరఖాస్తు చేసుకున్నట్టు టెలికం కార్యదర్శి అనూష్ ప్రకాశ్ తెలిపారు. టెలికం శాఖ (DoT) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. బీఎస్ఎన్ఎల్ నుంచి 57వేల మంది ఉద్యోగులు ఉండగా, MTNL నుంచి కనీసం 3వేల మంది ఉద్యోగులు VRS కోసం అప్లయ్ చేసుకున్నట్టు వెల్లడించారు. 

VRS ఎంతో ఆకర్షణీయమైనదని, ఉద్యోగుల నుంచి అపూర్వమైన స్పందన వస్తోందని అన్నారు. రెండు PSUల నుంచి మొత్తంగా 94వేలు లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకున్నట్టు ప్రకాశ్ చెప్పారు. BSNL, MTNL ఉద్యోగులను కలుపుతూ పునరుద్ధరణ ప్యాకేజీగా రూ.69వేలకు గత నెలలోనే ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

నష్టాల్లో ఉన్న ఈ రెండు సంస్థల ఆస్తులను మానిటైజ్ చేసిన అనంతరం రెండేళ్లలో సంస్థ ఆర్జించిన లాభాలను మొత్తంగా కలిపి ఉద్యోగులకు VRS ఆఫర్ ప్రకటించింది. మొత్తం స్టాప్ లో 1.76 లక్షల మంది ఉద్యోగుల్లో కనీసం ఒక లక్ష మంది BSNL ఉద్యోగులు VRS దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ప్రకటించింది. 

ఈ స్కీమ్ డిసెంబర్ 3 వరకు ఓపెన్ అయి ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ లో మొత్తం 1.76 లక్షల ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 1.06 లక్షల మంది ఉద్యోగులు 50ఏళ్లకు పైబడినే వారే. ఇందులో 80శాతం మంది ఉద్యోగులు VRS ఎంచుకునేలా టెలికో ప్రోత్సహించింది. 53.5 ఏళ్లు పైబడిన ఉద్యోగులు తమ సర్వీసులో సంపాదించిన జీతంలోని 125శాతం VRS ద్వారా పొందుతారు. 

అంతేకాదు.. 50ఏళ్ల నుంచి 53.5 ఏళ్లు ఉన్న ఉద్యోగులు VRS ఎంచుకోవడం ద్వారా తమ సర్వీసులోని బ్యాలెన్స్ పిరియడ్ నుంచి రెమున్యరేషన్ రూపంలో ఉద్యోగులు 80శాతం నుంచి 100 శాతం వరకు ప్రయోజనాలు పొందుతారు. 55ఏళ్లు ఉన్న ఉద్యోగులు VRS ఎంచుకుంటే 60ఏళ్లు (ప్రస్తుత రిటైర్మెంట్ వయస్సు) దాటక వారికి పెన్షన్ లబ్ధిదారులుగా మారుతారు.