COVID-19 3rd Booster Shot : ఫ్లూ టీకా మాదిరిగా కోవిడ్ టీకాను ప్రతి ఏడాది తీసుకోవాల్సిందే..!

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేసే కరోనా వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేయాలి. అయితే ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లు దీర్ఘకాలం రక్షణ ఇవ్వలేమని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

COVID-19 3rd Booster Shot : ఫ్లూ టీకా మాదిరిగా కోవిడ్ టీకాను ప్రతి ఏడాది తీసుకోవాల్సిందే..!

Pfizer Imagines A Covid 19 Booster Shot 12 Months After Getting Fully Vaccinated

COVID-19 booster shot  : ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేసే కరోనా వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేయాలి. అయితే ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లు దీర్ఘకాలం రక్షణ ఇవ్వలేమని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. పూర్తి స్థాయిలో కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నప్పటికీ దీర్ఘకాలం పాటు వ్యాక్సిన్లు వైరస్ వేరియంట్లను ఎదుర్కొలేవని అంటున్నారు. ఇతర వ్యాక్సిన్లు మాదిరిగానే ప్రతి ఏడాది కరోనా వ్యాక్సిన్ బూస్టర్లను అందించాల్సిన అవసరం ఉంటుందని ఫైజర్ కంపెనీ చెబుతోంది. పూర్తిగా వ్యాక్సినేషన్ తీసుకున్నా 12 నెలల తర్వాత మూడో వ్యాక్సిన్ బూస్టర్ తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం పడుతుందని ఫైజర్ సీఈఓ అల్బర్ట్ బౌర్లా అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో వ్యాక్సిన్లు బూస్టర్లు తీసుకోవాల్సేందేనని అంటున్నారు.

కోవిడ్-19 మహమ్మారిని కట్టడి చేయాలంటే ప్రతి ఏడాదిలో వ్యాక్సిన్ షాట్లను తప్పక తీసుకోవాల్సిందేనని రీసెర్చర్లు చెబుతున్నారు. రాబోయే సంవత్సరాల్లో, ప్రపంచం ప్రతి ఏడాది లేదా అంతకంటే ఎక్కువ షాట్లను తీసుకోవాల్సి రావొచ్చునని భావిస్తున్నారు పరిశోధకులు. తట్టు (మీజిల్స్) వంటి వ్యాక్సిన్లు మాదిరిగానే కోవిడ్ వ్యాక్సిన్లు కూడా జీవితకాలం పాటు రక్షణ అందించలేవని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఫ్లూ వ్యాక్సిన్ మాదిరిగానే సాధారణ షాట్లు అవసరమవుతాయని చెబుతున్నారు.

ఫ్లూ వ్యాక్సిన్లు ప్రతి ఏడాది తీసుకోవడానికి రెండు కారణాలను చూపిస్తున్నారు. అందులో మొదటిది శరీరంలో రోగనిరోధక శక్తి క్షీణిస్తుంటుంది. రెండోది ఇన్ఫ్లూయింజా వైరస్ ఎప్పుటికప్పుడూ కొత్తగా రూపుదాల్చుతుంది.. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుంటాయి. ఫ్లూ వైరస్ ల కంటే SARS-Cov-2 మ్యుటేషన్ చాలా నెమ్మదిగా ఉంటుంది. అందుకే ప్రతి ఏడాది ప్రతిఒక్కరిలో ఇమ్యూనిటీని పెంచుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లు వేరియంట్లపై సమర్థవంతంగా పోరాడగలవు. కానీ, దక్షిణాఫ్రికా వేరియంట్ మినహాయింపు అంటున్నాయి. ఎందుకంటే.. ప్రస్తుతం వ్యాక్సిన్లు సౌతాఫ్రికా వేరియంట్ పై తగినంత స్థాయిలో పనిచేయడం లేదంటున్నారు. 2021 ఏడాది చివరిలోగా ప్రపంచంలోని బిలియన్ల మందికి వ్యాక్సిన్ అందించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఫ్లూ వ్యాక్సిన్ మాదిరిగానే కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ల అవసరం పడుతుందని రీసెర్చర్లు చెబుతున్నారు. మూడో డోస్.. ఆరు నుంచి 12 నెలల్లో ఎప్పుడైనా అవసరం పడొచ్చు. వార్షికంగా ఇచ్చే అవకాశం ఉండొచ్చు.

వ్యాక్సిన్లు ఎంతకాలం సమర్థవంతంగా పనిచేయగలవో కచ్చితంగా చెప్పలేమంటున్నారు. ఫైజర్ ఇటీవలే తమ వ్యాక్సిన్ రెండో డోసు తర్వాత నుంచి ఆరు నెలల వరకు సమర్థవంతగా పనిచేస్తుందని ప్రకటించింది. ఫైజర్, బయోంటెక్, మోడ్రెనా డ్రగ్ మేకర్లు మూడో బూస్టర్ షాకట్ కోసం అడ్వాన్స్ ట్రయల్స్ మొదలుపెట్టేశాయి. మోడ్రెనా మూడో బూస్టర్ షాట్ వేసవి కాలం నుంచి శీతాకాలం లోపు రెడీ అవుతుందని భావిస్తోంది. మరోవైపు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 10వేల మందిలో ఒకరి కంటే తక్కువ మందిలో కరోనా మళ్లీ సోకుతోందని సీడీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది.