Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!

శరీరానికి అవసరమైన ప్రోబయోటిక్స్ తో కూడా ఆహార పదార్ధాలు తీసుకోవటం వల్ల మంచి చేసే సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. వీటి వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. చెడు బ్యాక్టీరియాను అడ్డుకోవటంలో సహాయపడతాయి.

Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!

Probiotics

Probiotics : రోగ కారక సూక్ష్మజీవులకు విరుద్ధంగా పోరాడగలిగే సామర్ధ్యాన్నే రోగనిరోధక శక్తి అంటారు. ప్రతిమనిషిలో ఇలాంటి రోగనిరోధక శక్తి వ్యాధికారక సూక్ష్మజీవుల నుండి కాపాడే రక్షణగా ఉంటుంది. బ్యాక్టీరియా, వైరస్ తోపాటు ఇతర వ్యాధి కారక క్రిములను తరిమి కొట్టటంలో ఇది క్రియాశీలకమైన పాత్ర పోషిస్తుంది. శిశువుగా జన్మించిన నాటి నుండి ప్రతి జీవిలో ఈ రోగనిరోధక శక్తి అనేది ఉంటుంది. తినే ఆహారం, వ్యాధులకు టీకాలు వంటి వాటి ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

పోషకాహార లోపంతో బాధపడేవారిలో అంటు వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. వీరిలో రోగనిరోధక శక్తి సామర్ధ్యాలు తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. మనం తీసుకునే ఆహారం రోగనిరోధక వ్యవస్ధపై ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రొబయాటిక్స్ వంటి కొన్ని ఆహారాలు దోహదంపడతాయి. ప్రొబయాటిక్స్ కడుపులో మంచి బ్యాక్టీరియా పెంచటానికి ఎంతగానో సహాయపడుతుంది. అంటు వ్యాధులు తగ్గించటంలో ఇది సహాయకారిగా పనిచేస్తుంది.

శరీరానికి అవసరమైన ప్రోబయోటిక్స్ తో కూడా ఆహార పదార్ధాలు తీసుకోవటం వల్ల మంచి చేసే సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. వీటి వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. చెడు బ్యాక్టీరియాను అడ్డుకోవటంలో సహాయపడతాయి. ముఖ్యంగా శరీరానికి కావాల్సిన ప్రోబయోటిక్స్ కోసం కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాల అధారిత ఉత్పత్తులైన పాలు, జున్ను, పెరుగు, పాలపొడి వంటి వాటిల్లో ప్రోబయోటిక్స్ అధికమోతాదులో లభిస్తాయి. సోయా పాలు, సోయా ఉత్పత్తులన్నింటి ద్వారా ఈ ప్రోబయోటిక్స్ ను శరీరానికి అందించవచ్చు. తృణధాన్యాల ద్వారా కూడా పొందవచ్చు. రోజు తినే ఆహారం తోపాటు వీటిని కూడా తీసుకోవటం వల్ల నిరోగనిరోధక వ్యవస్ధ బలోపేతానికి ఆస్కారం ఉంటుంది.

జీర్ణ సంబంధిత వ్యాధుల చికిత్సలో ప్రోబయోటిక్స్ ప్రభావవంతంగా ఉపయోగపడతాయి. అనారోగ్యంతో పోరాడటానికి ప్రతిరోధకాలను సృష్టించే సగం కంటే ఎక్కువ కణాలు ప్రేగులలో ఉన్నాయి. ప్రేగులలో సహాయక బ్యాక్టీరియా,ఇతర జీవుల సమతుల్యత వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.