Second Coronavirus Wave : భారత్‌లో ఫస్ట్ కన్నా సెకండ్ వేవ్‌లో ఐదు డేంజరస్ లక్షణాలు ఉన్నాయి.. అవేంటో తెలుసా?

భారతదేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకీ లక్షల్లో కరోనా కేసులు నమోదువుతున్నాయి. వేలాది సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో గత ఏడాదిలో విజృంభించిన మొదటి కరోనా వేవ్ కంటే రెండో వేవ్ అత్యంత ప్రాణాంతకంగా మారింది.

Second Coronavirus Wave : భారత్‌లో ఫస్ట్ కన్నా సెకండ్ వేవ్‌లో ఐదు డేంజరస్ లక్షణాలు ఉన్నాయి.. అవేంటో తెలుసా?

Second Coronavirus Wave In India

భారతదేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకీ లక్షల్లో కరోనా కేసులు నమోదువుతున్నాయి. వేలాది సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో గత ఏడాదిలో విజృంభించిన మొదటి కరోనా వేవ్ కంటే రెండో వేవ్ అత్యంత ప్రాణాంతకంగా మారింది. ఈ రెండో వేవ్.. స్పానీష్ లో విజృంభించిన ఒకప్పటి 1918-20 నాటి స్పానీష్ ఫ్లూ మాదిరిగా విజృంభిస్తోంది. మొదటి కరోనా వేవ్ కంటే రెండో వేవ్ వైరస్ లో ఐదు వ్యత్యాసాలు ఉన్నాయని ఓ నివేదిక వెల్లడించింది. అవేంటో ఓసారి చూద్దాం..

1. కరోనా సోకుతున్నప్పటికీ.. మరో ఏడాది జాగ్రత్తగా ఉండాల్సిందే :
దేశ జనాభాలో 80-85శాతం మంది కరోనా బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులో ఎక్కువగా అసింపథిటిక్ లక్షణాలు కలిగినవారే ఉంటారట.. దేశంలో కరోనా వ్యాప్తిలో వీరే సూపర్ స్ప్రెడర్లుగా మారుతున్నారని అంటున్నారు. అది కూడా ప్రత్యేకించి ఇండోర్ పరిసరాల్లో వాస్తవంగా జరుగుతోందని చెబుతున్నారు. కేవలం మాట్లాడటం ద్వారా ఈ వైరస్ వేగంగా ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తోందని అంటున్నారు. కరోనా సెకండ్ వేవ్‌లో వైరస్ వేరియంట్లు అత్యంత ప్రమాదకరమైనదిగా హెచ్చరిస్తున్నారు.

ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఈ వైరస్ ఒకరి నుంచి మరికొరికి వేగంగా వ్యాపిస్తోందని నివేదిక చెబుతోంది. యూకే స్ట్రయిన్.. పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపిస్తోంది. 50శాతం అత్యధిక రేటు కనిపిస్తోంది. కంటైన్మెంట్ల జోన్లను కఠినంగా ఏర్పాట్లు చేయకపోవడంతో సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని నివేదిక చెబుతోంది. కంటైన్మెంట్ జోన్లలో మైక్రో కంటైన్మెంట్ల జోన్లు ఏర్పాటు చేయాలని నగర అధికారులను కోరుతున్నారు. అయితే ఇప్పుడు ఈ మైక్రో కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు పెద్ద సవాల్ గా మారుతోంది.

2. ఇంట్లో ఒకరికి వస్తే.. కుటుంబం మొత్తానికి వ్యాపిస్తోంది :
కరోనా సెకండ్ వేవ్.. ఇండోర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపిస్తోంది. హౌస్ పార్టీలు, అందరూ ఒకే చోట ఉండటం కారణంగా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. మైక్రో కంటైన్మెంట్ జోన్లు సమర్థవంతంగా నిర్వహించలేకపోవడం వల్లే కుటుంబంలో మొత్తానికి వైరస్ వ్యాపిస్తోంది. ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన వేరియంట్లు ఉన్నాయి. కాంటాక్ట్ ట్రేసింగ్ గైడ్ లైన్స్ అధికారులు ఫాలో కాకపోవడం కూడా వ్యాప్తికి దారితీస్తోంది. హై రిస్క్ ఉన్నవారితో పాటు నేరుగా లక్షణరహిత బాధితులను టెస్టులు చేయకపోవడం కూడా ఒక కారణమని చెప్పవచ్చు. పాజిటివ్ వ్యక్తిని కలిసి 5 రోజుల నుంచి 10 రోజుల మధ్యలో టెస్టు చేయించుకోవాలి. కరోనా నెగటివ్ రిపోర్టులు వచ్చినవారి ద్వారా కూడా వైరస్ వ్యాప్తి అవుతోందని నివేదిక పేర్కొంది. అసింపథటిక్ బాధితులు ఐసోలేషన్ నిబంధలను పట్టించుకోకపోవడంతో వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు.

