Serum Covid Vaccine Prices: కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభ రేట్లు 1.5 రెట్లు అధికం.. పెట్టుబడులు పెడితేనే ఉత్పత్తి..

ప్రపంచ అతిపెద్ద వ్యాక్సిన్ మేకర్, ప్రముఖ ఫార్మా కంపెనీ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) తయారుచేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్.. దేశంలో అత్యంత ఎక్కువగా వినియోగించే వ్యాక్సిన్.. అయితే ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రారంభ రేటు 1.5 రెట్లు అధికంగా ఉందని సమర్థించుకుంది.

Serum Covid Vaccine Prices: కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభ రేట్లు 1.5 రెట్లు అధికం.. పెట్టుబడులు పెడితేనే ఉత్పత్తి..

Serum Covid Vaccine Prices

Serum Covid Vaccine Prices : ప్రపంచ అతిపెద్ద వ్యాక్సిన్ మేకర్, ప్రముఖ ఫార్మా కంపెనీ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) తయారుచేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్.. దేశంలో అత్యంత ఎక్కువగా వినియోగించే వ్యాక్సిన్.. అయితే ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రారంభ రేటు 1.5 రెట్లు అధికంగా ఉందని సమర్థించుకుంది. ప్రారంభ వ్యాక్సిన్ ధర.. ముందస్తు నిధులపై ఆధారపడి ఉందని పేర్కొంది. అంతేకాదు.. ఇప్పుడు ఎక్కువ షాట్లను ఉత్పత్తి చేయడానికి సామర్థ్యాన్ని పెంచాలంటే పెట్టుబడి పెట్టాలని అంటోంది.

పూణేలో ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను తయారుచేసే ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థగా పేరొందిన సీరం ఈ వారం ప్రారంభంలో ప్రైవేటు ఆసుపత్రులకు ఒక మోతాదుకు రూ. 600 రూపాయలు ధర నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక మోతాదుకు రూ. 400 రూపాయలుగా వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వంతో కొత్త ఒప్పందాన్ని కూడా ప్రకటించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి మోతాదుకు రూ .150 వసూలు చేస్తోంది.

COVID-19 వ్యాక్సిన్ల ధరపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. వివక్షత చర్యగా ఆరోపించాయి. కొద్దిమంది పెద్ద పారిశ్రామికవేత్తలకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుందని, సాధారణ ప్రజలు నష్టపోతారంటూ మండిపడ్డాయి. కోవిడ్ -19 వ్యాక్సిన్‌కు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే ధర చెల్లించాలని డిమాండ్ చేశాయి. భారతదేశంతో టీకా ప్రపంచ ధరల మధ్య పోలిక సరికాదని సీరం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఈరోజు మార్కెట్లో లభించే అత్యంత సరసమైన COVID-19 టీకా అని సీరమ్ సమర్థించుకుంది. టీకా ప్రారంభ ధరలు ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొంది.

ఎందుకంటే ఆ దేశాలు ప్రమాదకర వ్యాక్సిన్ తయారీకి ఇచ్చిన ముందస్తు నిధుల ఆధారంగా ఉన్నాయని తెలిపింది. భారతదేశంతో సహా అన్ని ప్రభుత్వ రోగనిరోధకత కార్యక్రమాలకు కోవిషీల్డ్ ప్రారంభ సరఫరా ధర అతి తక్కువగా ఉందని అంటోంది. ప్రస్తుత భయానక పరిస్థితుల్లో వైరస్ బారినుంచి దేశ ప్రజలను రక్షించాలంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలని తెలిపింది.

అలా జరగాలంటే వ్యాక్సిన్ సామర్థ్యాన్ని పెంచాలని, విస్తరించేందుకు అవసరమైన పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీరమ్ అభిప్రాయపడింది. సీరం వాల్యూమ్‌లో పరిమిత భాగాన్ని మాత్రమే ప్రైవేటు ఆస్పత్రులకు మోతాదుకు రూ. 600 రూపాయలకు విక్రయిస్తామని కంపెనీ తెలిపింది. టీకా ధర ఇతర వైద్య చికిత్సల కంటే తక్కువగా ఉందని, COVID-19 ఇతర ప్రాణాంతక వ్యాధులకు చికిత్స చేయడానికి అవసరమని పేర్కొంది. ఈ వారం ప్రారంభంలో 50 శాతం భారత ప్రభుత్వ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అందిస్తామని, మిగిలిన 50 శాతం సామర్థ్యం రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ ఆసుపత్రులకు కేటాయిస్తామని స్పష్టం చేసింది. COVID వ్యాక్సిన్లు, మెడికల్-గ్రేడ్ ఆక్సిజన్, సంబంధిత పరికరాలను దిగుమతి చేసుకోవటానికి ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం మూడు నెలల పాటు మినహాయించిన సంగతి తెలిసిందే.