Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Life Style

Own Covid Treatment : కరోనా వేళా.. సొంత వైద్యం అంత మంచిదేనా…?

ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో, వాట్సాప్‌ గ్రూపుల్లో తరచూ ఫలానా మందులు వాడితే కరోనాకు ప్రివెంటివ్‌గా పనిచేస్తాయని ప్రచారం జరగడం చూస్తున్నాం. ఒకరికి కరోనా వచ్చినప్పుడు వాడిన ప్రిస్క్రిప్షన్‌ను మరొకరు పాజిటివ్‌ రాగానే సొంతంగా వాడేస్తున్నారు.

Publish Date - 8:23 am, Tue, 18 May 21

Own Covid Treatment Good for health

Own Covid Treatment Good for health : ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో, వాట్సాప్‌ గ్రూపుల్లో తరచూ ఫలానా మందులు వాడితే కరోనాకు ప్రివెంటివ్‌గా పనిచేస్తాయని ప్రచారం జరగడం చూస్తున్నాం. ఒకరికి కరోనా వచ్చినప్పుడు వాడిన ప్రిస్క్రిప్షన్‌ను మరొకరు పాజిటివ్‌ రాగానే సొంతంగా వాడేస్తున్నారు. అలాంటి వారిలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఏ మందు అయినా అవసరం మేరకే వాడాలి. అంతేగానీ ప్రివెంటివ్‌ పేరుతో విచ్చలవిడిగా వాడితే అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకోవడమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనవసరంగా మందులు వాడటం డద్వారా శరీరంలో డ్రగ్‌ రెసిస్టెన్స్‌ పెరిగి అవసరమైనప్పుడు ఆ మందులు పనిచేయకుండా పోతాయని చెబుతున్నారు.

అపోహలు…. సొంత వైద్యాలు.. :
మొదటి వేవ్‌ సమయంలో హైడ్రాక్సీ క్లోరోక్వీన్, మీజిల్స్‌-రూబెల్లా వ్యాక్సిన్, పర్‌మెక్టిన్, హెచ్‌ఐవీ బాధితులకు వాడే లోపినావీర్‌ 50, రిటోనావీర్‌200 వంటి మందులను వైద్యరంగానికి చెందిన వారు సైతం వాడారు. అప్పట్లో వ్యాక్సిన్‌ లేరు కాబట్టి ముందస్తుగా వాడారు. కానీ నేడు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ కొందరు వాటిని వాడుతున్నారు. ఇక నాళాల్లో బ్లాక్స్‌కు అస్పిరిన్‌ వాడితే సరిపోతుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో ఎక్కువ మంది ఆస్పిరిన్, ఎకోస్ప్రిన్‌ మందులను వాడేస్తున్నారు. వాటితోపాటు వైరల్‌ జ్వరాలు వచ్చినప్పుడు వాడే ఫాబి ఫ్లూ మందులను ఎక్కువగా వాడుతున్నారు. ఇక విటమిన్‌ సీ, డీ, జింక్‌ మందులను రెగ్యులర్‌గా వేసే వాళ్లున్నారు.

ఒకరి ప్రిస్క్రిప్షన్‌ … మరొకరు :
కరోనా పాజిటివ్‌ వచ్చిన రోగికి వైద్యులు రాసిన మందులను తమ స్నేహితులు, సన్నిహితులకు పాజిటివ్‌ వచ్చినప్పుడు వైద్యుల సూచన లేకుండానే వాడేస్తున్నారు. వాట్సాప్‌ ద్వారా ఆ మందుల వివరాలు తీసుకొని మందుల షాపుల్లో కొనుగోలు చేసి వాడుతున్నారు. వాస్తవంగా వ్యక్తి ఆరోగ్య స్థితి, దీర్ఘకాలిక వ్యాధులు వంటి వాటిని పరిగణలోకి తీసుకొని మందులు వాడాల్సి ఉంది. అలాకాకుండా మధుమేహం ఉన్నవారు సైతం స్టెరాయిడ్స్‌ వాడుతుండటంతో వారి పరిస్థితి విషమిస్తోంది. అంతేకాకుడా కొన్ని రకాల మందులతో డ్రగ్‌ ఎలర్జీలకు సైతం గురవుతున్నారు.

