Throat Allergies : చలికాలంలో గొంతు సంబంధిత ఎలర్జీలు రాకుండా!..

ఎలర్జీ సమస్యల్ని తగ్గించడంలో వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది. పచ్చి వెల్లుల్లిని నేరుగా తిన్నా మంచి ఫలితం ఉంటుంది. ఎలర్జీ సమస్యతో బాధపడేవారు రోజూ మూడు, నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని తినడం అలవాటు చేసుకోవాలి.

Throat Allergies : చలికాలంలో గొంతు సంబంధిత ఎలర్జీలు రాకుండా!..

Throat Issues (1)

Throat Allergies : చలికాలం వచ్చిందంటే చాలు చాలా మంది వణికిపోతుంటారు. ముఖ్యంగా వాతావరణంలో జరిగే మార్పుల వల్ల శరీరంలో అనేక రుగ్మతలు వెలుగు చూస్తుంటాయి. వీటిలో ప్రధానంగా దగ్గు, జలుబు వంటి పలు ఆరోగ్య సమస్యలు రావడం సహజంగానే ఉంటాయి. అలాగే గొంతు గరగర , ఎలర్జీలు సమస్యాత్మంగా తయారై ఇబ్బంది పెడుతుంటాయి. ఈ గొంతు గరగరను, ఎలర్జీలను ఎదుర్కోవడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

గొంతునొప్పి తగ్గించే లక్షణాలు అల్లంలో కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే వారు రోజూ అల్లాన్ని వంటల్లో ఉపయోగించడం మంచిది. లేదంటే కనీసం సాయంత్రం పూటైనా అల్లంతో తయారు చేసిన టీ తాగడం వల్ల గొంతునొప్పి నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుంది. లేదంటే అర చెక్క అల్లాన్ని టీ లేదా తేనెలో కలుపుకుని తీసుకున్నా ఫలితం ఉంటుంది. తేనె కేవలం ఎలర్జీలకే కాక ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

ఎలర్జీలను తగ్గించడంలో కూడా గ్రీన్‌టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రీన్‌టీలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియంట్లు, యాంటీ ఎలర్జిటిక్ ఏజెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎలర్జీని అరికట్టడంలో బాగా సహకరిస్తాయి. కాబట్టి ప్రతిరోజూ గ్రీన్ టీని కనీసం ఒకట్రెండు కప్పుల చొప్పున తీసుకోవడం చాలా మంచిది.

విటమిన్ సి నిండిన పండ్లను తినడం వల్ల గొంతులో గరగరను తగ్గించుకోవచ్చు. వీటిల్లో ఎక్కువ మొత్తంలో యాంటీ హిస్టమైన్ ఉంటుంది. అందుకే ఇది ఎలర్జీలను కూడా క్రమంగా తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి నారింజ, బొప్పాయి, నిమ్మ, కివి లాంటి విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే యాంటీ హిస్టమైన్ ట్యాబ్లెట్ల రూపంలో కూడా దొరుకుతుంది. అయితే వాటిని డాక్టర్ సూచనమేరకే వాడాలి.

యాపిల్ సైడర్ వెనిగర్‌లో కేవలం ఎలర్జీని తగ్గించే గుణాలే కాకుండా.. ఇతర ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించే లక్షణాలు కూడా ఉన్నాయి. అలాగే ఎలర్జీల వల్ల కలిగే దురదను తగ్గించడంలో కూడా యాపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎలర్జీల వల్ల కలిగే దురదను తగ్గించవచ్చు.

ఎలర్జీ వల్ల గొంతుకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు లేదా గొంతు వాచినప్పుడు.. కాసిన్ని గోరు వెచ్చని నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని గొంతులో పోసుకుని పుక్కిలించడం సమస్య తగ్గడంతో పాటు దాన్నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది.

ద్రాక్ష, అరటి, టమాట, క్యారెట్, ఉల్లిపాయలు.. వంటి పదార్థాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ పండ్లు, కూరగాయల్ని నేరుగా తినడం ఇష్టం లేకపోతే వాటిని జ్యూస్‌ల రూపంలోనూ తీసుకోవచ్చు. అయితే వీటిని తయారు చేసుకునే క్రమంలో వీలైతే చక్కెర వేసుకోకపోవడమే మంచిది. అలాగే ఈ సమయంలో శరీరంలో నీటి శాతం పెంచుకోవడం కూడా చాలా ముఖ్యం. రోజూ ఏడెనిమిది గ్లాసుల నీరు తాగటం మాత్రం మర్చిపోవద్దు.

ఎలర్జీ సమస్యల్ని తగ్గించడంలో వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది. పచ్చి వెల్లుల్లిని నేరుగా తిన్నా మంచి ఫలితం ఉంటుంది. ఎలర్జీ సమస్యతో బాధపడేవారు రోజూ మూడు, నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని తినడం అలవాటు చేసుకోవాలి. చాలామంది దీన్ని నేరుగా తినడానికి ఇష్టపడరు. ఇలాంటి వారు ఈ రెబ్బల్ని తేనెతో కలిపి కూడా తీసుకోవచ్చు. ఇలా చేస్తే సమస్య త్వరగా తగ్గుతుంది.

ఒమేగా – 3 పుష్కలంగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా ఎలర్జీ తగ్గుతుంది. ఎలర్జీ రియాక్షన్లకు గురిచేసే రసాయనాలను నివారించే శక్తి ఒమేగా – 3 ఫ్యాటీ ఆమ్లాల్లో అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువగా లభించే వాల్‌నట్స్, ఫిష్ ఆయిల్, అవిసె గింజలు.. వంటి ఆహార పదార్థాలతో పాటు ఆకుకూరలు, చేపలు, గుడ్లు, చిక్కుడు గింజలు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.