Sabza Nut Water : వేసవిలో సబ్జా గింజల నీళ్లు ఆరోగ్యానికి మేలే!

జిగురాల ఉండే ఈ సబ్జా గింజల వల్ల గ్యాస్, మంట వంటి సమస్యల నుండి ఉపశనం కలిగిస్తాయి. గాయాలు తగిలిన చోట ఈ గింజల్ని నూరి నూనెతో కలిపి రాయాలి. ఇలా చేస్తే పుండ్లు త్వరగా మానతాయి.

Sabza Nut Water : వేసవిలో సబ్జా గింజల నీళ్లు ఆరోగ్యానికి మేలే!

Sabza Nut Water

Sabza Nut Water : వేసవి కాలంలో ఎండ వేడిమి అధికంగా ఉంటుంది. ఎండ తీవ్రత కారణంగా శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈసమయంలో శరీర ఉష్ణోగ్రతలను చల్లబరచటానికి సబ్జాగింజల నీళ్లను సేవిస్తుంటారు. సబ్జా గింజల నీరు జీవక్రియలను చురుగ్గా ఉంచేందుకు దోహదపడతాయి. మహిళ అందాన్ని ఇనుమడింప చేయటంలో సబ్జా గింజల్లో ఉండే ఫోలెట్ ఉపకరిస్తుంది. సబ్జా గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సాల్మన్ చేపల్లో కంటే అధికంగా ఉంటాయి. సబ్జా గింజలను తీసుకోవటం వల్ల ఆర్ధరైటిస్ , హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.

బ్యాక్టీరియా సంబంధిత సమస్యలని నివారించే యాంటీ బయోటిక్ లా పనిచేస్తాయి. నీటితోపాటు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి వాటిల్లో కూడా సబ్జగింజలను కలుపుకుని తాగవచ్చు. ప్రతిరోజు రాత్రి సమయంలో నిద్రకు ముందు సబ్జా గింజలను ఒక గ్లాసు నీటిలో వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. చర్మ సమస్యలను నివారించటంలో బాగా ఉపకరిస్తాయి. ఈ గింజలకు కొద్దిపాటి తడి తగిలితే ఉబ్బిపోతాయి. అందుకే వీటిని తీసుకోవటం వల్ల త్వరగా ఆకలి వేయదు.

జిగురాల ఉండే ఈ సబ్జా గింజల వల్ల గ్యాస్, మంట వంటి సమస్యల నుండి ఉపశనం కలుగుతుంది. గాయాలు తగిలిన చోట ఈ గింజల్ని నూరి నూనెతో కలిపి రాయాలి. ఇలా చేస్తే పుండ్లు త్వరగా మానతాయి. తలనొప్పి , మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడేవారు నీళ్లలో కలుపుకుని తాగితే మానసిక ప్రశాంతత లభిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయటంలో , శరీరంలోని మలినాలను తొలగించటంలో ప్రయోజనకారిగా చెప్పవచ్చు.

గొంతులో మంట, ఆస్తమా, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు, ఉన్న సందర్భంలో గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె, నానబెట్టిన సబ్జాగింజలు వేసుకుని తాగాలి. ఇలా చేయటం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. హై బీపీ సమస్యతో బాధపడేవారు సబ్జాగింజల నీరు తాగటం వల్ల క్రమేపి బీపీ అదుపులోకి వస్తుంది.