ఉదయాన్నే మొదట నీళ్లు తాగడానికి గల కారణాలివే

ఉదయాన్నే మొదట నీళ్లు తాగడానికి గల కారణాలివే

మన ఆరోగ్యాని కాపాడుకోవాలంటే మంచి ఫుడ్, ఫ్రూట్స్ మాత్రమే తింటే సరిపోదు.. ఈ పోటి ప్రపంచంలో మనం కనీసం మంచి నీటిని కూడా తాగడం మర్చిపోతున్నాం. దీని వల్ల మన ఆరోగ్యాన్ని మనకి తెలియకుండా కోల్పోతున్నాం. అందుకే ఇప్పుడైనా వాటర్ ఎక్కువగా తాగండి. నీటి వల్ల ఉపయోగాలు ఇవే..

1. ఉదయాన్నే లీటర్ నీటిని త్రాగడం వలన 24 శాతం మెటబాలిజంను పెంచుతుంది. అంతేకాదు పెద్దప్రేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది. ఇకపొతే ముఖ్యంగా డీహైడ్రేషన్కు లోనుకాకుండా ఉండాలంటే నీటిని ఎక్కువగా తీసుకోవాలి.

2. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు రకరకాల జబ్బులు రావచ్చు నీరు తక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. మంచి నీరు తాగడం వల్ల జీర్ణప్రక్రియ సక్రమంగా జరిగి మలబద్దకాన్ని నివారిస్తుంది.

3. డీహైడ్రేట్ కావడం వల్ల కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి (స్ట్రెస్ హార్మోన్) ఒకసారి ఒత్తిడిగా అనిపించినప్పుడు దాన్ని తట్టుకోవడం ఎంత కష్టమో మీకు తెలుసు… కాబట్టి ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల కార్టిసాల్ స్థాయిని తగ్గించడం మరియు మెదడు ఈమెయిల్ పెంపు ముందు ఒత్తిడిని అదుపులో ఉంచడం ద్వారా పోరాడుతుంది.

4. డీహైడ్రేషన్ మరియు ప్రకోప పేగు సిండ్రోమ్ లక్షణాలు మధ్య బలమైన సంబంధం ఉంది… ప్రత్యేకంగా మలబద్ధకం. మనకు దాహం వేసి సమయానికి ఒంట్లో నీటి శాతం తగ్గుతుంది తలనొప్పి అలసట ఉన్నాయంటే మరింత ఎక్కువ నీళ్లు తాగాలి కాబట్టి ఎక్కువ పనులు చేసేవారు, వ్యాయామాలు చేసేవారు తరుచుగా మంచినీరు తాగడం మంచిది.

5. శరీరంలో నీటిశాతం లేకపోతే చర్మం ముడతలు పడటం చర్మ సమస్యలు వంటివి ఏర్పడతాయి. అందుకే మన శరీరంలో 75 నుంచి 80 శాతం నీరు ఉండాలి. ప్రతి రోజు నీరు తాగితే చర్మం పై రంద్రాలు క్లీన్ అయ్యి చర్మం అందంగా, కోమలంగా ఉంటుంది.