Coconut Water : మధుమేహులు కొబ్బరి నీళ్లు తాగకూడదా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

కొబ్బరి నీటిని రోజువారీ తీసుకోవడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్, కాలేయ కొవ్వు తగ్గుతుంది. కొబ్బరి నీటిలో ఉండే పోషకాలు శరీరం గ్లూకోజ్ వినియోగాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి.

Coconut Water : మధుమేహులు కొబ్బరి నీళ్లు తాగకూడదా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Coconut Water :

Coconut Water : కొబ్బరి నీటిలో దాహాన్ని తీర్చే గుణం ఉంది. అంతేకాకుండా ఎన్నో ఖనిజాలూ లభిస్తాయి. వివిధ రకాల రుగ్మతల్ని తొలగించే శక్తి కొబ్బరి నీటికి ఉంది. లేత కొబ్బరి నీటిలో అనేక సూక్ష్మ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ ప్రభావం కలిగి ఉంటుంది. లేత కొబ్బరి నీటిలో అత్యధికంగా లభించే పొటాషియం, తగిన స్థాయిలో సోడియం ఆల్కలైన్ సమతుల్యతను క్రమబద్ధీకరించి రక్తపోటు తగ్గించడంలో సహాయపడుతుంది.

లేత కొబ్బరి నీటిలో చక్కెరలు ఉంటాయి. కొబ్బరి బాగా ముదిరిన తరువాత నీటిలో చక్కెర శాతం తగ్గుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్న వాళ్ళు లేత కొబ్బరి కాకుండా కొంచెం ముదిరిన కొబ్బరి నీటిని తాగడం మంచిది కానీ లేత కొబ్బరి నీటిలో చక్కెర శాతం ఎక్కువ ఉండి వెంటనే ఎక్కువ శక్తిని అందజేస్తుంది. కొబ్బరి నీరు మధుమేహాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెరను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే మధుమేహుల్లో అనేక అపోహలు ఉన్నాయి.

కొబ్బరి నీళ్లలో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ సి, లు ఉంటాయి. కొబ్బరి నీటిలో తక్కువ చక్కెర కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలపై పెద్దగా ప్రభావం చూపదు. రక్తంలో చక్కెరను నిర్వహించడానికి సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కొబ్బరి నీరు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుందని, తీవ్రమైన గుండె సమస్యలను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

కొబ్బరి నీటిని రోజువారీ తీసుకోవడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్, కాలేయ కొవ్వు తగ్గుతుంది. కొబ్బరి నీటిలో ఉండే పోషకాలు శరీరం గ్లూకోజ్ వినియోగాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి. జీవక్రియ ఆరోగ్యాన్ని పెంచుతుంది.. కొబ్బరి నీటిలో జీవక్రియ, జీర్ణక్రియను ప్రోత్సహించే బయోయాక్టివ్ పదార్థాలు చాలా ఉన్నాయి, ఫలితంగా కొవ్వు వేగంగా విచ్ఛిన్నమవుతుంది.

కొబ్బరి బోండాంకు ఇతర పదార్ధాలను జోడించకుండా నీరును సహజ రూపంలో తాగడం మంచిది. కొబ్బరి నీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. డయాబెటిస్ వారు కొబ్బరి నీటిని త్రాగడం వల్ల మరింత శక్తిని అందివ్వడానికి సహాయపడుతుంది. కాబట్టి మధుమేహులు కొబ్బరినీటిని అధిక మోతాదులో కాకుండా రోజుకు ఒక గ్లాసుచొప్పున తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.