Benefits Of Nirgundi : కీళ్ళవాపు, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనాన్ని కలిగించటంతోపాటు వావిలాకుతో మరెన్నే ప్రయోజనాలు!

స్త్రీలలో సంతానోత్పత్తి స్థాయిలను మెరుగు పరచడంలో, చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా వావిలాకు ముఖ్య పాత్ర పోషిస్తుంది.

Benefits Of Nirgundi : కీళ్ళవాపు, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనాన్ని కలిగించటంతోపాటు వావిలాకుతో మరెన్నే ప్రయోజనాలు!

Benefits Of Nirgundi

Benefits Of Nirgundi : మన చుట్టూ లభించే విభిన్న రకాల మొక్కలు మనకు తెలియకుండానే ఎన్నో రకాలుగా ఉపయోపడుతుంటాయి. వాటిని మనం పిచ్చిమొక్కలుగా భావిస్తాం. అయితే వాటిలో అనేక ఔషదగుణాలు వ్యాధులను దరిచేరకుండా మనల్ని కాపాడాతాయి. అలాంటి వాటిలో వావిలాకు కూడా ఒకటి. దీనినే నిర్గుండిగా పిలుస్తారు. గ్రామాల్లో పొలం గట్ల వెంట వావిలాకు చెట్లు విరివిగా పెరుగతాయి. మన పెద్దలు దీనిని ఎన్నో ఔషదగుణాలు కలిగిన మొక్కగా బావించి వినియోగించేవారు. అయితే ప్రస్తుత తరం వారికి ఈ మొక్క గురించి పెద్దగా తెలియదు.

వావిలాకు మొక్కలలో ఎన్నో ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒంటి నొప్పులు వంటి వాటి నుండి ఉపశమనం కలిగించేందుకు దీనిని మించింది లేదని చెప్పవచ్చు. నొప్పులకోసం చాలా మంది పెయిన్ కిల్లర్స్ ను తీసుకుంటుంటారు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సహాజ సిద్ధంగా లభించే వావిలాకుతో ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా నొప్పులను నివారించుకోవచ్చు. కీళ్ల వాపు, కీళ్ల నొప్పులను నివారించటంలో వావిలాకు బాగా ఉపకరిస్తుంది. ఈ ఆకులను మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకుని నొప్పులనున్న ప్రదేశంలో రాయటం వల్ల ఉపశమనం కలుగుతుంది.

అంతేకాకుండా డెలివరీ అయిన తర్వాత మహిళలు స్నానాలకు ఈ ఆకులను ఉపయోగించేవారు ఈ ఆకులను నీటిలో వేసి ఆ సారంతో స్నానం చేస్తే శరీరంలో నొప్పులు తగ్గుతాయయి. అనాల్జేసిక్, యాంచీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఈ మొక్కలో ఉన్నాయి. ఈ ఆకుల కషాయం శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. దీంతో బరువు సులభంగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఆకుల నుండి తయారు చేసే నూనె వల్ల గాయాలు, అంతర్గత రుగ్మత వల్ల వచ్చే కండరాలు, కీళ్ల నొప్పుల నొప్పి, వాపును తగ్గిస్తుంది. ఇది కాళ్ల పగుళ్లను కూడా నయం చేయడానికి బాగా పనిచేస్తుంది.

వావిలాకు పొడిని అర స్పూన్ తీసుకుని 2 కప్పుల నీటిలో కలిపి సగం నీరు అయ్యేవరకు ఉడికించి వడగట్టి తాగితే దగ్గు,గొంతు చికాకు,జ్వరం వంటివి తగ్గిపోతాయి. స్త్రీలలో సంతానోత్పత్తి స్థాయిలను మెరుగు పరచడంలో, చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా వావిలాకు ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఋతుస్రావం ప్రారంభమయ్యే ముందు రోజల్లో మహిళల్లో నెలకొనే మానసిక, శారీర సమస్యలను తగ్గేంచటంలో సహాయకరిగా పనిచేస్తుంది. ఆకలిని కూడా పెంచటంతోపాటుగా జీర్ణక్రియలో ఏర్పడే సమస్యలను తొలగిస్తుంది. రక్తస్రావం పైల్స్ చికిత్సకు దీని పొడి లేదా రసం తీసుకోవచ్చు. వ్యవసాయంలో హానికరమైన కీటకాలను నివారించటానికి వావిలాకులతో కషాయం తయారు చేసుకుని ఉపయోగించవచ్చు.