RTPCR-Rapid Test : ర్యాపిడ్‌, ఆర్టీపీసీఆర్‌ టెస్టుల్లో ఏది బెటర్.. నిర్ధారణ ఎలా? ఎందులో కరెక్ట్ ఫలితాలు వస్తాయి?

కరోనా లక్షణాలు కనిపిస్తే చాలు.. వైరస్ సోకిందనే భయంతో చాలామంది కరోనా టెస్టుల కోసం పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతం కరోనా టెస్టుల్లో ఎక్కువగా ర్యాపిడ్ టెస్టులు చేయించుకుంటున్నారు.. అలాగే ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా చేయించుకుంటున్నారు.

RTPCR-Rapid Test : ర్యాపిడ్‌, ఆర్టీపీసీఆర్‌ టెస్టుల్లో ఏది బెటర్.. నిర్ధారణ ఎలా? ఎందులో కరెక్ట్ ఫలితాలు వస్తాయి?

Rtpcr Tests More Dhan Accurate Rapid Test For Covid 19 Virus

RTPCR-Rapid Tests for Covid-19 : కరోనా లక్షణాలు కనిపిస్తే చాలు.. వైరస్ సోకిందనే భయంతో చాలామంది కరోనా టెస్టుల కోసం పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతం కరోనా టెస్టుల్లో ఎక్కువగా ర్యాపిడ్ టెస్టులు చేయించుకుంటున్నారు.. అలాగే ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా చేయించుకుంటున్నారు. అయితే రెండింటిలో ఏది బెస్ట్? ఎందులో కచ్చితంగా రిజల్ట్ వస్తుంది? అంటే.. వాస్తవానికి ట్రూనాట్, ర్యాపిడ్‌ యాంటీ జెన్‌ టెస్టులను పాయింట్‌ ఆఫ్‌ కేర్‌ అని పిలుస్తారు. ఈ టెస్టు కిట్ లను ఎక్కడి తీసుకెళ్లి అయినా నిర్ధారణ చేసుకోవచ్చు. ట్రూనాట్‌ అనేది ఒక చిప్‌ బేస్డ్‌ టెస్టింగ్‌. అదే ఆర్టీపీసీఆర్‌కు పెద్ద ల్యాబొరేటరీ ఎక్విప్‌మెంట్‌ ఉండాలి. శరీరంలో ఎక్కువ జీన్‌లు ఉంటాయి. ర్యాపిడ్ టెస్టు శరీరంలో కొన్ని జీన్‌లను మాత్రమే గుర్తిస్తుంది.

ఈ జీన్‌లో వైరస్‌ ఉందో లేదో మాత్రమే గుర్తిస్తుంది. తక్కువ సమయంలో రిజల్ట్‌ వస్తుంది. అదే ఆర్టీపీసీఆర్‌లో ఎక్కువ జీన్‌లను గుర్తించే అవకాశం ఉంటుంది. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అందుకే తక్కువ సమయంలో రిజల్ట్‌ వస్తుందని, ఎక్కడైనా టెస్టు చేసుకోవచ్చు.. అందుకే ట్రూనాట్, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులకు అనుమతి ఇవ్వడం జరిగింది. గొంతులో ద్రవం తీసి కిట్‌పై వేస్తే 10 నిమిషాల్లో రిజల్ట్‌ వస్తుంది. దీనిలో పాజిటివ్‌ వస్తే వెంటనే ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేసుకోవాలి. ఆర్టీపీసీఆర్‌నే గోల్డెన్‌ స్టాండర్డ్‌ టెస్టుగా చెప్పుకోవచ్చు. ఇందులో 80-100 శాతం నిర్ధారణ ఉంటుందని చెబుతున్నారు.

కరోనా పాజిటివ్‌ తర్వాత 5–7 రోజుల మధ్య డీడైమర్, హెచ్‌ఆర్‌సీటీ థొరాక్స్‌ వంటి టెస్టులు చేయించుకోవాలి. వైరస్‌ ప్రభావంతో రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంటుంది. డీడైమర్‌ లెవల్స్‌ పెరుగుతుంటే రక్తం మీద ప్రభావం పడుతుందని నిర్ధారించుకోవాలి. రక్తం గడ్డ కట్టకుండా వైద్యుల సూచనల మేరకు బ్లడ్‌ థిన్నర్స్‌ వాడుకోవాలి. కోవిడ్‌ వల్ల ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్షన్‌ కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. న్యూమోనియా శాతం తెలుసుకోవడానికే హెచ్‌ఆర్‌సీటీ థొరాక్స్‌ టెస్టు చేయించుకోవాలి. ఈ టెస్టుతో ఊపిరితిత్తులపై వైరస్‌ ప్రభావం పడిందో లేదో నిర్ధారించుకోవచ్చు.