నష్టాలే ఎక్కువ :
యాంటీ వైరల్‌ డ్రగ్‌ను వైరస్‌ సోకినప్పుడు మాత్రమే వాడాలని వైద్యులు చెబుతున్నారు. లేకుంటే వెయిట్‌ లాస్, ఆకలి మందగించడం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అజిత్రోమైసిన్‌ వంటి యాంటీ బయోటిక్‌ మందులు ఎక్కువగా వాడితే గుండెపై ప్రభావం చూపుతాయని వైద్యులు అంటున్నారు. ఒక్కోసారి గుండె ఆగిపోయే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. యాంటీ బయోటిక్స్‌ ఎక్కువగా వాడటం ద్వారా శరీరంలో డ్రగ్‌ రెసిస్టెన్నీ పెరిగి జబ్బు చేసినప్పుడు ఆ మందులు పనిచేయకుండా పోయే ప్రమాదం ఉందంటున్నారు.

సొంత వైద్యం అనర్థాలకు దారితీస్తుంది :
ఏ వ్యాధికైనా సొంత వైద్యం అనర్థాలకు దారి తీస్తుంది. కరోనాకు ఇది మరింతగా ప్రమాదకరం. శరీరంలో కరోనా వైరస్‌ ప్రవేశించిన నాలుగైదు రోజులు ఎంతో కీలకం. ఈ దశలో క్వాలిఫైడ్‌ వైద్యుల పర్యవేక్షణలోనే వైద్య చికిత్సలు పొందాలి. సొంత వైద్యం వల్ల చాలామంది ఎక్కువ డోస్‌ ఉన్న మందులు వాడుతుంటారు. అందులో స్టెరాయిడ్‌ ఎక్కువ శాతం ఉంటుంది.

దీంతో ఇతర మందులు వేసుకున్నా పనిచేయని పరిస్థితి ఉంటుంది. ఈ దశలోనే కరోనాకు సంబంధించిన 25 శాతానికిపైగా మరణాలు సంభవిస్తున్నాయి. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైద్యం పొందాలి. కరోనా రోగుల్లో రక్తం గడ్డకట్టే గుణం ఉండటంతో ఆస్పిరిన్, ఎకోస్ప్రిన్‌ మందులు ఎక్కువగా వాడుతున్నారు. అయితే బ్రెయిన్‌లో గాయాలు ఉన్నవారు, రక్తం గడ్డకట్టే గుణం కోల్పోయిన వారు ఈ మందులు వాడకూడదు. కరోనా నుంచి రక్షించేది టీకా మాత్రమే. కరోనా పట్ల అప్రమత్తత, అవగాహన ఎంతో అవసరమని వైద్యులు సూచిస్తుంది.

Masterminds Image CompAha Itng Aa Design Comp
Andhrapradesh41 mins ago

Banana Chakkarakeli : అరుదైన అరటిగెల… 30కిలోలు.. 140 వరకు పండ్లు.. 

Business60 mins ago

Gold-Silver Rates Today : బంగారం బాటలో వెండి.. భారీగా తగ్గిన ధరలు.. ఎంతంటే?

Latest2 hours ago

Milkha Singh : భారత దిగ్గజ అథ్లెట్‌ మిల్కాసింగ్ కన్నుమూత

Latest2 hours ago

Telangana : ఆర్ధిక వ్యవస్ధ గాడిలో పెట్టేందుకే భూముల అమ్మకం

Andhrapradesh2 hours ago

Catfish Farming : 10 టీవీ ఎఫెక్ట్ : క్యాట్ ఫిష్ పెంపకందారులపై క్రిమినల్‌ కేసులు

International9 hours ago

North Korea Food Crisis : వామ్మో.. అక్కడ కాఫీ ప్యాకెట్ ధర రూ.7వేలు, టీ ప్యాకెట్ ధర రూ.5వేలు, కిలోఅరటిపండ్లు రూ.3వేలు

Latest10 hours ago

Third Covid : భారత్‌లో అక్టోబర్‌లోనే కరోనా థర్డ్‌ వేవ్‌? మరో ఏడాది ముప్పు

International11 hours ago

Rabies Risk: వంద దేశాల కుక్కలకు నో ఎంట్రీ అంటోన్న అమెరికా

Latest11 hours ago

WTC Final: మొదలవకుండానే ముగిసింది.. వానదే మొదటిరోజు!