3. యువకుల్లోనే కరోనా కేసులు ఎక్కువ :
కరోనా వైరస్ అనేది అన్ని వయస్సుల వారికి వ్యాపిస్తుంది. కానీ, సెకండ్ వేవ్ వైరస్ మాత్రం ఎక్కువగా యువకుల్లోనే సోకుతుంది. కరోనా కేసుల్లో ఎక్కువగా యువకులే ఉంటున్నారు. మొదటి వేవ్ కన్నా రెండో వేవ్ లోనే యువకులపై వైరస్ ప్రభావం అధికంగా ఉంటుంది. యువకుల్లో కొమొర్బిడిటీలు ఉన్నవారిలో హై రిస్క్ ఎక్కువగా ఉంటుంది. గత ఏడాది నుంచి కరోనా మరణాల రేటుతో పోలిస్తే.. అన్ని వయస్సుల వారిలో 70ఏళ్ల లోపు ఉన్న కరోనా బాధితులే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు 70ఏళ్ల నుంచి 80ఏళ్లలో కేసులు క్రమంగా పడిపోతుండగా.. 80ఏళ్ల వారిలో కేసులు పెరిగిపోతున్నాయి. సెకండ్ వేవ్ లో వృథ్యాపంలో ఉన్నవారికి మరింత ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. యువతతో పాటు అందరూ కోవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది.

4. ఆక్సిజన్ కొరత విపత్తు :
దేశంలో పలు ఆస్పత్రుల్లో డేటాను ట్రాకింగ్ చేస్తే.. ప్రస్తుత రెండో వేవ్ వైరస్ కారణంగా 54.5 శాతం మంది ఆక్సిజన్ సపోర్టు కోసం ఆస్పత్రుల్లో చేరుతున్నారు. సెప్టెంబర్ 2020 నుంచి నవంబర్ 2020 సమయంలో కంటే ఆక్సిజన్ అవసరమయ్యే కరోనా బాధితులు 13.4శాతం పెరిగినట్టు డేటాలో తేలింది. వీరిలో ఎక్కువగా అసింపథటిక్ రోగులే ఎక్కువగా ఉన్నారు. శ్వాసపరమైన సమస్యతో బాధపడేవారే అధికంగా ఉన్నారు. భారతదేశంలో ఆక్సిజన్ థెరపీ ఒక్కటే ప్రధాన చికిత్సగా మారింది. వీరికోసం ఆక్సిజన్ బెడ్స్ తప్పక ఉండాల్సిన సమయం.. ప్రస్తుతం ఆక్సిజన్ బెడ్స్ 10శాతం మందికి మాత్రమే అవసరం పడుతుంది. దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 26లక్షలకు చేరింది. దేశంలో 12 రాష్ట్రాల్లో 83శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో వారం వ్యవధిలో 18శాతం మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరిగిందని నివేదిక వెల్లడించింది.

5. వ్యాక్సిన్లతో ఆగని వ్యాప్తి.. తీవ్రత మాత్రమే తగ్గుతోంది :
ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లతో పూర్తి స్థాయిలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. కాకుంటే.. కరోనా సోకినప్పటికీ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో వైరస్ తీవ్ర ప్రభావం ఉండటం తగ్గిస్తోంది. ఐసీఎంఆర్ డేటా ప్రకారం.. ప్రతి 10వేల మంది వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఇద్దరు నుంచి నలుగురి వరకు మళ్లీ కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. అంటే దీనిర్థం.. వ్యాక్సిన్ వేయించుకున్నా మళ్లీ కరోనా సోకే అవకాశం ఉంది. అందుకే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నా తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందే..