Potassium Rich Foods : పోటాషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవటం ద్వారా హైబీపీని తగ్గించుకోండి!

ఎంత ఎక్కువ పొటాషియం తింటే, మూత్రం ద్వారా సోడియం అంత ఎక్కువగా పోతుంది. పొటాషియం మీ రక్తనాళాల గోడలపై ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

Potassium Rich Foods : పోటాషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవటం ద్వారా హైబీపీని తగ్గించుకోండి!

Reduce Hypertension by Eating Potassium

Potassium Rich Foods : పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు అధిక రక్తపోటు నిర్వహణలో కీలకపాత్రపోషిస్తాయి. ఎందుకంటే పొటాషియం సోడియం యొక్క ప్రభావాలను తగ్గిస్తుంది. ఎంత ఎక్కువ పొటాషియం తింటే, మూత్రం ద్వారా సోడియం అంత ఎక్కువగా పోతుంది. పొటాషియం మీ రక్తనాళాల గోడలపై ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యంగా ఉన్న 120/80 కంటే ఎక్కువ రక్తపోటు ఉన్న పెద్ద వయస్సు వారికి ఆహారం ద్వారా పొటాషియంను తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అయితే మూత్రపిండాల వ్యాధి ఉన్న రోగులలో, శరీరం పొటాషియంను తీసుకోవటం అన్నది వైద్యుల సలహా మేరకు మాత్రమే చేయాలి.

ఆరోగ్య‌వంత‌మైన జీవన విధానం, చ‌క్క‌ని డైట్‌ను పాటించ‌డం వ‌ల్ల హైబీపీని చాలా సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు పొటాషియం ఎంత‌గానో మేలు చేస్తుంది. పొటాషియం అధికంగా ఉండే ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల హైబీపీ త‌గ్గుతుంది. దీనివల్ల ర‌క్త‌నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఒత్తిడి, ఆందోళ‌న కూడా త‌గ్గుతాయి. మ‌రి పొటాషియం అధికంగా ఉండే ఆ ఆహారాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు, ఆకుకూర‌ల‌ను నిత్యం తీసుకోవాలి. వీటిల్లో ఉండే పోష‌కాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పాల‌కూర‌లో పొటాషియం మ‌న‌కు స‌మృద్ధిగా ల‌భిస్తుంది. దీన్ని స‌లాడ్లు లేదా జ్యూస్ రూపంలో తీసుకోవ‌చ్చు. అలాగే ఇత‌ర ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల కూడా పొటాషియం ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలో హైబీపీని త‌గ్గించుకోవ‌చ్చు.

అలాగే అర‌టి పండ్లలో పొటాషియం పుష్క‌లంగా ఉంటుంది. అలాగే విట‌మిన్ సి కూడా స‌మృద్ధిగా ఉంటుంది. ఈ పోష‌కాలు జీర్ణ‌శ‌క్తిని పెంచుతాయి. ఆక‌లిని నియంత్రిస్తాయి. అర‌టి పండ్ల‌లో అధికంగా ఉండే ఫైబ‌ర్ ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌కుండా చేస్తుంది. దీంతో అధిక బ‌రువును చాలా సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే అర‌టి పండ్ల‌లో ఉండే పొటాషియం వ‌ల్ల హైబీపీ కూడా త‌గ్గుతుంది.

పుచ్చ‌కాయ‌ల్లో అధికంగా ఉండే పొటాషియం హైబీపీని త‌గ్గిస్తుంది. పుచ్చ‌కాయ‌ల్లో ఉండే లైకోపీన్‌, విట‌మిన్ ఎ, సి, అమైనో యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు మ‌న శ‌రీరానికి పోష‌ణ‌ను, ఆరోగ్యాన్ని ఇస్తాయి. పెరుగులో కాల్షియం, పొటాషియంలు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి జీర్ణాశ‌యంలో ఉండే మంచి బాక్టీరియాకు మేలు చేస్తాయి. హైబీపీ ఉన్న‌వారికి పెరుగు చ‌క్క‌ని ఆహారంగా చెప్ప‌వ‌చ్చు. దీన్ని నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల హైబీపీ త‌గ్గుతుంది.

వీటితోపాటుగా ఆప్రికాట్లు, నేరేడు పండు రసం, అవకాడోలు, తక్కువ కొవ్వు పాలు, కొవ్వు రహిత పెరుగు, ద్రాక్షపండు, ఆకుకూరలు, పుట్టగొడుగులు, నారింజ, బటానీలు, బంగాళదుంపలు, పాలకూర, టమోటాలు, తదితర ఆహారాల ద్వారా పొటాషియం లభిస్తుంది.