Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!

బంగాళ దుంపల్లో ఉండే యాంటీ కాన్సర్ ఏజెంట్లు కాన్సర్ దరి చేరకుండా కాపాడటంలో సహాయపడతాయి. రొమ్ము క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధిస్తాయని అధ్యయనాల్లో తేలింది.

Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!

Potatoes

Potatoes : మనిషికి శక్తిని అందించే ముఖ్యమైన ఆహారాల్లో బంగాళ దుంప ఒకటి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బంగాళ దుంపలు తింటే బరువు పెరుగుతారన్న ప్రచారం ఉన్నప్పటికీ అందులో ఏమాత్రం వాస్తవంలేదంటున్నారు నిపుణులు. బరువు తగ్గటానికే కాకుండా ఇంకా అనేక ఆరోగ్యప్రయోజనాలను బంగాళ దుంపలను ఆహారంగా తీసుకోవటం ద్వారా పొందవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం ఆధునిక జీవన శైలి కారణంగా బరువు పెరగడం అనేది పెద్ద సమస్యగా మారింది. అంతేకాకుండా చక్కెర వ్యాధి కూడా చాలా మందిని అనారోగ్యసమస్యలను తెచ్చిపెడుతుంది.

బంగాళ దుంపలోని సారం ఊపిరితిత్తుల వాపును తగ్గించటంలో దోహదపడుతుంది. ఇందులో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి, వంటి అనేక పోషకాలు ఉన్నాయి. వీటితోపాటుగా కెరోటియినాయిడ్లు, ల్యూటీన్, జీయాజాంతిన్ వంటి పిగ్మెంట్లు ఉండటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కార్పోహైడ్రేట్లకు మంచి మూలంగా చెప్పవచ్చు. శరీరానికి కావాల్సిన శక్తిని అందించేందుకు దోహదం చేస్తాయి. బంగాళదుంపల్లో ఉండే హైపోలిపిడిమ్ కొలెస్ట్రాల్ ను తగ్గించే ఏజెంట్లుగా పనిచేస్తున్నట్లు అధ్యయానాల్లో తేలింది.

బంగాళ దుంపల్లో ఉండే యాంటీ కాన్సర్ ఏజెంట్లు కాన్సర్ దరి చేరకుండా కాపాడటంలో సహాయపడతాయి. రొమ్ము క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధిస్తాయని అధ్యయనాల్లో తేలింది. ఎముకలకు బలాన్ని ఇవ్వటంలో ఇందులో ఉండే మెగ్నీషియం, జింక్, ఐరన్, ఫాస్పరస్ లు ముఖ్యపాత్ర వహిస్తాయి. ఆలును ఉడకబెట్టుకుని తినడం వల్ల ఎలాంటి బరువు కూడా పెరగరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బంగాళ దుంపను కొవ్వు రహిత ఆహారంగా చెప్పవచ్చు. దీనిని కాల్చిగాని, ఉడికించుకునిగాని తినటం వల్ల మంచి ప్రయోజనాలు లభిస్తాయి. బంగాళ దుంప పైన ఉండే తొక్కను చాలా మంది వ్యర్ధ పదార్ధంగా చూస్తుంటారు. అయితే ఈ తొక్కలోనే మంచి పీచు లభిస్తుంది. ఈ పీచు శరీరంలోని ప్రేగు అంతర్గత గోడలకు రక్షణ నిస్తుంది.