Brain Condition: ఆమెకో వింత సమస్య.. అందంగా కనిపిస్తే అమాంతం పడిపోతుంది

అరుదైన బ్రెయిన్ డిజార్డర్ తో బాధపడుతున్న 32ఏళ్ల మహిళ ఎవరైనా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తే చాలు. స్పృహ తప్పుతుంది అలా కుప్పకూలిపడిపోతుంది.

Brain Condition: ఆమెకో వింత సమస్య.. అందంగా కనిపిస్తే అమాంతం పడిపోతుంది

Brain Disorder

Brain condition: ఏదైనా అద్భుతం జరిగితేనో.. రక్తం చూస్తేనో కళ్లు తిరిగి పడిపోయేవాళ్లు ఉంటారు. కానీ, అందం చూస్తే కూడా అదుపు తప్పే వాళ్లుంటారా.. ఉన్నారండీ. అరుదైన బ్రెయిన్ డిజార్డర్ తో బాధపడుతున్న 32ఏళ్ల మహిళ ఎవరైనా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తే చాలు. స్పృహ తప్పుతుంది అలా కుప్పకూలిపడిపోతుంది.

కిర్స్టీ బ్రౌన్ అనే మహిళ కెటాప్లెక్సీ అనే బ్రెయిన్ సమస్యతో బాధపడుతుంది. అంటే కోపం, భయం, నవ్వు లాంటివి వచ్చినప్పుడు కండరాల పక్షవాతం రావొచ్చు. ఈ సమస్య అరుదైనా.. వచ్చినప్పుడల్లా స్పృహ లేకుండా చేస్తుంది. అలా ఓ రెండు నిమిషాలు పడిపోయి తర్వాతకు గానీ లేవలేదు.

అలా రోజుకు ఐదు సార్లు జరుగుతుందట. అలా జరగకుండా ఉండటానికి కిర్‌స్టీ పబ్లిక్ ప్రదేశాల్లో తల వంచుకుని మాత్రమే నడుస్తుందట.

ఇది చాలా చికాకు పుట్టిస్తుంది. నేనొకసారి షాపింగ్ కు వెళ్లినప్పుడు అక్కడ వస్తువు బాగా నచ్చింది. అంతే నా కాళ్లు బ్యాలెన్స్ తప్పాయి. పక్కనే ఉన్న మా వాళ్ల మీద పడిపోయా. ఎవరైనా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తే.. నా కాళ్లు అదుపుతప్పుతాయి. అందుకే సేఫ్టీ కోసం కళ్లు కిందకే ఉంచుకుని నడుస్తా’ అని ఆమె చెప్తోంది.

ఈ ప్రమాదం జరగడానికి పగలు, రాత్రి తేడా లేదు. ఎప్పుడైనా రావొచ్చు. అలా పడిపోయినప్పుడు గాయాలేమీ జరగకుండా ఉండటానికి జాగ్రత్త పడుతున్నా. అందుకే ఇల్లు మారి గ్రౌండ్ ఫ్లోర్ లో తీసుకున్నా. నవ్వినా, కోపం చూపించినా ఈ సమస్య వచ్చేస్తుంది’ అని ఇద్దరు పిల్లల తల్లి అయిన కిర్‌స్టీ అంటున్నారు. ఆమె చిన్నతనంలో తలకు గాయం అవడంతో జన్యుపరంగా ఆలస్యంగా రావాల్సిన సమస్య కాస్త ముందే వచ్చింది.