Andhrapradesh11 hours ago

CM Jagan House : సీఎం జగన్ నివాసం దగ్గర హై అలర్ట్.. భారీ బందోబస్తు

Latest11 hours ago

Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ.. లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం!

Latest11 hours ago

ZyCoV D Vaccine : త్వరలో భారత్‌లో అందుబాటులోకి మరో కరోనా టీకా

Latest11 hours ago

Krishana : ఘట్టమనేని గెట్ టూ గెదర్..

Latest11 hours ago

Revathy Sampath : సినీ ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేసిన రేవతి సంపత్ ఎవరంటే..!

Latest11 hours ago

Police Dogs Farewell: మనసుల్ని కదిలిస్తున్న పోలీస్ కుక్కల సెల్యూట్‌

Latest19 hours ago

Kajol Devgan: ఇన్నేళ్లైనా కాజోల్‌లో కళ తగ్గలేదు..

Latest2 days ago

Malaika Arora : మతిపోగొడుతున్న మలైకా..

Latest5 days ago

Kajal Aggarwal : కాక రేపుతున్న కాజల్ అగర్వాల్..

Latest7 days ago

Tejaswi Madivada : సోకులతో సెగలు పుట్టిస్తున్న తేజస్వి..

Latest1 week ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest1 week ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest2 weeks ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest2 weeks ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest2 weeks ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Latest2 weeks ago

Priya Mani Raj : ప్రియమణి బర్త్‌డే ఫొటోస్..

Latest2 weeks ago

Sreemukhi : నల్లంచు తెల్ల చీర.. శ్రీముఖి శారీ పిక్స్ వైరల్..

Latest3 weeks ago

Divi Vadthya : బ్యూటిఫుల్ పిక్స్‌తో అదరగొడుతున్న దివి..

Latest3 weeks ago

Faria Abdullah : ‘జాతి రత్నాలు’ ఫేం.. ఫరియా అబ్దుల్లా ఫొటోస్..

Latest4 weeks ago

Punarnavi Bhupalam : పిచ్చెక్కిస్తున్న పునర్నవి..

Latest2 months ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Exclusive Videos12 hours ago

ప్రత్యేక హోదాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Exclusive Videos12 hours ago

దేశం అన్ లాక్…. మూడో ముప్పు తప్పదా..?

Exclusive Videos23 hours ago

ఏపీ జాబ్ క్యాలెండర్ విడుదల

Exclusive Videos23 hours ago

సత్తా చాటేందుకు ఈటల సిద్ధం

Exclusive Videos23 hours ago

4 పథకాలపై జగన్ మాట

Exclusive Videos23 hours ago

తెలంగాణలో ఆస్తి పన్ను పెంపు..?

Exclusive Videos2 days ago

మైక్రోసాఫ్ట్ చైర్మన్‏గా తెలుగు తేజం సత్య నాదెళ్ల

Exclusive Videos2 days ago

గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్‌డౌన్ సడలింపులు.!

Exclusive Videos2 days ago

అజారుద్దీన్‏ స్పందనపై ఉత్కంఠ

Exclusive2 days ago

గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్‌డౌన్ సడలింపులు.!

Exclusive Videos3 days ago

ట్విట్టర్‌పై కేంద్రం చర్యలు

Exclusive Videos3 days ago

హుజూరాబాద్‎లో హీట్ :హరీష్ రావు వర్సెస్ ఈటల

Exclusive Videos3 days ago

కరోనా లేని గ్రామం.. ఎక్కడో తెలుసా..?

Exclusive Videos3 days ago

ట్విట్టర్‌పై కేంద్రం చర్యలు

Exclusive Videos3 days ago

ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ రాజకీయం

Masterminds Image Comp