KYC అక్కర్లేదు.. SBI జీరో బ్యాలెన్స్ అకౌంట్ కావాలా?

  • Published By: sreehari ,Published On : December 21, 2019 / 01:20 PM IST
KYC అక్కర్లేదు.. SBI జీరో బ్యాలెన్స్ అకౌంట్ కావాలా?

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ కోసం ప్రయత్నిస్తున్నారా? మీ KYC డాక్యుమెంట్లు లేకపోయినా సరే.. కస్టమర్లు ఈజీగా SBI జోరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇటీవలే ఎస్బీఐ ‘బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ Small Account’ లేదా ‘SBI చిన్నమొత్తంలో అకౌంట్’ పేరుతో కొత్తగా ప్రవేశపెట్టింది.

ఈ జీరో అకౌంట్ ఎవరైనా బ్యాంకు కస్టమర్లు ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి గుర్తింపు పత్రాలు అవసరం లేదు. అకౌంట్ ఓపెన్ చేసే కస్టమర్ల వయస్సు 18ఏళ్లు పైబడి ఉంటే చాలు అని బ్యాంకు ఒక ప్రకటనలో వెల్లడించింది. 

SBI small అకౌంట్ గురించి 10 విషయాలు ఇదిగో :
1. ఈ అకౌంట్ లో మినిమం (కనీస నగదు నిల్వ) బ్యాలెన్స్ అవసరం లేదు. గరిష్టంగా రూ.50వేల వరకు డిపాజిట్ చేయొచ్చు. 
 2. ఒక ఏడాదిలో రూ.50 వేలు దాటినా లేదా అకౌంట్లో మొత్తం క్రెడిట్ రూ.లక్ష దాటితే ట్రాన్సాక్షన్ ఇక చేయలేరు. Full KYC ప్రక్రియ తప్ప పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడే ట్రాన్సాక్షన్ అనుమతి ఉంటుంది. 
3. ఒక నెలలో గరిష్టంగా 4 విత్ డ్రాలు మాత్రమే అనుమతి ఉంటుంది. సొంత బ్యాంకు ATM విత్ డ్రాలతో కలిపి ఇతర బ్యాంకుల ATM ట్రాన్సాక్షన్, RTGS/NEFT/Branch క్యాష్ విత్ డ్రాలు, ట్రాన్సాఫర్/ఇంటర్నెట్ డిబెట్స్/EMI ట్రాన్సాక్షన్లు వర్తిస్తాయి. 
4. ఉచితంగా బేసిక్ RuPay ATM-cum-debit cardలను కూడా SBI జారీ చేస్తోంది. ఈ కార్డుపై ఎలాంటి వార్షిక ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. 
5. అకౌంట్ ఓపెన్ చేసిన 12నెలల వరకు ఆపరేషనల్ లిమిటేషన్స్ వర్తిస్తాయి. ఆ తర్వాత మరో 12 నెలల కాల పరిమితిలో ఖాతాదారుడు.. అకౌంట్ ఓపెన్ చేసిన ఏడాదిలోనే ఒకవేళ అధికారిక ధ్రువీకరణ పత్రాలను బ్యాంకులో సమర్పించినట్టు అయితే 24 నెలలు పూర్తి అయిన తర్వాతే అకౌంట్ సంబంధించి రివ్యూ చేశాక మొత్తం లిమిటేషన్స్ బ్యాంకు తొలగిస్తుంది. 
6. ఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని లావాదేవీలు (క్రెడిట్స్) కలిపి మొత్తం రూ.లక్ష దాటకూడదు. 
7. KYC పూర్తి కానీ కారణంగా ఇలాంటి స్మాల్ అకౌంట్లపై మరిన్ని ఆంక్షలు ఉంటాయి.
8. KYC డాక్యుమెంట్లను బ్యాంకులో సమర్పించి రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్లోకి మారవచ్చు. 
9. రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ల మాదిరిగానే స్మాల్ అకౌంట్లపై కూడా ఒకే వడ్డీరేటు ఉంటుంది. ఏడాదిలోపు రూ. లక్ష కంటే తక్కువ డిపాజిట్ చేసిన అకౌంట్లపై 3.25శాతం వడ్డీ రేటు ఉంటుంది.
10. SBI స్మాల్ అకౌంట్లలో ఫారెన్ ట్రాన్సాక్షన్లతో క్రెడిట్ చేసేందుకు అనుమతి లేదు. ఆ వ్యక్తి.. పూర్తిస్థాయిలో అధికారిక ధ్రువీకరణ పత్రాలతో ఐడెంటినీ కలిగి ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుంది.