Calcium : శరీర రుగ్మతలను తగ్గిస్తుంది! ఎముకలకు బలాన్ని ఇస్తుంది.

ప్రతిరోజు శరీరానికి 1000 నుండి 1500 మి.ల్లీ గ్రాముల కాల్షియం అవసరత ఉంటుంది. ఇంతకంటే అదనంగా కాల్షియం శరీరంలో చేరినా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి.

Calcium : శరీర రుగ్మతలను తగ్గిస్తుంది! ఎముకలకు బలాన్ని ఇస్తుంది.

Reduces body ailments! Calcium gives strength to bones

Calcium : మనిషి శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజం కాల్షియం. అనేక రుగ్మతలను తగ్గించకలిగిన శక్తి కాల్షియానికి ఉంది. ఎముకల్లో తగినంత పరిమాణంలో కాల్షియం ఉంటేనే ఎముకలు బలంగా ఉంటాయి. లేకుండా ఎముకలు బలహీనంగా మారతాయి. కండరాల వ్యాకోచ , సంకోచాలకు కాల్షియం తప్పనిసరిగా అవసరం. ఎముకల పటుత్వం, దంతాల ఆరోగ్యం అన్నది కాల్షియంపై అధారపడి ఉంటుంది.

శరీరంలో కాల్షియం తగ్గితే అధిక రక్తపోటు సమస్యకు దారితీస్తుంది. గర్భవతులకు కాల్షియం చాలా ముఖ్యమైనది. పిల్లల ఎదుగుదలకు కాల్షియం తగినంత పరిమాణంలో అవసరమౌతుంది. అందుకే గర్భవతులకు నిపుణులు కాల్షియం ట్యాబ్లెట్లు తీసుకోవాలని సూచిస్తుంటారు.

తినే ఆహారంలో కాల్షియం అధికంగా లభించే పదార్ధాలు ;

మనం రోజువారి అనేక ఆహారాలను తీసుకుంటుంటాం. అయితే వాటిలో వరి , గోధుమ , కొబ్బరి, జామ, పుచ్చ, నారింజ, రేగు, దానిమ్మ, కాప్సికం, అనప, కాకర, బంగాళదుంప, మామిడికాయ వంటి ఆహారపదార్ధాల్లో కాల్షియం పరిమాణం చాలా తక్కువ మోతాదులో ఉంటుంది.

ఇవి కాకుండా అనేక ఇతర పదార్దాల్లో కాల్షియం పెద్ద మొత్తంలో ఉంటుంది. వాటిని తీసుకోగలిగితే మంచి ప్రయోజనం ఉటుంది. అలాంటి వాటిలో సోయా చిక్కుడు, వాల్నట్, క్యారెట్, క్యాలీఫ్లవర్, కరివేపాకు, పుదీనా, పసుపు , పొన్నగంటి కూర, జున్ను, గుడ్లు, చేపలు, జీలకర, ధనియాలు, రాగులు, నువ్వులు, పొట్టుతో కూడిన మినుములు, ఉలవలు, పిస్తా, బాదం, ఎండుకొబ్బరి, చిలకడదుంపలు వంటి వాటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

ప్రతిరోజు శరీరానికి 1000 నుండి 1500 మి.ల్లీ గ్రాముల కాల్షియం అవసరత ఉంటుంది. ఇంతకంటే అదనంగా కాల్షియం శరీరంలో చేరినా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. అదేక్రమంలో మనం తీసుకున్న ఆహారంలోని కాల్షియాన్ని శరీరం గ్రహించాలంటే రోజువారిగా డి విటమిన్ అవసరం. ఇందుకోసం రోజు కొంత సమయం సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.