Level of Depression : మీలో ఒత్తిడి స్థాయి ఎంతో కనిపెట్టే కొత్త రకం రక్త పరీక్ష..

ప్రతి మనిషిలో మానసిక రుగ్మతలు ఉంటాయి. మానసిక ఆందోళనకు అనేక కారణాలు ఉంటాయి. తీవ్ర పని ఒత్తిడి కావొచ్చు.. మరేదైనా ఆందోళన కావొచ్చు..

Level of Depression : మీలో ఒత్తిడి స్థాయి ఎంతో కనిపెట్టే కొత్త రకం రక్త పరీక్ష..

Scientists Develop New Blood Test That Could Diagnose Your Level Of Depression

New Blood Test for Level of Depression : ప్రతి మనిషిలో మానసిక రుగ్మతలు ఉంటాయి. మానసిక ఆందోళనకు అనేక కారణాలు ఉంటాయి. తీవ్ర పని ఒత్తిడి కావొచ్చు.. మరేదైనా ఆందోళన కావొచ్చు.. డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్ వంటి సమస్యలను కొన్నిసార్లు మానిక్ డిప్రెషన్‌గా పిలుస్తారు. ఇదో రకమైన మానసిక రుగ్మత… ఇలాంటి సమస్యలను రక్త పరీక్ష ఆధారంగా గుర్తించే వ్యవస్థను కనిపెట్టారు సైంటిస్టులు. రక్త నమూనాల ఆధారంగా వ్యక్తి మూడ్ డిజార్డర్లతో సంబంధాన్ని మానిటర్ చేయొచ్చునని అంటున్నారు.

ఇందుకోసం కొత్త రకం బ్లడ్ టెస్టు సిస్టమ్ ను డెవలప్ చేశారు.. సాధారణ బ్లడ్ టెస్టు ద్వారా సులభంగా మానసిక ఒత్తిడి స్థాయిని నిర్ధారించవచ్చు.. ప్రపంచవ్యాప్తంగా వందలాది మిలియన్ల మంది శతాబ్దాలుగా మానసిక ఒత్తిడి సమస్యలతో బాధపడుతున్నారు. సాధారణంగా మానసిక రుగ్మతలను నిర్ధారించాలంటే సైకలాజిస్టులు, సైక్రియాటిస్టులు, డాక్టర్ల క్లినికల్ అసిస్ మెంట్లపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు బ్లడ్ టెస్టుల ద్వారా మానసిక అనారోగ్య సమస్యలను నిర్ధారించవచ్చునని చెబుతున్నారు. డిప్రెషన్ సంబంధిత లక్షణాలు లేదా ఇతర అనారోగ్య కారణాలేమైనా ఉన్నాయా? అని రక్త పరీక్ష ద్వారా నిర్ధారించుకోవచ్చు.

భవిష్యత్తులో మానసిక ఒత్తిడిని గుర్తించడానికి ఈ కొత్త రకం రక్త పరీక్ష ఒక ప్రాక్టికల్ ఆప్షన్ అంటున్నారు రీసెర్చర్లు. ఈ కొత్త అధ్యయనంలో రీసెర్చర్లు 26 బయోమార్కర్లను గుర్తించారు. మూడ్ డిజార్డర్లు, డిప్రెషన్, బైపోలర్ డిజార్డర్, మానియా వంటి అనారోగ్య సమస్యలతో సంబంధం ఉందని తేల్చేశారు. బ్లడ్ బయోమార్కర్లు ఒక ముఖ్యమైన టూల్.. డిజార్డర్లను నిర్ధారించే పరీక్ష ఇది.. కొత్త అధ్యయనాన్ని నాలుగేళ్లుగా వందలాది మానసిక బాధితులపై పరీక్షించారు.

వారి బ్లడ్ లోని బయోమార్కర్ల ఆధారంగా వారి మానసిక స్థితిని నిర్ధారించవచ్చునని కనుగొన్నారు. మనిషి జన్యువులు, జెన్యూ ఎక్స్ ప్రెషన్, ప్రోటీన్ ఎక్స్ ప్రెషన్ కు సంబంధించి 1600 అధ్యయనాల డేటాబేస్ తో రక్త నమూనాలను పోల్చి చూశారు.. ఇందులో అనేక బయోమార్కర్లను గుర్తించిన సైంటిస్టులు.. మూడ్ డిజార్డర్లతో సంబంధం ఉందని తేల్చేశారు.