Papaya : అనారోగ్య సమస్యలతో బాధపడేవారు బొప్పాయి తినకూడదా?..

గ్రీన్ బొప్పాయిని , తల్లి తిన్నప్పుడు, పాల ఉత్పత్తిని పెంచుతుందని, చాలా మంది ప్రసవం తర్వాత పాలు పెంచుకోవడానికి బొప్పాయిని కూడా తింటుంటారు. దీనిలో ఉండే కొన్ని రకాల ఎంజైమ్స్ బిడ్డలో నెగటివ్ ప్రభావం చూపుతుందని పలు పరిశోధనల్లో తేలింది.

10TV Telugu News

Papaya : బొప్పాయి పండ్లను తినడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా డయాబెటిస్, క్యాన్సర్‌, లో బీపీ వంటి సమస్యలు రాకుండా చూడటంలో బొప్పాయి బాగా ఉపయోగపడుతుంది. అలాగే అధిక బరువు తగ్గుతారు. వీటిని తరచూ తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి తగు మోతాదులోనున్నాయి.

శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పపెయిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. కెరోటిన్‌, ఎ, బి, సి, ఇ విటమిన్‌లు, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్‌లు, ఫొలేట్‌లు, పాంతోనిక్‌ ఆమ్లాలు, పీచు వంటి పోషకాలు బొప్పాయిపండులో పుష్కలం. బొప్పాయి పండ్ల వల్ల మనకు అనేక రకాల ప్రయోజనాలు కలిగే మాట వాస్తవమే అయినా కొంతమంది వీటిని తినకపోవటమే మంచిది. ముఖ్యంగా వివిధ రకాల అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న వారు బొప్పాయిని తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

గర్భిణీలు బొప్పాయి పండ్లను తినకూడదు. ఎందుకంటే ఈ పండ్లలో ఉండే లేటెక్స్‌ గర్భాశయంపై ప్రభావం చూపిస్తుంది. బొప్పాయిని ఎక్కువగా తిన్నా లేదా పచ్చిబొప్పాయి తిన్నా, అందులో ఉండే ల్యాక్టేషన్ వల్ల యుటేరియన్ మీద ప్రభావం చూపుతుంది. ఇది గర్భిణీల్లో అబార్షన్ కు కారణమవుతుంది. అబార్షన్, ప్రీమెచ్యుర్ లేబర్, బేబీ అబ్ నార్మలిటీస్ కు గురిచేస్తుంది. అలాగే ఈ పండ్లలోని పపైన్‌ అనే ఎంజైమ్‌ కూడా పిండంపై ప్రభావం చూపిస్తుంది. కనుక గర్భిణీలు బొప్పాయి పండ్లను తినరాదు.

హైపో థైరాయిడిజం సమస్య ఉన్నవారు, అసాధారణ రీతిలో గుండె కొట్టుకునే సమస్య ఉన్నవారు కూడా బొప్పాయి పండ్లను తినరాదు. ఎందుకంటే ఈ పండ్లలో సయనోజెనిక్‌ గ్లైకోసైడ్స్‌ ఉంటాయి. అవి ఆయా సమస్యలు ఉన్నవారికి తీవ్ర దుష్పరిణామాలను కలిగించే అవకాశాలు ఉంటాయి. కనుక ఆయా సమస్యలు ఉన్నవారు కూడా బొప్పాయి పండ్లను తినరాదు. బొప్పాయిని ఎక్కువగా తినడం వల్ల , బొప్పాయిలో ఉండ బీటా కెరోటీన్ కారణంగా చర్మం రంగులో మార్పు వస్తుంది, దీనినే వైద్య పరిభాషలో కెరోటినిమా అని పిలుస్తారు. కళ్ళు తెల్లగా పాలిపోవటంతోపాటు, పచ్చ కామెర్లు వచ్చే అవాకాశాలు ఉంటాయి.

బొప్పాయిని ఎక్కువగా తినడం వల్ల, శ్వాస సమస్యలు, వీజింగ్, నాజల్ ప్యాసే బ్లాక్ అవ్వడం, హెవీ ఫీవర్, ఆస్త్మా వంటి డిజార్డర్స్ వస్తాయి.అలర్జీలు ఉన్నవారు, కిడ్నీ స్టోన్ల సమస్య ఉన్నవారు కూడా ఈ పండ్లను తినరాదు. బొప్పాయి పండ్లలో ఉండే లేటెక్స్‌ కొందరికి అలర్జీలను కలిగిస్తుంది. కనుక ఈ పండ్లను తిన్నవారు అలర్జీ వస్తుంటే వెంటనే వీటిని తినడం మానేయాలి. చిన్న పిల్లలకు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాల అందివ్వమని నిపుణులు సూచిస్తుంటారు, ఫైబర్ అధికంగా ఉండే బొప్పాయిని పెడితే నెగటివ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉంటాయి.

బొప్పాయి పండ్లలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. కిడ్నీ స్టోన్లు ఉన్నవారు ఈ పండ్లను తింటే స్టోన్స్‌ మరింత ఎక్కువయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక ఈ సమస్య ఉన్నవారు కూడా బొప్పాయి పండ్లను తినరాదు. లోబీపీతో బాధపడుతున్నవారు ఈ పండ్లను తింటే బీపీ మరింత పడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లోబీపీ బాధితులు బొప్పాయి పండ్లను తినరాదు. అంతేకాకుండా గ్యాస్ట్రో ఇంటెన్సినల్ సిస్టమ్ పాడవుతుంది. పొట్టనొప్పి, కడుపుబ్బరం, క్రాంప్స్, బ్లోటింగ్, ఆపానవాయువు, వికారం వంటి సమస్యలు ఏర్పడుతాయి.

గ్రీన్ బొప్పాయిని , తల్లి తిన్నప్పుడు, పాల ఉత్పత్తిని పెంచుతుందని, చాలా మంది ప్రసవం తర్వాత పాలు పెంచుకోవడానికి బొప్పాయిని కూడా తింటుంటారు. దీనిలో ఉండే కొన్ని రకాల ఎంజైమ్స్ బిడ్డలో నెగటివ్ ప్రభావం చూపుతుందని పలు పరిశోధనల్లో తేలింది. బొప్పాయి ఎక్కువగా తింటే, పల్స్ రేట్ తగ్గించేస్తుంది. దాంతో నాడీవ్యవస్థ దెబ్బతింటుంది.

బొప్పాయిని పరిమితంగా తింటే ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. అలాగని అదేపనిగా తింటే మాత్రం సమస్యలు కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ పండు తినే విషయంలో ముందు వెనుక ఆలోచించి వైద్యుల సలహా తీసుకుని తినటమే మేలు.

 

 

 

×