Covid-19 Second Wave : కరోనా సెకండ్ వేవ్ తీవ్రత 100 రోజులు ఉంటుందట..

కోవిడ్ -19 రెండవ వేవ్ 100 రోజుల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి టీకాలు వేసే వరకు, హెర్డ్ ఇమ్యూనిటీ సాధించే వరకు ఇలాంటి కరోనా వేవ్ లు పుట్టుకుస్తూనే ఉంటాయని ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Covid-19 Second Wave : కరోనా సెకండ్ వేవ్ తీవ్రత 100 రోజులు ఉంటుందట..

Second Wave Of Covid 19 Can Last Up To 100 Days

Covid-19 Second Wave : కోవిడ్ -19 రెండవ వేవ్ 100 రోజుల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి టీకాలు వేసే వరకు, హెర్డ్ ఇమ్యూనిటీ సాధించే వరకు ఇలాంటి కరోనా వేవ్ లు పుట్టుకుస్తూనే ఉంటాయని ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పోలీసు సిబ్బందిలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. కొత్త మ్యుటేట్ చెందిన వైరస్ సోకిన వ్యక్తి రోగనిరోధక శక్తిని సామర్థ్యాన్ని క్షీణించేలా చేస్తుందని అంటున్నారు.

టీకాలు వేసిన వారిలో మళ్లీ వైరస్ కేసులు పెరగడానికి కారణమని చెబుతున్నారు. మ్యుటేట్ చెందిన వైరస్ అంటువ్యాధిగా ప్రబలుతోంది. ఇంట్లో ఒకరికి వ్యాపిస్తే.. అది మొత్తం కుటుంబానికి వ్యాపిస్తుంది. పిల్లలపై కరోనా కొత్త వేవ్ ప్రభావం అధికంగా ఉంటోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ RT-PCR పరీక్షలు మ్యుటేట్ చెందిన వైరస్‌ను గుర్తించలేవని అంటున్నారు.

అయినప్పటికీ, వాసన కోల్పోవడం అనేది ఒక వ్యక్తి కోవిడ్-19 పాజిటివ్ ప్రధాన లక్షణంగా పేర్కొన్నారు. కరోనావైరస్ సెకండ్ వేవ్ తీవ్రత 100 రోజుల వరకు ఉంటుందని, 70 శాతం టీకా హెర్డ్ ఇమ్యూనిటీ సాధించేవరకు ఇలాంటి వేవ్స్ వస్తూనే ఉంటాయని చెబుతున్నారు. అందుకే ప్రతిఒక్కరూ సామాజిక దూరంతో పాటు ముఖ్యంగా మాస్క్ లను ధరించాలని సూచిస్తున్నారు. వైరస్ ఉపరితలాలపై వ్యాప్తి ముప్పు కాదని అంటున్నారు. 15 నిమిషాలకు మించి పాజిటివ్ వ్యక్తితో ఉంటే వైరస్ బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

ఇక ఊబకాయం, డయాబెటిస్, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి వంటి కొమొర్బిడిటీ ఉన్నవారు తప్పనిసరిగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అధిక వ్యాయామం, జంక్ ఫుడ్ మానుకోవాలని డాక్టర్ కౌశిక్ పోలీసు సిబ్బందికి సూచించారు. కొబ్బరి నీళ్లు సహా ఇతర పోషకమైన ఆహారాలను భోజనంలో ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. అందరూ మాస్క్ లు తప్పనిసరిగా ధరించడం నేర్చుకోవాలని సూచించారు.