ఉల్లి ధర రూ.100 అంట : రెస్టారెంట్‌ ఫుడ్ మరింత ప్రియం

  • Published By: sreehari ,Published On : November 29, 2019 / 11:03 AM IST
ఉల్లి ధర రూ.100 అంట : రెస్టారెంట్‌ ఫుడ్ మరింత ప్రియం

దేశంలో ఉల్లిధరలు భగ్గుమన్నాయి. ప్రతి వంటింట్లో నిత్యావసరమైన ఉల్లి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటేశాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నుంచి రెస్టారెంట్ల వరకు అన్ని చోట్ల ఉల్లి లేనిదే ముద్ద దిగదు అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉల్లి కొరత కారణంగా ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఉల్లి ఏం కొనేట్టటు లేదు.. ఏం తినేటట్టు లేదు అన్న చందంగా మారిపోయింది. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో ఉల్లి రిటైల్ ధర కిలో రూ.70 నుంచి కిలో రూ.100 మధ్య పలుకుతోంది. ప్రత్యేకించి రెస్టారెంట్లలో ఉల్లి కోయకుండానే కన్నీరు పెట్టిస్తోంది. రెస్టారెంట్లు, హోటల్లోకి వెళ్లి భోజనం చేసే ఉల్లి ప్రియులపై దెబ్బ పడింది. రెస్టారెంట్లలో ఉల్లితో చేసిన వంటకాలపై భారీగా ఛార్జీలు వడ్డీస్తున్నారట. 

అదనంగా ఉల్లి వంటకాన్ని అడిగితే అదనంగా చెల్లించాల్సిందేనని రెస్టారెంట్ నిర్వాహకులు అంటున్నారు. ఉల్లి ధరలు పెరగడంతో తమ వ్యాపారాన్ని నిర్వహించడం కష్టంగా మారుతోందని చెబుతున్నారు. దీంతో తమ రెస్టారెంట్లకు వచ్చే కస్టమర్లపై భారాన్ని వేయాల్సి వస్తోందని వాపోతున్నారు. చాలామంది కస్టమర్లు తమ భోజనంలో తప్పనిసరిగా ఉల్లి ముక్కలు కావాలని డిమాండ్ చేస్తుంటారు. దీంతో తమ హోటల్ యాజమాన్యం ఉల్లి అడిగితే ఛార్జీలు అదనమంటూ నోటీసు బోర్డు పెట్టింది. ఉల్లి ముక్కలు అడిగిన కస్టమర్లకు ఒక ప్లేట్ పై రూ.15 అదనంగా ఛార్జ్ చేస్తోంది. 

మొన్నటివరకూ ఉచితంగా వడ్డించిన ఉల్లి ముక్కలను తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తోందని ముంబైలోని సియాన్ కోలివాడా ప్రాంతంలో భారత్ లంచ్ హోం రెస్టారెంట్ యజమాని ప్రకాశ్ శెట్టి తెలిపారు. గతంలో రోజువారీగా కస్టమర్లకు 10కిలోల ఉల్లిని సర్వ్ చేస్తుండేవాళ్లం. ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యంగా మారింది. మరో గత్యంతరం లేక ఉల్లి అడిగిన కస్టమర్లపై అదనంగా ఛార్జీలు వేస్తున్నామన్నారు. మరో రెస్టారెంట్ యజమాని మాట్లాడుతూ.. ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ ధరలు కూడా ఖరీదైనవి మారిపోయాయని అన్నారు. 

ఉల్లి ధరలు పెరగడమే ఇందుకు కారణమని చెప్పారు. సాధారణంలో ఇళ్లల్లో ఉల్లిగడ్డ లేకుండా ఏ వంటకం చేయలేని పరిస్థితి. హోల్ సేల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.15 నుంచి రూ.20లకు పైగా పలుకుతోంది. గత రెండు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో ఉల్లి కొనడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆయన తెలిపారు. రిటైల్ వెజ్ వెండర్ మాట్లాడుతూ.. ‘కొత్త ఉల్లిపాయలపై కిలో రూ.80 ఛార్జ్ చేస్తున్నారు. పాత ఉల్లి స్టాక్ పై కిలో రూ.125 వరకు ఛార్జ్ చేస్తున్నారు.