హైదరాబాద్ హలీమ్ @ రూ.800 కోట్ల బిజినెస్

హైదరాబాద్ హలీమ్ @ రూ.800 కోట్ల బిజినెస్

రంజాన్ మొదలైందంటే చాలా హైదరాబాద్ నగర వీధుల నుంచి మెయిన్ సెంటర్ల వరకూ అంతా హలీమ్ హడావుడే. రూ.150 మొదలుపెట్టి వందలకొద్దీ రేట్‌ను కేటాయించి సంపాదిస్తుంటారు నిర్వాహకులు. అందులో లాభాల మాట అటుంచి అమ్మకాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ జీఎస్టీ పుణ్యమా అని వ్యాపారవేత్తల క్రయవిక్రయాలకు ఇట్టే లెక్కలు తెలిసిపోతున్న తరుణంలో హలీమ్ ఒక్క సీజన్‌కు రూ.800కోట్ల వ్యాపారం జరుపుతుందని వెల్లడించింది. 

ఇది కేవలం అంచనా మాత్రమే. ఇక్కడ తయారుచేసిన హలీమ్.. కాలిఫోర్నియా, దుబాయ్‌కు కూడా ఎగుమతి అవుతుందట. బిల్లులు లేకుండా నిర్వహిస్తున్న హలీం స్టాళ్లపై నిఘా ఉంచి 2017-18సంవతత్సరంలో చర్యలు తీసుకున్నారు. దీంతో దాదాపు అంతా లెక్కలోకి వస్తుంది. 

‘5వేల రకాల రెస్టారెంట్లు, హోటళ్లు, చిన్నచిన్న స్టాళ్లు నగరంలో కనిపిస్తూనే ఉన్నాయి. హలీమ్ దెబ్బకు బిర్యానీ సేల్‌లు పడిపోయాయి. ఇంకో మంచి వార్త ఏంటంటే దీని వల్ల చాలా మంది యువతకు ఉపాధి దొరుకుతుంది’ అని హైదరాబాద్ హలీమ్ మేకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంఏ మజీద్ మీడియా సమావేశంలో తెలిపారు. 

చాలా వరకూ ఆర్డర్లు స్విగ్గీ, జొమాటో, యూబర్ ఈట్స్ నుంచి వస్తున్నాయట. అవన్నీ కచ్చితంగా బిల్లింగ్ అయిపోతున్నాయి. ఇది అమ్మేవారు మాత్రం నిజంగా చాలా పేదవారు. షిప్ట్‌ల వారీగా సీజన్‌లో అమ్మకాలు జరుపుతారు’ అని ఆయన పేర్కొన్నాడు.