Overexercising : వయసు 40 దాటిన వారు అతిగా ఎక్సర్ సైజులు చేయకపోవటమే బెటర్! మితిమీరిన వ్యాయామాలు చేస్తే ప్రాణాలకే ప్రమాదం?

వ్యాయామాలు చేస్తున్న సందర్భంలో ఎక్కువ సమయం చేయకుండా మధ్య మధ్యలో కొద్ది సమయం విరామం ఇవ్వాలి. వారంలో 4 నుంచి 5 రోజులు ఎక్సర్‌సైజ్ చేస్తే సరిపోతుంది. వారంలో ఇకటి రెండు రోజులు కండరాలకు విశ్రాంతిని ఇవ్వాలి.

Overexercising : వయసు 40 దాటిన వారు అతిగా ఎక్సర్ సైజులు చేయకపోవటమే బెటర్! మితిమీరిన వ్యాయామాలు చేస్తే ప్రాణాలకే ప్రమాదం?

Overexercising

Overexercising : ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతోపాటు, రోజు వారి వ్యాయామాలు చాలా ముఖ్యం. అదే సమయంలో వయస్సు పెరుగుతున్న కొద్ది వ్యాయామాలను నిర్ణీత సమయానికి కుదించుకోవటం, తేలిక పాటి వ్యాయామాలు చేయటం తప్పనిసరని అంటున్నారు నిపుణులు. వయసు 40 సంవత్సరాలు దాటిన వారు రోజువారిగా తేలిక పాటి వ్యాయామాలు చేయటం మంచిది. అతిగా వ్యాయామాలు చేయటం వల్ల హార్మోన్స్ లో అసమతుల్యత, గుండె పోటు, బ్రెయిన్ హెమరేజ్ వంటివి చోటు చేసుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

40 వయస్సు వచ్చిన వారిలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు బరువు తగ్గించుకునేందుకు క్లిష్టతరమైన వ్యాయామాలను ఎంచుకుంటుంటారు. వీటి వల్ల బరువు తగ్గటంమేమోగాని ఇతరత్రా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. బరువు ఎక్కువ ఉన్నవారు కూడా ఎక్కవుసేపు ఎక్సర్‌సైజ్ చేయకూడదు. దీని వల్ల కండరాల నొప్పి, గుండె ఆగిపోవడం, బ్రెయిన్‌లో రక్తం గడ్డ కట్టిపోవడం వంటి వాటికి దారి తీసే ప్రమాదం ఉంటుంది. కండరాలను బలోపేతం చేయడానికి తేలికపాటి వర్కౌట్స్ చేయడం మంచిది.

వ్యాయామాలు చేస్తున్న సందర్భంలో ఎక్కువ సమయం చేయకుండా మధ్య మధ్యలో కొద్ది సమయం విరామం ఇవ్వాలి. వారంలో 4 నుంచి 5 రోజులు ఎక్సర్‌సైజ్ చేస్తే సరిపోతుంది. వారంలో ఇకటి రెండు రోజులు కండరాలకు విశ్రాంతిని ఇవ్వాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. అదే సమయంలో అధిక బరువులు ఎత్తే ప్రయత్నం చేయకూడదు. ఎక్కువ బరువు ఎత్తడం వల్ల వెన్నెముక సమస్యలు దారి తీసే ప్రమాదం ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనంగా మారుతుంటాయి. కఠినమైన వ్యాయామాలు చేయటం వల్ల గాయాలయ్యే ప్రమాదం పెరుగుతుంది. అవి పూర్తిగా నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. సరైన పద్ధతులు పాటిస్తూ మాత్రమే వ్యాయామాలు చేయటం మంచిది.

అధిక రక్తపోటు, గుండె ఆరోగ్యం సరిగా లేని వారు వైద్యుల సూచనలు సలహాలు తీసుకునే వ్యాయామాలు చేయాలి. ఒక వేళ వ్యాయామాలు చేయాలని వైద్యులు సూచిస్తే ఫిట్ నెస్ నిపుణుల సమక్షంలో వారు సూచించిన తేలికపాటి వ్యాయామాలు చేయటం మంచిది. దీర్ఘకాలికంగా కఠినమైన వ్యాయామం ఆరోగ్యానికి మంచి కంటే ఎక్కువ హాని కలిగించవచ్చని అధ్యయనాలు సైతం సూచిస్తున్నాయి. కాబట్టి 40 వయసు దాటిన వారు రోజు వ్యాయామాల విషయంలో జాగ్రత్తలు పాటించటం మంచిది.