Oats : కేన్సర్ నుండి రక్షణ నిచ్చే… ఓట్స్

ఒత్తిడిని తగ్గించవచ్చు. ఇందులో విటమిన్ బి , బి 6 మంచి మొత్తంలో ఉంటాయి , ఫోలేట్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

Oats : కేన్సర్ నుండి రక్షణ నిచ్చే… ఓట్స్

Oats

Oats : రోజు వారి ఆహారంలో ఓట్స్ చేర్చుకోవటం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రొటీన్లు, పీచు పదార్ధాలు ఓట్స్ లో అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవటం వల్ల నీరసం దరి చేరదు. అంతేకాకుండా తేలికగా, త్వరగా తయారు చేయగలిగిన ఆహారంగా ఓట్ మీల్ ను చెప్పవచ్చు. ఓట్స్ లోని పీచు, ప్రొటీను ఎక్కవ సమయం ఆకలి వేయకుండా చూస్తాయి. అధిక బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. మధుమేహాగ్రస్తులకు ఇది మంచి ఆహారంగా పనిచేస్తుంది.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్ ను తీసుకోవటం వల్ల మధ్యాహ్నం భోజనసమయంలో మరొక పదార్ధం వైపు మనసు వెళ్ళకుండా చూడవచ్చు. ఓట్స్ లో చక్కెర స్ధాయిలను స్ధిరంగా ఉంచుతాయి. దీనిలో ఉండే పీచు కాంప్లె్స్ కార్బోహైడ్రేట్లు రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి. దీంతో శరీరం గ్లూకోజ్ ఇన్సులిన్ సక్రమంగా వినియోగించుకుంటుంది. దీని వల్ల షుగర్ దరి చేరదు. ఓట్స్‌లో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేసి శరీర వాపును తగ్గిస్తాయి.

ఓట్స్ తో కేన్సర్ నుండి రక్షణ నిస్తుంది. వోట్మీల్ లో క్యాన్సర్లను ఆపటానికి లిగ్నన్ మరియు ఎన్తెరోలక్టోనే అనే ఫైటోకెమికల్స్ సమృద్ధిగా ఉంటాయి. హార్మోన్ సంబంధిత క్యాన్సర్లు నివారించడంలో సమర్థవంతమైనదని పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్ధ పనితీరు మెరుగవుతుంది. వ్యాధినోరధక శక్తి బలపర్చటంలో ఓట్స్ ను మించింది లేదనే చెప్పాలి. ఓట్స్ లో ఉండే ప్రత్యేక మైన ఫైబర్ బెలాగ్లూకాన్, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఫలితంగా గుండె జబ్బులు దరి చేరకుండా ఉంటాయి. 40 గ్రాముల ఓట్స్‌లో ఒక రోజుకు సరిపడా మెగ్నీషియం ఉంటుంది. రక్తపోటుని నియంత్రిండానికీ, రక్తనాళాలు కుంచించుకుపోకుండా ఉండేందుకు ఎంతగానో తోడ్పడుతుంది.

ఒత్తిడిని తగ్గించవచ్చు. ఇందులో విటమిన్ బి , బి 6 మంచి మొత్తంలో ఉంటాయి , ఫోలేట్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఓట్స్ లో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు బ్యాక్టీరియాను దూరంగా ఉంచుతాయి. చర్మానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. ఓట్స్‌లో సిలికాన్ ఆమ్లం జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది.