Allergy Problems : వాటితో శరీరంలో తీవ్రమైన అలర్జీ సమస్యలు! జాగ్రత్తగా ఉండటమే బెటర్

కొందరిలో సీజన్లతో ఏ సంబంధం లేకుండా ఏడాది పొడవునా అలర్జీ వేధిస్తుంటాయి. ముక్కులో తలత్తే అలర్జీ లక్షణాల వంటివే వూపిరితిత్తుల్లోకి చేరితే అలర్జిక్‌ బ్రాంకైటిస్‌, ఆస్థమా వంటి బాధలూ తలెత్తుతాయి. వీరిలో శ్వాస ఆడనట్లుండటం, దగ్గు, ఆయాసం, పిల్లికూతల వంటి లక్షణాలు కనిస్తాయి.

Allergy Problems : వాటితో శరీరంలో తీవ్రమైన అలర్జీ సమస్యలు! జాగ్రత్తగా ఉండటమే బెటర్

allergy problems

Allergy Problems : అలర్జీ అన్నది కొన్ని కొన్ని సీజన్లలో ఎక్కువగా వేధిస్తుంది. ధూళి, పూలు, పుప్పొడి, కాలుష్యం, చల్లటి వాతావరణం వీటిని చాలా మంది పెద్దగా పట్టించుకోరు. వీటి వల్ల ఏమీకాదనుకుంటుంటారు. అయితే కొందరి పాలిట ఇవే ఇబ్బందికరంగా మారతాయి. పెంపుడు జంతువుల బొచ్చు, సౌందర్య సాధనాలు, కొన్ని రకాల వాసనలు, రసాయనాలు, పాత పుస్తకాలు అలర్జీలకు కారణమౌతాయి. ముఖ్యంగా చెట్లన్నీ పూలు పూసి, గాలిలో పుప్పొడి ఎక్కువగా ఉండే కాలంలో, అలాగే చల్లదనం పెరిగే శీతకాలంలో ,కొన్ని సీజన్లలో ముక్కు అలర్జీలు ఎక్కువగా కనబడుతుంటాయి. దీన్నే సీజనల్‌ అలర్జిక్‌ రైనైటిస్‌ అంటారు.గాలి ద్వారా వచ్చే పుప్పొడి పెద్ద అలర్జీ కారకం.

కొందరిలో సీజన్లతో ఏ సంబంధం లేకుండా ఏడాది పొడవునా అలర్జీలు వేధిస్తుంటాయి. ముక్కులో తలత్తే అలర్జీ లక్షణాల వంటివే వూపిరితిత్తుల్లోకి చేరితే అలర్జిక్‌ బ్రాంకైటిస్‌, ఆస్థమా వంటి బాధలూ తలెత్తుతాయి. వీరిలో శ్వాస ఆడనట్లుండటం, దగ్గు, ఆయాసం, పిల్లికూతల వంటి లక్షణాలు కనిస్తాయి. ముక్కులో అలర్జీ ఏర్పడితే తరచూ తుమ్ములు రావడం, ముక్కులు మూసుకుపోవడం జరుగుతుంది. అలర్జీ కళ్ళలోకి చేరితే కళ్లు ఎర్రబారడం, నీరు కారడం వంటి లక్షణాలు ఉంటాయి. చర్మం మీద వ్యాప్తి చెందితే దురదలు, దద్దుర్లు వస్తాయి.

అలర్జీల భారిన పడకుండా ఉండాలంటే ఇంట్లో కిటికీలు మూసేసుకోవటం, కారులో వెళ్లేటప్పుడు విండోలు మూసెయ్యటం, పుప్పొడి వాతావరణంలో ఎక్కువగా ఉండే ఉదయం సమయాల్లో ఆరుబయటకు వెళ్లకుండా ఉండటం, చలికాలంలో బయటకు వెళ్లేటప్పుడు మఫ్లర్‌ వంటివి కట్టుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలర్జీల బారిన పడితే ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు. ఎందుకంటే చిన్నగా ప్రారంభమైన అలర్జీలు తరువాత దశలో తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంటుంది. చివరకు అవి దీర్ఘకాలిక సమస్యకు దారితీస్తాయి. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవటం మంచిది.