Alcohol Against Corona: మందుబాబులకు కరోనా వస్తే అంతే సంగతులు

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై రెండో దశ కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌

Alcohol Against Corona: మందుబాబులకు కరోనా వస్తే అంతే సంగతులు

alcohol

Alcohol Against Corona: కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. వేలసంఖ్యలో రోజు వారీ మరణాలు చోటు చేసుకున్నాయి. చికిత్స కోసం వచ్చి ఆస్పత్రుల బయటే తుది శ్వాస విడిచి పెడుతున్నారు. ముఖ్యంగా యువత చాలామంది ప్రాణాలు కోల్పోతున్నట్లుగా తెలుస్తోంది. మద్యపానం, ధూమపానం అధికంగా సేవించేవారికి కరోనా వస్తే కోలుకునే రేటు తక్కువగా, మరణాల రేటు అధికంగా ఉంటోందని రికార్డులు చెబుతున్నాయి.

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై రెండో దశ కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌), భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఆధ్వర్యంలో సంయుక్త ఆధ్వర్యంలో శనివారం వెబినార్‌ జరిగింది. .

రెండో దశ కొవిడ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చిన్నపిల్లల వైద్య నిపుణులు సలహాలు ఇచ్చారు. మొదటిదశ కరోనా వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక రోగాలున్న వారిపై ఎక్కువ ప్రభావం చూపించింది. రెండో దశలో యువత, చిన్నారులు, గర్భిణులు సైతం దీని బారిన పడుతున్నారు.

గర్భిణులకు కరోనా పాజిటివ్‌గా ఉంటే ప్రసవం తర్వాత, అప్పుడే పుట్టిన పిల్లలకు వైరస్‌ సోకుతున్నట్లుగా ఇంతవరకు తేలింది లేదు. కానీ ప్రసవం తర్వాత శిశువులకూ పాజిటివ్‌ వస్తోందన్నారు. శిశువులు, చిన్నారుల్లో తీవ్రత మాత్రం ఎక్కువగా ఉండటం లేదని, అయిపనప్పటికీ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని సూచించారు.

చిన్నారుల్లో గొంతులో నొప్పిగా ఉండి అన్నం తినడానికి ఇబ్బంది పడటం, జ్వరం, విరేచనాలు చిన్నారుల్లో కరోనా లక్షణాలు అని తెలిపారు. మందుబాబులు, పొగరాయుళ్లకు మాత్రం కరోనా సెకండ్ వేవ్‌తో తీవ్రమైన ముప్పు పొంచి ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.