Raw Mango : కాలేయానికి మేలు చేసే పచ్చి మామిడి పండు!

పచ్చి మామిడిపండ్లలో ఉండే పోషకాలు కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరం నుండి వ్యర్ధాలను బయటకు పంపటంలో సహాయపడతాయి. చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తాయి.

Raw Mango : కాలేయానికి మేలు చేసే పచ్చి మామిడి పండు!

Raw Mango Fruit

Raw Mango : వేసవిలో మామిడి పండ్లు అందరికి అందుబాటులో ఉంటాయి. ఆరోగ్యానికి మామిడి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. అయితే పండిన మామిడి పండును ఎక్కువగా తింటే శరీరంలో ఉష్ణోగ్రతలు పెరిగే ప్రమాదం ఉంటుంది. అయితే పచ్చి మామిడి పండ్లు తినటం వల్ల ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలు చేకూరతాయి. గర్భం దాల్చిన మహిళలు ఎక్కువ ఇష్టంగా పచ్చి మామిడి కాయలను తింటుంటారు. పచ్చి మామిడి పండ్లను కోసుకుని ఉప్పు, కారం చల్లుకుని తింటుంటే ఆమజానే వేరేగా ఉంటుంది.

పచ్చి మామిడిలో విటమిన్ ఎ, బి6, సీ, కె వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్ తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. వేసవిలో త్వరగా డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడటంలో సహాయకారిగా పనిచేస్తుంది. వడదెబ్బ తగలకుండా చూస్తుంది. వేసవి కాలంలో ఉదర సంబంధిత సమస్యలు అధికంగా ఉంటాయి. జీర్ణసమస్యల నుండి ఉపశమనం పొందాలన్న, జీర్ణాశయం బలోపేతం కావాలన్న పచ్చి మామిడి ముక్కలను తీసుకోవటం మంచిది.

పచ్చి మామిడిపండ్లలో ఉండే పోషకాలు కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరం నుండి వ్యర్ధాలను బయటకు పంపటంలో సహాయపడతాయి. చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తాయి. కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచే గుణం వీటిలో ఉంది. వీటిలో ఉండే అధిక ఫైబర్ వల్ల బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. అయితే కడుపు నొప్పి ఉన్న వారు పచ్చి మామిడి పండును తినకపోవటమే మంచిది. అతిగా పచ్చి మామిడి పండ్లను తింటే వాంతులు, దురుద, గొంతునొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.