స్కూళ్లల్లో లేకపోవడం.. పిల్లలపై కనిపించని ప్రభావం ఉంటుందంటున్న సైకాలిజిస్టులు!

  • Published By: sreehari ,Published On : July 6, 2020 / 06:34 PM IST
స్కూళ్లల్లో లేకపోవడం.. పిల్లలపై కనిపించని ప్రభావం ఉంటుందంటున్న సైకాలిజిస్టులు!

చదువుకోవాల్సిన వయస్సు ఇది. పిల్లలకు ఆటలెంత ముఖ్యమో వారికి చదువు కూడా అంతే అవసరం. ఆహ్లాదకరైమన వాతావరణంలో చదువుకునేలా చిన్నారులను ప్రోత్సహించాలి. కానీ, ప్రస్తుత పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి… అసలే కరోనా కాలం.. ఈ పరిస్థితుల్లో పిల్లలు బయటకు వచ్చి స్కూళ్లో చదువుకోవాలంటే ప్రాణాంతకం కూడా… తప్పని పరిస్థితుల్లో పిల్లలంతా ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది. స్కూల్ వాతావరణంలోనే చదువుకునేందుకు వీలుంటుంది.. పిల్లలు స్కూళ్లలో లేకపోవడం కారణంగా వారిలో కనిపించని ప్రభావం ఉంటుందని సైకాలిజిస్ట్ ఒకరు వివరించారు.

తరగతి గదిలో స్పీకింగ్ స్కిల్స్ తోపాటు కమ్యూనికేషన్ సిల్స్ వంటి ఎన్నో రకాల నైపుణ్యాలను పొందాలంటే పిల్లలు స్కూళ్లకు వెళ్లాల్సిందే. కానీ, ఇప్పుడు కరోనా ముప్పు పొంచి ఉంది. స్కూళ్లు తెరిచే పరిస్థితి లేదు. UEL సైకాలిజిస్ట్ డాక్టర్ Sam Wass ప్రకారం.. పిల్లలు తమ తోటివారితో కీలక నైపుణ్యాలను పెంపొందించు కోలేకపోతున్నారని అన్నారు. పిల్లలు తమ తల్లిదండ్రులతో మాత్రమే ఎక్కువ సమయం గడుపుతున్నారు. చదువు పరంగా సరైన వాతావరణం లేక ఏకాగ్రత కోల్పోతున్నారని డాక్టర్ వాస్ చెప్పారు.

మాధ్యమిక పాఠశాలలు ఇప్పుడు 10, 12 మంది విద్యార్థులను సురక్షితంగా ఉండేలా చూడాల్సిన పరిస్థితి. పరిశుభ్రత, సామాజిక దూరాన్ని తప్పక పాటించాలి. పిల్లలను తరగతి గదుల్లోకి తీసుకురావడం ఎందుకు అంత ముఖ్యమైనదో వాస్ వివరించారు. పెద్దవారితో సంభాషించడం ఎల్లప్పుడూ అసమానత కలిగి ఉంటుంది. పిల్లవాడికి పెద్దవారికి మధ్య తేడా అదేనని అన్నారు. చిన్నారులు తమ తోటి చిన్నారులతో కలిసి సంభాషించినప్పుడే వారిలో సమానత భావాన్ని పెంపొందిస్తుందని అంటున్నారు. ఎందుకంటే.. ఒకరినొకరు స్నేహాంగా మెలుగుతారు.

వయస్సు పరంగా ఇద్దరూ సమానమనే భావన ఎక్కువగా ఉంటుంది. సమానమైన పోటీగా అనిపిస్తుందని చెప్పారు. ఇలాంటి పరిస్థితులలో ఒప్పించటం నేర్చుకోవడం పిల్లలు ఇంట్లో పొందలేని పాఠశాల అనుభవంలో నిజంగా ముఖ్యమైన భాగమన్నారు. తమను తాము ఎలా నిలబెట్టుకోవాలో నేర్చుకోవడంలో చాలా కష్టపడాల్సి వస్తుంది. సామాజికంగా ఒంటరిగా ఉన్న పిల్లలు తక్కువ విద్యను సాధించగలరని తెలిసిన విషయమేనని అంటున్నారు. ముఖ్యంగా ఇంటి జీవితం కష్టంగా భావించే పిల్లలు ఎక్కువగా పాఠశాలను ప్రేమిస్తారని చాలా మంది ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే ఆ పిల్లలు చాలా విశ్రాంతిగా ఉంటారని డాక్టర్ వాస్ చెప్పుకొచ్చారు.