Cancer : కేన్సర్ వ్యాధిగ్రస్తులకు పంచ సూత్రాలు

నిద్ర పోవటం అనేది చాలా ముఖ్యం. వ్యాధి గ్రస్తులు కంటి నిండా నిద్ర వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ప్రశాంతమైన నిద్ర వల్ల కణాలు వాటంతట అవే మరమ్మత్తు చేసుకుంటాయి. నిద్ర లేమి కారణంగా వ్యాధి

Cancer : కేన్సర్ వ్యాధిగ్రస్తులకు పంచ సూత్రాలు

Cancer

Cancer : ప్రపంచం మొత్తాన్ని భయపెడుతున్న వ్యాధుల్లో కేన్సర్ వ్యాధి ఒకటి. ఈ వ్యాధి వచ్చిందంటే నరకయాతన తప్పదు. ఒక్కోసారి ప్రాణాలను సైతం బలితీసుకుంటుంది. శరీరంలోని వివిధ అవయవాలకు ఈ వ్యాధి సోకుతుంది. చాలా మందిలో కేన్సర్ వ్యాధి వచ్చిందన్న విషయమే తెలియదు. చాలా మంది కేన్సర్ చివరి దశలో ఉన్న సమయంలో వైద్యుల వద్దకు వెళుతున్నారు. ప్రస్తుతం కేన్సర్ చికిత్సలో అధునాతనమైన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపద్యంలో వైద్యపరంగా కేన్సర్ వ్యాధికి చికిత్స కొనసాగిస్తూనే వ్యాధి నిరోధానికి అవసరమైన రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు పంచసూత్రాలు పాటించటం తప్పనిసరి. అవేంటో చూద్దాం..

1.కేన్సర్ తో బాధపడుతున్న వారు ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. వత్తిడి కారణంగా రోగనిరోధక వ్యవస్ధ మరింత బలహీనపడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒత్తిడి తగ్గించుకునే ఇమ్మునిటీని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం ఎప్పుడు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపే ప్రయత్నం చేయాలి. వ్యాయామం చేయటం, నచ్చిన పనులు, మనస్సుకు ప్రశాంత కలిగించే కార్యక్రమాల్లో గడపటం వంటివి చేయాలి.

2. నిద్ర పోవటం అనేది చాలా ముఖ్యం. వ్యాధి గ్రస్తులు కంటి నిండా నిద్ర వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ప్రశాంతమైన నిద్ర వల్ల కణాలు వాటంతట అవే మరమ్మత్తు చేసుకుంటాయి. నిద్ర లేమి కారణంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు 8గంటల సమయం నిద్రకు కేటాయించాలి. ఇలా చేయటం వల్ల పాత కణాలు అంతరించి, బలమైన కొత్త కణాలు పుట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది.

3. పోషకాలు కలిగిన సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో పీచు ఎక్కువగా ఉండేలా చూసుకోవటం మంచిది. పెరుగు, ప్రొబయాటిక్ సప్లిమెంట్లు మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు దోహదపడతాయి. పోషకాలతో కూడిన ఆహారం తీసుకునేందుకు మొగ్గుచూపటం వల్ల జీర్ణ వ్యవస్ధ కూడా శక్తి వంతంగా మారుతుంది.

4.కేన్సర్ వ్యాధి గ్రస్తులకు వ్యాయామం చాలా ముఖ్యమైనది. రోగనిరోధక వ్యవస్ధ బలపడేందుకు నిత్యం వ్యాయామాలు చేయటం ఉత్తమం. దీని వల్ల ఇన్ఫెక్షన్లు తగ్గుటంతోపాటు, మానసిక వత్తిడులను దూరంగా పెట్టవచ్చు. ప్రతిరోజు 20 నిమిషాల పాటు వ్యాయామం చేయటం మంచిది.

5. శరీరంలో విటమిన్ డి లోపం లేకుండ చూసుకోవాలి. ఎండ తగలినిస్తూ ఉండే శరీరానికి కావాల్సిన విటమిన్ డి అందుతుంది. అంతేకాకుండా విటమిన్ డి సంవృద్ధిగా లభించే చేపలు, చేపనూనెలు, గుడ్లు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

వైద్యులు సూచించే మందులను వాడుకుంటూ తగినంత వ్యాయామం, మంచి ఆహార అలవాట్లు, ప్రశాంతవంతమైన జీవనం ద్వారా కేన్సర్ వ్యాధి బారిన పడిన వారు దీర్ఘకాలం జీవించేందుకు అవకాశం ఉంటుంది.