Ridge Gourd : షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంచే బీరకాయ!

బీరకాయల్లో శరీరానికి కావల్సిన పెప్టైడ్స్‌, ఆల్కలాయిడ్స్ అధికంగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి బీరకాయలు ఎంతో ఉపయోగపడతాయి. ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయకారిగా పనిచేయటం వల్ల షుగర్ లెవల్స్‌ను కూడా కంట్రోల్ లో ఉంచవచ్చు.

Ridge Gourd : షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంచే బీరకాయ!

Fresh Angled Loofah, Angled Gourd (luffa Acutangula Roxb.) Fruits In Baske

Ridge Gourd : అందరికి అందుబాటులో ఉండే కూరగాయల్లో బీరకాయలు ఒకటి. బీరకాయలో అనేక పోషకాలు ఉంటాయి. బీరకాయతో చేసుకునే వంటలు రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. శరీరానికి కావల్సిన విటమిన్లు, మినరల్స్ ఎన్నో బీరకాయల్లో ఉంటాయి. బీరకాయలో కొవ్వు, కొలెస్ట్రాల్ , కేలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి బీరకాయ కూర రూరంలో తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే దీన్ని జ్యూస్‌లా చేసి ఉదయం పరగడుపున ఒక గ్లాస్ మోతాదులో తాగటం వల్ల అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు.

బీరకాయలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి బాగా ఉపకరిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులో విటమిన్ సి, జింక్, రిబోఫ్లేవిన్, మెగ్నీషియం, థియామిన్ వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. వీటిలో ఉండే సెల్యులోజ్ మలబద్ధకాన్ని నివారించటంలో సహాయపడుతుంది. కంటి ఆరోగ్యాన్ని కాపడుకునేందుకు ఇందులో ఉండే బీటా కెరోటిన్ ఉపకరిస్తుంది. ఆకలి నియంత్రణలో ఉంచుతుంది. దీంతో అధిక మోతాదులో ఆహారం తినాలని పించదు.

బీరకాయల్లో శరీరానికి కావల్సిన పెప్టైడ్స్‌, ఆల్కలాయిడ్స్ అధికంగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి బీరకాయలు ఎంతో ఉపయోగపడతాయి. ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయకారిగా పనిచేయటం వల్ల షుగర్ లెవల్స్‌ను కూడా కంట్రోల్ లో ఉంచవచ్చు. తద్వారా అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి.రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి. కామెర్ల వంటి సమస్యలు వచ్చి వారికి బీరకాయను ఆహారంగా తీసుకోవటం వల్ల మంచి మేలు కలుగుతుంది. లివర్‌ను శుభ్ర పరుస్తాయి. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను నివారిస్తుంది.

బీరకాయ అమ్లత్వాన్ని తగ్గిస్తుంది. శరీరంలో వేడిని తొలగిస్తుంది. మూత్రవిసర్జన సాఫీగా సాగేలా చేస్తుంది. అల్సర్ల సమస్య ఉన్నవారు బీరకాయను ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచటంలో సహాయకారిగా పనిచేస్తుంది.