Sunflowers Face East : పొద్దుతిరుగుడు పూలు ఎప్పుడూ తూర్పునే ఎందుకు చూస్తాయంటే?

పొద్దుతిరుగుడు పువ్వులు పెరుగుతున్న కొద్ది తూర్పుముఖంగానే చూస్తుంటాయి. సూర్యోదయం సమయంలో పొద్దుతిరుగుడు తూర్పు వైపు చూస్తున్నట్టుగా కనిపిస్తుంది.

Sunflowers Face East : పొద్దుతిరుగుడు పూలు ఎప్పుడూ తూర్పునే ఎందుకు చూస్తాయంటే?

Researchers Find Out Why Sunflowers Always Face East (1)

Sunflowers Face East : పొద్దుతిరుగుడు పువ్వులు చూడాటానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.. అలాగే ఆసక్తికరంగా అనిపిస్తాయి కూడా. పొద్దుతిరుగుడు పువ్వులు పెరుగుతున్న కొద్ది తూర్పుముఖంగానే చూస్తుంటాయి. సూర్యోదయం సమయంలో పొద్దుతిరుగుడు తూర్పు వైపు చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. సూర్యుడు తూర్పు నుంచి పడమర వైపుకు కదులుతున్నప్పుడు.. పువ్వు పశ్చిమ దిశగా మారుతుంది. సూర్యుడు అస్తమించినప్పుడు.. పొద్దుతిరుగుడు పువ్వు దాని అసలు స్థానానికి తిరిగి తూర్పు వైపుకు వచ్చేస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు కాలిఫోర్నియా యూనివర్శిటీ (University of California)కి చెందిన రీసెర్చర్లు ఒక కొత్త అధ్యయనాన్ని నిర్వహించారు. పొద్దుతిరుగుడు పువ్వులు ఎప్పుడూ తూర్పుముఖంగానే ఎందుకు ఉంటాయో రీసెర్చర్లు గుర్తించారు.

పొద్దుతిరుగుడు శాస్త్రీయ నామం.. Helianthusగా పిలుస్తారు. ఈ పదం గ్రీక్ పదాల నుంచి Sun, Flower గా పేరొచ్చింది. ఈ పొద్దుతిరుగుడు పువ్వుల్లో 70 రకాల జాతులు ఉన్నాయి. ఒక్కో జాతి పువ్వు వేర్వేరు ఆకృతుల్లో ఉంటాయి. కొన్ని పువ్వులు పొడవుగానూ, మరికొన్ని జాతుల పువ్వులు పొట్టిగానూ ఉంటాయి. అంతేకాదు.. పువ్వుల రంగులు కూడా వేర్వేరుగా కనిపిస్తాయి. ఎక్కువగా పొద్దుతిరుగుడు పువ్వులు పసుపు రంగులోనే ఉంటాయి. కానీ, ఎరుపు, ఆరెంజ్, పర్పల్ రంగుల్లో కూడా sunflowers ఉన్నాయి. ఒక్కో పొద్దుతిరుగుడు పువ్వులో వందలాదిగా పెరుగుతాయి. కొన్నిసార్లు వేలాదిగా పెరుగుతాయి. ఈ పువ్వు తల బయటి అంచు వద్ద మొదటి పుష్పం వృద్ధిచెందుతుంది. అక్కడ అనేక నమూనాలను ఏర్పరుస్తుంది. ప్రతి పొద్దుతిరుగుడులో దాదాపు 2,000 వరకు విత్తనాలు ఉంటాయి. ఈ పువ్వులు ఆరోగ్యకరమైన మనుషులుగా చిరుతిండిగానూ అలాగే పక్షులకు ఆహారంగా ఉపయోగిస్తారు.

పరిశోధకులు గమనించింది ఇదే:
సూర్యుడు ఆకాశంలో తూర్పు నుంచి పడమర వైపుకు వెళ్లడం ప్రారంభించగానే.. పొద్దుతిరుగుడు మొక్క కాండం తూర్పు వైపు పడమటి వైపు కంటే వేగంగా పెరుగుతుంది. ఇరువైపులా ఈ అసమాన పెరుగుదల కారణంగా పువ్వు సూర్యుని దిశలో వంగి ఉంటుంది. చివరకు సూర్యుడు అస్తమించినప్పుడు.. కాండం పడమటి వైపు పెరిగిపోతుంది. అప్పుడు తూర్పున పెరుగుదల కంటే ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా కాండం తూర్పు వైపు వంగి ఉంటుంది. సాధారణంగా పొద్దుతిరుగుడు పువ్వులు హెలియోట్రోపిజమ్‌ను ప్రదర్శిస్తాయని గుర్తించారు. అందుకే వాటి కాండం రోజుకు వేర్వేరు సమయాల్లో వేర్వేరు రేట్ల వద్ద పెరుగుతుందని రీసెర్చర్లు భావిస్తున్నారు.

మనుషుల మాదిరిగానే, ఈ పొద్దుతిరుగుడు మొక్కలకు అంతర్గత జీవ గడియారాలు ఉన్నాయి. దీనినే సిర్కాడియన్ రిథమ్ (circadian rhythm) అని పిలుస్తారు. మానవుని సిర్కాడియన్ లయ శరీరంలో అనేక శారీరక రసాయన మార్పులను సృష్టిస్తుంది. అలాగే ఈ మొక్క సిర్కాడియన్ రిథమ్ సుమారు 24-గంటల చక్రాలలో మార్పులు చెందుతుంది. కొత్త అధ్యయనంలో భాగంగా కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన అదే పరిశోధకులు పరిపక్వ దశలోని పొద్దుతిరుగుడు పువ్వులు తూర్పు వైపునే ఎందుకు చూస్తాయో గుర్తించారు.

పొద్దుతిరుగుడు కాపిటల్ ఓరియంటేషన్, ఫీల్డ్, నియంత్రిత పరిస్థితులు, పూల శరీరధర్మ శాస్త్రం, పరాగ సంపర్కం, విత్తన లక్షణాల ఆధారంగా పరిశోధక బృందం అంచనా వేసింది. పడమర వైపు ఉన్న పూల తలలతో పోలిస్తే.. తూర్పు ముఖంగా ఉండే పువ్వులు ఉదయాన్నే వెచ్చగా ఉన్నాయని కనుగొన్నారు. తూర్పు వైపు తిరగడం వల్ల తేనెటీగలు పొద్దుతిరుగుడు పువ్వులలో పుప్పొడిని సేకరించడం ద్వారా పరాగసంపర్కానికి దారితీస్తుంది. సూర్యకాంతి తేనెటీగలకు కనిపించే అతినీలలోహిత గుర్తులను కూడా గమనించింది పరిశోధక బృందం. దీనికి సంబంధించి వీడియోను పరిశీలిస్తే.. తూర్పు ముఖంగా ఉన్న పువ్వులు పడమటి వైపు ఉన్న వాటితో పోలిస్తే.. చాలా ఎక్కువ సంఖ్యలో పరాగసంపర్క తేనెటీగలు కనిపించాయి.