బాబ్బాబు.. శానిటైజర్ కొనండి అంటున్న వ్యాపారులు

  • Published By: madhu ,Published On : September 13, 2020 / 08:39 AM IST
బాబ్బాబు.. శానిటైజర్ కొనండి అంటున్న వ్యాపారులు

బాబ్బాబు..శానిటైజర్ కొనండి ప్లీజ్ అంటున్నారు కొంతమంది వ్యాపారులు. ఎందుకంటే..జనాలు వాడకాన్ని తగ్గించారంట. ఆగ్టసు చివరి వారం నుంచి శానిటైజర్ అమ్మకాలు బాగా పడిపోయినట్లు వ్యాపారులు వెల్లడిస్తున్నారు. జూన్, జులై నెలలో ఉన్న డిమాండ్ ప్రస్తుతం ఉండడం లేదంటున్నారు.



దుకాణాల్లో శానిటైజ్ బాటిళ్లు పేరుకపోతుండడంతో దీనికి సంబంధించిన..డిస్ట్రిబ్యూటర్లు వెనక్కు పంపే పరిస్థితి ఏర్పడింది.
శానిటైజర్ ఎందుకు వాడుతారా తెలిసిందే కదా. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాకు ఇంతవరకు వ్యాక్సిన్ కనిపెట్టలేదు. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని, ఇందుకు శానిటైజర్ తప్పకుండా ఉపయోగించాలని వైద్యులు, నిపుణులు సూచించారు.

మార్చి నెల చివరిలో మొదలైన ఈ వైరస్ కారణంగా శానిటైజర్ కొనుక్కొనేందుకు దుకాణాలకు ఎగబడ్డారు. రేషన్ దుకణాలు, సినిమా థియేటర్ల కనబడే క్యూలు దుకాణాలు, స్టోర్స్ ఎదుట దర్శనమిచ్చాయి. దీంతో కొంతమంది వ్యాపారులు క్యాష్ చేసుకొనేందుకు పోటీ పడ్డారు. సొంత పనులు చేసుకునే వారు కూడా శానిటైజర్ లను భారీ ఎత్తున కొనుగోలు చేసి విక్రయించారు. అసలు ఉత్పత్తులను పక్కన పెట్టేసి ఏకంగా శానిటేజర్ డిస్ట్రిబ్యూటర్లుగా మారిపోయారు.



జూన్ నెలలో ఐదు లీటర్ల క్యాన్ రూ. 2 వేల వరకు విక్రయించారు. త్యం సగటున 8 నుంచి 10 వరకు అలాంటి క్యాన్లు, 100 మిల్లీలీటర్ల చిన్న సీసాలు 300 వరకు, 200 మి.లీ. సీసాలు 100 నుంచి 200 చొప్పున సరఫరా చేసేవి. జూలై వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం వాటి ధరలను నియంత్రించటంతో 5 లీటర్ల క్యాన్‌ ధర వెయ్యి రూపాయలకు పడిపోయింది.

ఆగస్టు చివరి వారం వచ్చే సరికి పరిస్థితి మొత్తం మారిపోయింది. విక్రయాలు తగ్గిపోవడంతో 5 లీటర్ల క్యాన్ కేవలం రూ. 400 విక్రయించడం ప్రారంభించారు. అయినా..కొనే వారు లేకపోవడంతో నిల్వలు పేరుకపోతున్నాయి.
కరోనా అంటే తొలుత జనాల్లో భయం ఉండేదని..క్రమక్రమేనా..ఆ భయం పోతోందని విశ్లేషకులు అంటున్నారు.



కొత్త కేసులు నమోదవుతున్నా..జనాలు భయపడడం లేదని, సాధారణ జ్వరం తరహాలో తగ్గిపోతుందన్న అభిప్రాయానికి చాలా మంది వచ్చి ఉన్నారని వెల్లడిస్తున్నారు.