Parental Behavior : చిన్నారులపై ప్రభావం చూపే తల్లిదండ్రుల ప్రవర్తన!

పిల్లల ప్రవర్తన ఎలా వుండాలో అన్న విషయంలో ముందుగా తల్లిదండ్రులకు ఒక క్లారిటి వుండాలి. పిల్లల ప్రవర్తనలో నచ్చని విషయాలని వారికి సున్నితంగా తెలియజేయడమే గాకుండ అది ఎలా వుండాలో వారి మనస్సుకి హత్తుకునేలా వివరించాలి.

Parental Behavior : చిన్నారులపై ప్రభావం చూపే తల్లిదండ్రుల ప్రవర్తన!

Parental Behavior Affecting Children

Parental Behavior : పిల్లల పెంపకం బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులదే. పెంపకంలో ఏమాత్రం తేడా వచ్చినా ఆప్రభావం చిన్నారుల భావి జీవితం పై పడుతుంది. చిన్నవయస్సు నుండే వారికి మంచి చెడుల విషయాలపై అవగాహన కలిగించటం అవసరం. అలా కాకుండా తల్లిదండ్రులు పిల్లల ముందు ప్రవర్తించే తీరు ఏమాత్రం భిన్నంగా ఉన్నా అది వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. పిల్లల ముందు తల్లిదండ్రులు తరచుగా గొడవలాడుకోవటం వారిలో ఆభద్రతాభావాన్ని తీసుకువస్తుంది. వారి ముందు హుందాగా ప్రవర్తించాలి. కోపావేశాలు, పరస్పర నిందారోపణలు చేసుకోవద్దు. అవి వారి సున్నిత మనస్తత్వాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుంది. తల్లిదండ్రులు ఒకరంటే ఒకరు పరస్పర గౌరవించుకోవటం వల్ల చిన్నారులు మంచి ప్రవర్తనకు నాంధిగా మారుతుంది.

అనురాగాన్ని, ఆప్యాయతలని తమ పిల్లలకు వారసత్వంగా అందించాలి. చిన్నవయస్సులో పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తారు. పిల్లల ప్రవర్తన ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో అలాగే మీప్రవర్తన ఉండేలా చూసుకోవాలి. తల్లిదండ్రులు తమ ఆలోచనలని, అబిప్రాయాలని బలవంతంగా వారిపై రుద్దే ప్రయత్నం ఏమాత్రం సరైంది కాదని గ్రహించాలి. వారి యొక్క ఆలోచనలను, భావనలని, అభిప్రాయాలని, స్వేచ్చగా వ్యక్తికరించేలా అవకాశం కల్పించాలి. వ్యక్తిత్వాన్ని గమనిస్తూ వారిని ఆదిశగా ప్రోత్సహించాలి. సృజనాత్మకతని పరిశీలించి ప్రతిభని గుర్తించాలి. దానికి మరింత మెరుగు పరిచేలా తల్లిదండ్రులు ప్రోత్సహించటం మంచిది. వారికి ఆసక్తి గల కళలైన నాట్యం, చిత్రలేఖనం, యోగ, చెస్, సంగితకళలలో ఆసక్తిని పెంపొదించే దిశలో ప్రోత్సహించండి. ఆచార వ్యవహరాలశైలికి ప్రాధాన్యత ఇవ్వండి.

పిల్లల ప్రవర్తన ఎలా వుండాలో అన్న విషయంలో ముందుగా తల్లిదండ్రులకు ఒక క్లారిటి వుండాలి. పిల్లల ప్రవర్తనలో నచ్చని విషయాలని వారికి సున్నితంగా తెలియజేయడమే గాకుండ అది ఎలా వుండాలో వారి మనస్సుకి హత్తుకునేలా వివరించాలి. ప్రవర్తనలో తప్పొపులను సునిశితంగా గమనించాలి. వారి తప్పులని సున్నితంగా చూపించండి. అలా ఎందుకు చేయరాదో, ఎలా చేయాలో వారికి తిరిగి అర్ధం అయ్యేలా చెప్పాలి. అదే పొరపాట్లు తిరిగిచేయ్యకూడదని తెలియజేయండి.. అవే తప్పులని పదేపదే చేస్తుంటే చూసిచుడనట్లుగా వదలివేయకుండా సహనంతో సరిదిద్దాలి. క్రమశిణ పేరుతో కఠినంగా శిక్షించటం వంటివి చేయవద్దు. చిన్నారిని భయభ్రాంతులకి గురిచేసెట్లుగా ప్రవర్తించ వద్దు.