Drinking Tea : ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అదే పనిగా టీలు తాగటం అలవాటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాల్సిందే?

చాలా ఆహార పదార్థాల మాదిరిగానే, మితంగా వినియోగించడం వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టీ తాగేవారి దంతాల మీద కూడా టానిన్‌లు ఏర్పడతాయి. ముఖ్యంగా శాకాహారులపై ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది.

Drinking Tea : ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అదే పనిగా టీలు తాగటం అలవాటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాల్సిందే?

Harms of drinking large amounts of tea

Drinking Tea : ఉదయం నిద్రలేవగానే టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. టీ తాగడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగి రీఫ్రెష్ గా అనిపిస్తుంది. బీజీ బీజీగా గడిపేవారు రోజులో చాలా సార్లు టీని తాగుతారు. కొందరికైతే టీ వ్యసనంగా మారిపోయి ఉంటుంది. కానీ టీ ని ఎక్కువ సార్లు తాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. టీలోని కెఫిన్ ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది, ఒక సాధారణ కప్పులో 50 మిల్లీగ్రాములు కెఫిన్ ఉంటుంది. ఒక రోజులో ఆరు కప్పులు తాగిన తర్వాత, కొంత ఆందోళన కరమైన పరిస్ధితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎనిమిది ,10 రోజువారీ కప్పుల మధ్య తాగితే కెఫీన్ మత్తుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి లేకపోవడం, భయము నుండి జీర్ణక్రియ, హృదయ స్పందన రేటు పెరుగుదల వరకు అనేక ప్రభావాలు ఉంటాయి.

చాలా ఆహార పదార్థాల మాదిరిగానే, మితంగా వినియోగించడం వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టీ తాగేవారి దంతాల మీద కూడా టానిన్‌లు ఏర్పడతాయి. ముఖ్యంగా శాకాహారులపై ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కప్పుల టీని తాగితే శరీరంలో ఉండే టానిన్లు ఇనుము శోషణ సామర్థాన్ని తగ్గిస్తాయి. రోజుకు 5 నుంచి 10 కప్పుల టీని తాగితే యాసిడ్ రిఫ్లక్స్ సమస్య దారుణంగా పెరిగిపోతుంది. మెదడుపై చెడు ప్రభావాన్నిచూపుతుంది. టీ ఆకులలో థియోబ్రోమిన్ ఉంటుంది, కాబట్టి మనం ఖాళీ కడుపుతో టీ తాగిన తర్వాత ప్రేగులు పెద్ద మొత్తంలో థైన్‌ను గ్రహిస్తాయి. థైన్ మానవ కేంద్ర నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది మరియు హృదయ స్పందన రేటు మరియు దడను పెంచుతుంది.

టీ తాగడం వల్ల రీఫ్రెష్ గా అనిపిస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. అంతేకాదు గుండెకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. అన్నింటికీ మించి మోతాదుకు మించి టీని తాగడం వల్ల బరువు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. ఎప్పుడూ ఖాళీ కడుపుతో టీ తాగకూడదు. ఇది కడుపుపై ​​భారాన్ని పెంచుతుంది. ఖాళీ కడుపుతో టీలు తాగితే, అది జీర్ణశయాంతర అసౌకర్యం కలిగిస్తుంది. తద్వారా దీర్ఘకాలిక పొట్టలో పుండ్లు ఏర్పడతాయి.