Pomegranate Leaves : అనారోగ్యాలను దూరం చేసే దానిమ్మ ఆకులు

మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీతో బాధపడుతున్నవారు రోజుకు రెండు స్పూన్ల దానిమ్మ ఆకుల రసాన్ని తీసుకోవటం వల్ల ఆసమస్యలు తొలిగిపోతాయి.

Pomegranate Leaves : అనారోగ్యాలను దూరం చేసే దానిమ్మ ఆకులు

Pomegranate Leaves

pomegranate Leaves : దానిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎర్రగా నిగనిగ లాడుతూ కంటికి ఇంపుగా కనిపించేదానిమ్మ గింజలు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి .అత్యంత శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ల సమాహారం దానిమ్మ. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ పని పట్టి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. అల్జీమర్స్‌, వక్షోజ క్యాన్సర్‌, చర్మ క్యాన్సర్లను అడ్డుకుంటాయి. దానిమ్మ సహజ యాస్పిరిన్‌. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. పావు కప్పు దానిమ్మ రసం రోజూ తాగితే మీ గుండె ఆరోగ్యం భద్రంగా ఉన్నట్లే.

దానిమ్మ ఆకులతో ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. అనేక ఆనారోగ్య సమస్యలను ఈ ఆకులతో చెక్ పెట్టవచ్చు. ఆయుర్వేద వైద్యంలో వీటిని ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా చలికాలంలో జలుబు, దగ్గు, సమస్యతో బాధపడుతున్నవారు. గుప్పెడు దానిమ్మ ఆకులను తీసుకుని బాగా కడిగి తగినన్ని నీళ్ళు తీసుకుని బాగా మరిగించుకోవాలి. ఈనీటిని ఉదయం సాయంత్రం తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గిపోతాయి.

కిడ్నీ, లివర్, వాంతులు, అరుగుదల సమస్యలు ఉన్నవారు దానిమ్మ ఆకులను సేకరించి నీడలో ఆరబెట్టుకోవాలి. ఆతరువాత దానిని పొడిగా చేసుకుని రోజుకు మూడు గ్రాముల చొప్పున తీసుకోవటం వల్ల సమస్యలను తగ్గించుకోవచ్చు. అధికబరువుతో బాధపడుతున్న వారు దానిమ్మ ఆకులతో తయారు చేసుకున్న టీని తాగటం వల్ల మంచి ఫలితం పొందవచ్చు.

కడుపునొప్పి, కడుపులో వికారం వంటి సమస్యలను తగ్గించటంలో దానిమ్మ ఆకుల టీ బాగా పనిచేస్తుంది. చెవినొప్పి, చెవిలో ఇన్ఫెక్షన్ ఉంటే దానిమ్మ ఆకుల రసాన్ని తీసి నువ్వుల నూనె వేసి మరగించాలి. చల్లారిన తరువాత రెండు చెవ్వుల్లో రెండు చుక్కలు వేయడం వల్ల చెవినొప్పి, ఇన్ఫెక్షన్ తగ్గుతాయి.

మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీతో బాధపడుతున్నవారు రోజుకు రెండు స్పూన్ల దానిమ్మ ఆకుల రసాన్ని తీసుకోవటం వల్ల ఆసమస్యలు తొలిగిపోతాయి. గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు వచ్చే దానిమ్మ ఆకుల పేస్టు చేసి దానిని సమస్య ఉన్న చోట పై పూతగా రాస్తే తగ్గిపోతాయి. తీవ్రమైన దగ్గు వస్తుంటే ఎండబెట్టిన దానిమ్మ ఆకుల పొడి, దానిమ్మ పూల మొగ్గలు, నల్లమిరియాలు, తులసి ఆకులు నీటిలో వేసి ఐదు నిమిషాలు మరగించాలి. ఆనీటిని రోజుకి రెండు సార్లు తాగితే దగ్గు తగ్గిపోతుంది.

నోటి దుర్వాసన, చిగుల్ళ వాపు, నోటిలో పుండ్లు వంటి వాటిని నివారించుకునేందుకు దానిమ్మ ఆకుల రసం తీసి 400ఎం.ఎల్ నీటిలో వేసి 200ఎం.ఎల్ వచ్చేంత వరకు మరిగించాలి. ఆనీటితో నోటిని పుక్కిలించటం వల్ల నోటి సమస్యలను దూరం చేయవచ్చు. మొటిమలు తగ్గించుకునేందుకు దానిమ్మ ఆకులను పేస్ట్ గా చేసి ముఖానికి రాసుకుంటే మొటిమలను నివారించుకోవచ్చు.