Potato : చర్మ సౌందర్యాన్ని పెంచే బంగాళాదుంప

బంగాళదుంపను చర్మానికి రుద్దడం వల్ల చర్మం కాంతి పెరుగుతుంది, చర్మం గట్టిపడుతుంది. అయితే బంగాళదుంపతో పాలు కూడా చేర్చి ప్యాక్ వేసుకుంటే చర్మం శుభ్రపడటంతో పాటు, మంచి కాంతి పెరుగుతంది.

Potato : చర్మ సౌందర్యాన్ని పెంచే  బంగాళాదుంప

Potato

Potato : ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లు, కాయగూరలతో అంతర్గత ఆరోగ్యమే కాదు..బాహ్య సౌందర్యాన్ని కూడా మెరుగుపర్చుకోవచ్చు. నిగనిగలాడే చర్మసౌందర్యం, మృదువైన స్కిన్ కావాలంటే ఇలా చేయాల్సిందే అంటున్నారు బ్యుటీషియన్స్. బంగాళదుంపలో ఉండే పోషకపదార్ధాలు చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి చర్మ సమస్యల్ని దూరం చేస్తాయి. ముఖ్యంగా ఇందులో పుష్కలంగా లభించే విటమిన్ సి, బి, స్టార్చ్ అనేవి చర్మ సౌందర్యాన్ని అద్భుతంగా మెరుగుపరుస్తాయి. చర్మానికి మంచి రంగును అందించడమే కాకుండా కాంతివంతం చేస్తుంది. కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు దూరమౌతాయి. మెరుగైన చర్మ సౌందర్యం, మృదువైన చర్మం కోసం బంగాళదుంపలతో ఫేస్‌ప్యాక్ ట్రై చేస్తే మెరుగైన ఫలితాలుంటాయి.

బంగాళదుంపలో ఉండే బ్లీచింగ్ ఏజెంట్స్ స్కిన్ ఫెయిర్ గా మరియు గ్లోయింగ్ గా మార్చుతుంది. ఒక పొటాటో తీసుకుని, మెత్తగా పేస్ట్ చేసి, జ్యూస్ తియ్యాలి. ఈ రసాన్ని ముఖానికి అప్లై చేస్తే ఎఫెక్టివ్ రిజల్ట్ ను అందిస్తుంది. బెటర్ రిజల్ట్ కోసం, రెగ్యులర్ గా అప్లై చేసుకోవాలి.

ముఖంలో ముడతలు, మచ్చల్ని తొలగించేందుకు ఓ కప్పులో బంగాళదుపం గుజ్జు, పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి. ముఖానికి ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్‌లా రాసుకుని..20 నిమిషాల తరువాత నీళ్లతో కడగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఇక ఇందులో ఉండే స్టార్చ్ గుణం మంచి బ్లీచ్‌లా ఉపయోగపడుతుంది. బంగాళదుంప గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ఓ పదిహేను నిమిషాల ఆ తరువాత కడిగేయాలి.

బంగాళదుంపను చర్మానికి రుద్దడం వల్ల చర్మం కాంతి పెరుగుతుంది, చర్మం గట్టిపడుతుంది. అయితే బంగాళదుంపతో పాలు కూడా చేర్చి ప్యాక్ వేసుకుంటే చర్మం శుభ్రపడటంతో పాటు, మంచి కాంతి పెరుగుతంది. అలాగే బంగాళదుంపను మెత్తగా పేస్ట్ చేసి, అందులో పాలు కలిపి ప్యాక్ వేసుకోవాలి. ఎండిన తర్వాత మంచి నీటితో కడిగేసుకోవాలి.

బంగాళదుంప మీ ముఖంపై ఉండే మచ్చలను తగ్గిస్తుంది. కాలిన గాయాలు, దద్దుర్లు మీద రాయడం వల్ల మంట అనేది తగ్గుతుంది. అలాగే కాలిన గాయాల మచ్చలు పోవాలంటే ఉడకబెట్టిన బంగాళాదుంప ముక్కను మెత్తగా చేసి కాలిన మచ్చల దగ్గర రాస్తే మచ్చలు తొలగిపోతాయి. బంగాళాదుంప ఉపయోగించడం వల్ల ఆడవాళ్ళలో వృద్ధాప్య ఛాయలు పోతాయి.

ఓ కప్పులో బంగాళదుంప రసం, కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని..ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఓ ఇరవై నిమిషాలుంచి..కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఒక స్పూన్ పచ్చి బంగాళ దుంప గుజ్జుకు ఒకటిన్నర స్పూన్ పంచదార కలిపి మెత్తగా చేసి ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కుంటే మీ ఫేస్ కాంతివంతంగా ఉంటుంది

కంటి కింద ఏర్పడే నల్లటి వలయాలు అంటే డార్క్ సర్కిల్స్‌ను దూరం చేసేందుకు బంగాళదుంప గుజ్జు, తేనె బాగా కలిపి..ఆ మిశ్రమాన్నికంటి చుట్టూ రాసుకోవాలి. 15-20 నిమిషాలుంచుకుని తరువాత కడిగేయాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే డార్క్ సర్కిల్స్ ఖచ్చితంగా దూరమౌతాయి.

బంగాళదుంప రసంలో కోడిగుడ్డు తెల్లటి సొనను, నిమ్మరసం కలుపుకుని తలకు రాసుకుంటే జుట్టు ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఉడికించిన రెండు బంగాళ దుంపల గుజ్జుకు రెండు చెంచాల పాలు కలిపి మిక్సీలో వేసి గుజ్జుగా చేయాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉండగానే దూది సహాయంతో ముఖానికి పట్టించాలి. అరగంట పాటు ముఖాన్ని ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా మారుతుంది.

ఒక స్పూను బంగాళాదుంప రసానికి స్పూను ముల్తానీ మట్టిని కలపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పూసుకుని కాసేపు ఆరనీయాలి. ముందు గోరువెచ్చటి నీటితోనూ, తరవాత చన్నీటితోనూ కడిగేయాలి. బంగాళాదుంపని ఉడకబెట్టి ముద్దలా చేసి, ఒక స్పూను పాల పొడి, ఒక స్పూను బాదం నూనె కలిపి ముఖానికి పట్టించి పావుగంట తరవాత శుభ్రపరిస్తే ఛాయ మెరుగుపడుతుంది.

మూడు టేబుల్ స్పూన్ల బంగాళా దుంపల రసం, 3 స్పూన్ల కలబంద రసం, 2 స్పూన్ల తేనె తీసుకోండి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి రెండు గంటల తర్వాత తలస్నానం చేయండి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే మీ జుట్లు మెరిసిపోతుంది.