Summer : వేసవిలో చెమట కారణంగా చర్మంపై గుల్లలు వస్తున్నాయా!

వేసవి కాలంలో నూలు దుస్తులు ధరించడం మంచిది. మందంగా, శరీరానికి అంటుకుపోయే వస్త్రాలు ధరించకూడదు. చెమట కాయలు అధికంగా వస్తే క్యాలమిన్‌ లోషన్‌ ,లేదంటే జింక్ ఆక్సైడ్ వాడుకోవటం మంచిది.

Summer : వేసవిలో చెమట కారణంగా చర్మంపై గుల్లలు వస్తున్నాయా!

Sweat

Summer : ఎండాకాలంలో చెమటలు అధికంగా పడుతుంటాయి. చెమట కారణంగా శరీరం నుండి దుర్వాసన వస్తుంటుంది. అంతేకాకుండా మరికొన్నిసమస్యలు కూడా తలెత్తుతాయి. ముఖంగా చెమటకారణంగా చర్మంపై సన్నని గుల్లలు వస్తుంటాయి. వీటిని చెమట గుల్లలు, చెమట కాయలుగా పిలుస్తారు. ఈ చెమటకాయలు చర్మంపై దురదను కలిగించి బాగా ఇబ్బంది పెడతాయి. కొన్ని సందర్భాల్లో చాలా మంది వీటి వల్ల కలిగే మంటను తట్టుకోలేరు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది.

చర్మంలోని స్వేద గ్రంథుల్లో తయారయ్యే చెమటలో యురియా వంటి మలినాలు ఉంటాయి. చెమటకు శరీరంపై ఉండే ప్రాపియోనీ అనే బ్యాక్టరీయా తోడైతే దుర్వాసన వస్తుంది. పిల్లల్లో శ్వేద గ్రంథులు పూర్తిగా తయారు కాకపోవటం వల్ల పిల్లలకు ఎక్కువగా చెమట కాయల సమస్య వస్తుంది. శరీరంపై ఉండే స్వేద గ్రంథులు మూసుకుపోయినట్లయితే అవి చెమట పొక్కుల్లా మరతాయి. వీటిని గోకటం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. ఉక్కపోత, వేడి వాతావరణంలో ఉన్నట్లయితే చెమట కాయలు రావచ్చు.

వేసవి కాలంలో నూలు దుస్తులు ధరించడం మంచిది. మందంగా, శరీరానికి అంటుకుపోయే వస్త్రాలు ధరించకూడదు. చెమట కాయలు అధికంగా వస్తే క్యాలమిన్‌ లోషన్‌ ,లేదంటే జింక్ ఆక్సైడ్ వాడుకోవటం మంచిది. ఉక్కపోత, వేడి వాతావరణంలో ఉంటే చెమట కాయలు వచ్చే అవకాశం ఉన్నందున చల్లని వాతావరణంలో ఉండటం మంచిది. వేసవిలో రోజుకు మూడు నాలుగుసార్లు స్నానం చేయాలి. అలాగని ఎండలో తిరిగి వచ్చిన వెంటనే స్నానం చేయకూడదు.

చెమటకాయలను తగ్గించుకునేందుకు చిట్కాలు ;

చెంచా పసుపు, తేనె ఇంకా పాలు కలిపి మంచి క్రీమ్‌లా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని మీ ముఖంపై, చర్మంపై రాయాలి. కాస్తా ఆరాక నీటిని స్ప్రే చేసి మెల్లిగా రుద్దుతూ చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. కలబంద, పసుపు గుజ్జులా చేసుకుని చమటకాయలు ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి. కలబందలో ఎన్నో ప్రత్యేక గుణాలు ఉన్నాయి. యాంటీ ఫంగల్ వంటి లక్షణాలు చమటకాయలు తయారయ్యేందుకు కారణమయ్యే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడి సమస్యను బాగా అదుపు చేస్తుంది.

సిట్రస్ జాతి పండ్లు నిమ్మ, నారింజ వంటివి కూడా చర్మంలోని బ్యాక్టీరియాను పోగొట్టి చెమట గుల్లలు రాకుండా చేస్తాయి. వీటిని ప్యాక్స్ వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆముదంలో దూది ముంచి చెమట కాయలకు రాస్తే చెమట కాయల నుంచి ఉపశమనం లభిస్తుంది. వెనిగర్‌లో కాస్త దూదిని ముంచి చెమట కాయలు ఉన్న చోట రాయండి. కొద్ది రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది. శరీరానికి చలవ చేసే మజ్జిగ, సబ్జా, బార్లీ నీళ్లు, బార్లీ నీళ్లను తాగడం వల్ల కూడా చెమట కాయలు తగ్గుముఖం పడతాయి.

గంధంలో రోజ్ వాటర్ కలిపి చెమటకాయలకు చాలా రీలీఫ్‌గా ఉంటుంది. చెమటకాయలు ఉన్నచోట రాయాలి. అనంతరం పది నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. జీలకర్ర పొడిలో నీళ్లు పోసి పేస్టులా చేసుకుని చెమట కాయలపై రాస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది. చల్లటి పాలలో దూదిని ముంచి చెమటకాయలపై రాస్తే మంట తగ్గుతుంది. బ్లాక్ టీ, లవంగ నూనె రాయడం ద్వారా కూడా ఉపశమనం పొందవచ్చు. చెమట కారణంగా చర్మం పై చెమటకాయల సమస్య అధికంగా ఉంటే వైద్యలను సంప్రదించి తగిన చికిత్స పొందటం ఉత్తమం.