Heart Attack : ఈ లక్షణాలు కనిపిస్తే గుండె పోటుగా అనుమానించాల్సిందే?

శరీరంలోని ఎడమ వైపు భాగాల్లో నొప్పి రావడం. సాధారణంగా ఈ నొప్పి ఛాతీ నుంచి మొదలవుతుంది. క్రమంగా ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. ఎడమ చెయ్యి లేదా ఎడమ వైపు భుజం కండరాల్లో నొప్పి ఉంటుంది. ఇలా నొప్పి అనిపిస్తే గుండె పోటు లక్షణంగా అనుమానించవచ్చు.

Heart Attack : ఈ లక్షణాలు కనిపిస్తే గుండె పోటుగా అనుమానించాల్సిందే?

heart attack

Heart Attack :గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో ఒకటి పూర్తిగా పూడుకుపోవడం వల్ల ఎదురయ్యే తీవ్రమైన పరిస్ధితిని గుండె పోటుగా చెప్పవచ్చు. గుండెకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోయి, ఛాతీ నొప్పి రావడం జరుగుతుంది. గుండె కండరాలకు ఆక్సిజన్ తో కూడిన రక్తం తీసుకువెళ్లే మార్గం ఒక్కసారిగా సంకోచించడం వల్ల గుండెపోటు రావచ్చు. కొన్ని లక్షణాల ద్వారా గుండె పోటు ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టవచ్చు.

గుండె పోటు వచ్చే సమయంలో కొన్ని లక్షణాలు హెచ్చరికల రూపంలో ముందస్తుగానే కనిపిస్తాయి. గుండెపోటుకు ప్రాథమిక లక్షణం ఛాతీ నొప్పి. గుండెపోటు వచ్చేముందు ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపు అసౌకర్యంగా ఉంటుంది. ఇదే సమయంలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒత్తిడి, కండరాలు పిండేసినట్లు అనిపించడం, తెలియని నొప్పి వంటి పరిస్ధితి ఉంటుంది. ఏం జరుగుతుందో కూడా ఏమీ అర్ధం కాదు. గుండెపోటు సమయంలో కొందరిలో వాంతులు కూడా అవుతాయి.

శరీరంలోని ఎడమ వైపు భాగాల్లో నొప్పి రావడం. సాధారణంగా ఈ నొప్పి ఛాతీ నుంచి మొదలవుతుంది. క్రమంగా ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. ఎడమ చెయ్యి లేదా ఎడమ వైపు భుజం కండరాల్లో నొప్పి ఉంటుంది. ఇలా నొప్పి అనిపిస్తే గుండె పోటు లక్షణంగా అనుమానించవచ్చు. అలాగే ఛాతీ మధ్యలో నొప్పి ఒత్తిడి వల్ల గొంతు, దవడ వరకు వ్యాపిస్తే అది గుండెపోటుకు సంకేతంగా భావించాలి.

కారణం లేకుండా అకస్మాత్తుగా చెమటలు పట్టటం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం తగదు. ముఖ్యంగా మహిళల్లో ఈ తరహా పరిస్ధితి కనిపిస్తుంది. కాళ్లు, పాదాలతో పాటు చీలమండం ప్రాతం ఉబ్బినట్లు అనిపిస్తే గుండె రక్తాన్ని సక్రమంగా పంప్ చేయట్లేదని అర్థం. ఇది గుండె వైఫల్యంతో పాటు హార్ట్ అటాక్‌కు కారణం కావచ్చు. గుండె తగినంత వేగంగా రక్తాన్ని శరీర భాగాలకు పంప్ చేయలేనప్పుడు, రక్తం సిరల్లోకి తిరిగి వచ్చి, అవి ఉబ్బుతాయి.