రెండోసారి కరోనా.. వస్తే రానివ్వండి..

  • Published By: sreehari ,Published On : September 16, 2020 / 03:14 PM IST
రెండోసారి కరోనా.. వస్తే రానివ్వండి..

కరోనా వైరస్ సెకండ్ వేవ్ వచ్చినా అంత పెద్ద ప్రమాదమేమి ఉండదంటున్నారు వైద్య నిపుణులు.. రెండోసారి కరోనా వచ్చినా మొదట్లో ఉన్న ప్రభావం అంతగా ఉండక పోవచ్చు.. ప్రస్తుతం కరోనా కోసం చేస్తున్న కొత్త ట్రీట్ మెంట్లు, లోకల్ లాక్ డౌన్లతో సెకండ్ వేవ్ కరోనా వచ్చినా భయపడాల్సిన పనిలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్చి, ఏప్రిల్ నెలలో కరోనా మహమ్మారితో పోలిస్తే.. సెకండ్ వేవ్ కరోనాకు చాలా వ్యత్యాసం కనిపిస్తోందని చెబుతున్నారు. మార్చి నుంచి కరోనా వైరస్ మరణాలు 100 లోపు తగ్గిపోయాయని Office for National Statistics (ONS) లేటెస్ట్ డేటాలో రివీల్ చేసింది. ఇన్ ఫ్లూంజా, న్యూమోనియా వంటి ప్రాణాంతక వ్యాధులు ఇంగ్లాండ్ వంటి దేశాల్లో కోవిడ్-19 కంటే పది రెట్లు ప్రాణాలు బలిగొంటున్నాయని డేటా తెలిపింది. కరోనా తీవ్రత తగ్గడానికి ప్రధాన కారణాల్లో సామాజిక దూరం, స్థానిక లాక్ డౌన్ కలిపి విజయవంతం చేయడంతోనే కరోనా కేసులు, మరణాలు తగ్గాయని ప్రభుత్వ అధికారులు విశ్వసిస్తున్నారు.



https://10tv.in/e-gopala-app-cows-and-buffalos-what-is-pashu-aadhaar-card-how-will-farmers-get-the-benefit-know-everything/
కరోనా ఇన్ఫెక్షన్ల రేట్లు కూడా సాధారణ స్థితికి చేరుకున్నాయని అంటున్నారు. Belgium scientist Jean-Luc Gala మాట్లాడుతూ.. కరోనా వైరస్ గురించి ఎక్కువ కాలం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సరైన విధంగా చర్యలు చేపడితే చాలని చెప్పారు. చాలావరకు యువతలో కరోనా స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని, కమ్యూనిటీల్లో అధిక ఇమ్యూనిటీని సాధించడానికి సాయపడుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే కరోనా సెకండ్ వేవ్ నియంత్రించేందుకు యూకేలోని 30 మిలియన్ల ఫ్రీ ఫ్లూ జాబ్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంగ్లండ్ లో శీతాకాలంలో కూడా ఫ్లూ వ్యాక్సినేషన్ ప్రొగ్రామ్ రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.



ముఖ్యంగా 50ఏళ్ల వారిత పాటు 11ఏళ్ల చిన్నారులకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఫ్లూ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో శానిటైజేషన్, ముఖానికి మాస్క్ ధరించడం ద్వారా చాలావరకు కరోనాను కట్టడి చేయడం సాధ్యపడుతుందని అధికారులు చెబుతున్నారు. కరోనా తీవ్రతను తగ్గించే dexamethsone వంటి మరిన్ని చికిత్సలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. వెంటిలేటర్లపై ఉన్న కరోనా రోగుల్లో 35 శాతాన్ని మరణ ముప్పు తగ్గించినట్టు గుర్తించామన్నారు. 20 శాతానికి కరోనా మరణాల రేటు తగ్గించిందన్నారు. మహమ్మారి ఆరంభంలోనే చౌకైన ధరకే ఈ డ్రగ్ అందుబాటులోకి వస్తే.. బ్రిటన్లు 5వేల మంది ప్రాణాలతో బయటపడేవారని చెప్పారు.