Orange Peel : నారింజ తొక్కే కదా అని తీసిపడేస్తున్నారా! ప్రయోజనాలు తెలిస్తే?

రక్తంలో చక్కెర స్ధాయిలను నియంత్రిస్తుంది. డయాబెటిస్ చికిత్సలో సైతం నారింజ తొక్క సారం సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు దంతాలను సంరక్షించటంతోపాటు, దంత క్షయ కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి.

Orange Peel : సిట్రస్ జాతి పండ్లలో నారింజ కూడా ఒకటి. శరీరానికి ఎంతో మేలు చేసే పండుగా నారింజను చెప్పవచ్చు. వాస్తవానికి చాలా మంది నారింజను తినే సందర్భంలో పైనున్న తొక్కను తొలగించి పారేస్తుంటారు. అయితే నారింజ తొక్కతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం తెలియక అలా చేస్తుంటారు. నారింజ పై తొక్కలో ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఇవి అనేక వ్యాధులను నివారించటంలో సహాయపడతాయి.

100 గ్రాముల ముడి నారింజ పై తొక్కలో 72.50 గ్రా నీరు, 97 కిలో కేలరీలు శక్తి ఉంటుంది. అంతేకాకుండా నారింజ పండులో లాగానే తొక్కలోకూడా ప్రొటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, భాస్వరం, జింక్, సోడియం, ఫోలెట్, విటమిన్ ఎ, ఇ వంటి ఖనిజాలు ఉంటాయి. క్యాన్సర్ కారకాలను సైతం తొలగించే శక్తితోపాటు, డిఎన్ ఎ నష్టాన్ని తగ్గించటంలో సహాయకారిగా పనిచేస్తుంది. క్యాన్సర్ కణాలతో పోరడటంలో ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్ దోహదపడుతుంది. క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించకుండా నిరోధించటంతోపాటు, వాటి సామర్ధ్యాన్ని తగ్గిస్తుంది.

గుండె జబ్బులు, డయాబెటిస్, అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక మంట కలిగిన వ్యాధులకు తగ్గించటంలో నారింజ తొక్క ఉపకరిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కడుపులో మంటను తగ్గించటంలో సహాయపడతాయి. నారింజ తొక్కలో హెస్పెరిడిన్ అధికంగా ఉంటుంది. ఈ ఫ్లెవనాయిడ్ రక్తపోటును నియంత్రించటానికి, కొలెస్ట్రాల్ ను తగ్గించటానికి సహాయపడుతుంది. మధ్యం, దూమపానం సేవించే వారిలో గ్యాస్ట్రిక్ అల్సర్ల సమస్య అధికంగా ఉంటుంది. నారింజ తొక్క సారం ఈ గ్యాస్ట్రిక్ అల్సర్లను సమర్ధవంతంగా తగ్గిస్తుందని అధ్యయానాల్లో తేలింది.

రక్తంలో చక్కెర స్ధాయిలను నియంత్రిస్తుంది. డయాబెటిస్ చికిత్సలో సైతం నారింజ తొక్క సారం సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు దంతాలను సంరక్షించటంతోపాటు, దంత క్షయ కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. చర్మనికి మేలు చేయటంలోను ఇది సహాయపడుతుంది. తొక్కలోని నోబెల్టిన్ అనే ఫ్లెవనాయిడ్ చర్మ రంధాలలో ఉండే నూనె, ధూళిని నిరోధించటంలో సహాయపడుతుంది. దీనిని ఫేస్ మాస్క్ గా ఉపయోగించవచ్చు.

నారింజ తొక్క దుష్ఫప్రభావాలు ; గుండె జబ్బులతో బాధపడేవారు నారింజ తొక్క సారాన్ని ఉపయోగించకపోవటమే మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే సైనెఫ్రిన్ వల్ల గుండె పనితీరులో కొన్ని రకాల సమస్యలను కలిగించే అవకాశం ఉంటుంది. అంతేకుండా కొంత మందిలో పక్షవాతానికి దారితీయవచ్చు. దీనిలో ఉండే సినెఫ్రిన్ కంటెంట్ వల్ల తలనొప్పి కూడా రావచ్చు. వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుల సలహా తీసుకుని దీనిని ఉపయోగించటం మంచిది.

ట్రెండింగ్ వార్తలు