Heart Attack : చెవి పోటు లక్షణం కనిపిస్తే గుండె పోటుకు సంకేతంగా అనుమానించాల్సిందేనా?

గుండెపోటు సంభవించే ముందుగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపు అసౌకర్యాం ఉంటుంది. ఇది కొన్ని నిమిషాల కంటే ఎక్కువ సమయం ఉంటుంది. గుండె ప్రాంతంలో ఒత్తిడి, తిమ్మిరి లేదా నొప్పి గుండెపోటుకు ప్రారంభ సంకేతంగా చెప్పవచ్చు.

Heart Attack : చెవి పోటు లక్షణం కనిపిస్తే గుండె పోటుకు సంకేతంగా అనుమానించాల్సిందేనా?

heart attack

Heart Attack : ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. పెద్ద వయస్సు వారే కాకుండా చిన్న వయస్సు వారు ఈ ప్రమాదానికి లోనవుతున్నార. ఇతర వ్యాధులలాగా కాకుండా గుండెపోటు అనేది ఆకస్మికంగా సంభవిస్తుంది. కొన్ని లక్షణాలు ముందస్తుగా కనిపించినప్పటికీ మనం తరచుగా వాటిని అజీర్ణం లేదా గుండెల్లో మంట వంటివాటినే పరిగణిస్తాం. ముఖ్యంగా పురుషుల కంటే మహిళలే ఎక్కువగా హార్ట్ ఎటాక్‌తో సతమతమవుతున్నారు. ఏది ఏమైనా గుండెపోటు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ఆరోగ్యం పై శ్రద్ధ పెడితే హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు రావు.

గుండెపోటు సంభవించే ముందుగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపు అసౌకర్యాం ఉంటుంది. ఇది కొన్ని నిమిషాల కంటే ఎక్కువ సమయం ఉంటుంది. గుండె ప్రాంతంలో ఒత్తిడి, తిమ్మిరి లేదా నొప్పి గుండెపోటుకు ప్రారంభ సంకేతంగా చెప్పవచ్చు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, గుండెపోటు లక్షణాలు పురుషులు ,స్త్రీల మధ్య విభిన్నంగా ఉంటాయి. పురుషుల మాదిరిగానే స్త్రీలు సాధారణ ఛాతీ నొప్పితో బాధపడవచ్చు. శ్వాస ఆడకపోవడం, వికారం, వాంతులు, వెన్ను లేదా దవడ నొప్పి వంటి పురుషుల కంటే స్త్రీలు చాలా సాధారణ లక్షణాలను కలిగి ఉంటారు.

చెవి పోటు లక్షణాల ద్వారా గుండెపోటును గుర్తించవచ్చు. దీన్నే ఫ్రాంక్ స్ సైన్’ అని పిలుస్తారు, ఇది గుండె జబ్బులతో ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దవడ, మెడ, డైజెస్టివ్ సిస్టంలో నొప్పి కలగడం లాంటి లక్షణాలు కూడా గుండె పోటు యొక్క లక్షణాలు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు, 55 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, స్థూలకాయం, మధుమేహం , జీవక్రియ లోపాలు వంటి సమస్యలు ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.

ఛాతిలో విపరీతమైన నొప్పి ఉంటే ఖచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించండి. చాలామంది ఇది ఎసిడిటీ ఏమో అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి గుండె పోటు వచ్చే ముందు కూడా ఛాతిలో విపరీతమైన నొప్పి కలుగుతుంది. అలానే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చినా సరే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. గుండెపోటు ప్రమాదాన్ని నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించటం అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఇతర ఆరోగ్య జాగ్రతల వల్ల గుండె జబ్బుల ప్రమాదం నుండి బయటపడవచ్చు.