Pimples:పింపుల్స్ పోగొట్టుకునేందుకు సింపుల్ టిప్స్

టూత్ పేస్టు మొటిమలకు బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే తేమను దూరంగా ఉంచటానికి సహాయపడుతుంది. దీని ప్రభావం వలన మొటిమలు తగ్గిపోతాయి.

Pimples:పింపుల్స్ పోగొట్టుకునేందుకు సింపుల్ టిప్స్

Pimples

టీనేజర్లలో మొటిమలు రావటం అనేది సర్వ సాధారణంగా కనిపిస్తుంది. మగవారు మరియు ఆడవారు ఇద్దరిలోను అధిక ఆండ్రోజెన్ హార్మోన్లు ఉత్పత్తి, టెస్టోస్టెరాన్,డైహైడ్రోటెస్టోస్టెరోన్ , డి హైడ్రో ఎపింద్రోస్తేరోనే సల్ఫేట్ కారణంగా మొటిమలు వస్తాయి. అన్ని వయస్సుల వారిలో వచ్చే మొటిమలను చర్మ సమస్యగా చెప్పవచ్చు. సాదారణంగా బాక్టీరియా ఇన్ఫెక్షన్ వలన వచ్చే మొటిమల కారణంగా నొప్పికలుగుతుంది.

మొటిమలు రావటం వల్ల అందమైన మొఖం అందవిహీనంగా మారుతుంది. చూసేవారికి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. కొన్ని రకాల జాగ్రత్తుల, చిట్కాలు పాటిస్తే మొటిమల నుండి మీ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. రోజులో కనీసం మూడు, నాలుగు సార్లు ముఖం కడుక్కోవాలి. ఒక నిమ్మకాయను తీసుకుని సగానికి కట్ చేసి నిమ్మ ముక్కతో మొటిమల పైభాగంలో రుద్దాలి. నిమ్మపండులో ఉండే సిట్రిక్ యాసిడ్ ప్రభావంతో మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను నిర్మూలించబడుతుంది.

మొటిమల నివారణకు బంగాళ దుంప బాగా పనిచేస్తుంది. బంగాళ దుంప స్లైయిస్ ను మొటిమలు ఉన్న ప్రాంతంలో 5 నుండి 10 నిమిషాల పాటు ఉంచాలి. ఆతరువాత నీటితో శుభ్రంగా కడిగి వేయాలి. తేయాకు నూనె సైతం యాంటీ బాక్టీరియల్ గా పనిచేస్తుంది. రెండు ఆస్పిరిన్ మాత్రలు తీసుకోని పొడి చేసి నీటితో కలపాలి. దానిని ప్రభావిత ప్రాంతంపై రాయాలి. మొటిమలు కలిగించే బాక్టీరియాపై ఆస్పిరిన్ సమర్థవంతంగా పోరాడుతుంది. ఆస్ప్రిన్ బాధా నివారక లవణాలు గల యాసిడ్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా మొటిమలు త్వరగా మానేలా చేస్తుంది.

బేకింగ్ సోడాను తీసుకుని నీటిని కలపండి. ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్నా ప్రాంతాలలో రాసి 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మొటిమలు తగ్గిపోతాయి. కీర, ఓట్‌మీల్‌, యోగర్ట్‌… ఈ మూడు కలిపి పేస్టులా చేసి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. అరగంట తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. తేనెను ముఖానికి రాసుకుని అరగంట తరువాత కడిగేసుకున్నా ఫలితం కనిపిస్తుంది. కలబంద ఉన్న జెల్‌ ఏదైనా ఉపయోగించవచ్చు.

టూత్ పేస్టు మొటిమలకు బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే తేమను దూరంగా ఉంచటానికి సహాయపడుతుంది. దీని ప్రభావం వలన మొటిమలు తగ్గిపోతాయి. ఐస్ క్యూబ్ వాపు మొటిమల సమస్యకు ప్రభావవంతంగా పనిచేస్తాయి. మొటిమల కారణంగా వచ్చే వాపును తగ్గించడానికి సహాయపడతాయి. గుడ్డులోని తెల్లసొనను మీ ముఖం అంతా పట్టించాలి. 15-20 నిమిషాలు తర్వాత శుభ్రం చేయండి. ఈ ఫేషియల్ మాస్క్ ఒక వారంలో రెండుసార్లు ఉపయోగించండి.

రెండు వెల్లుల్లి,లవంగాలను తీసుకోని బాగా క్రష్ చేసి రసం తీయాలి. ఈ రసాన్ని మీ ముఖం మీద పట్టించి 10 నిమిషాలు తర్వాత కడగాలి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. పుదీనా నూనె లేదా రసంను మీ ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేయాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. నూనె పదార్థాలు, వేపుళ్లకు దూరంగా ఉండాలి. శుద్ధి చేసిన పిండి పదార్థాలకు దూరంగా ఉండాలి. చక్కెరను నెమ్మదిగా తగ్గించండి. విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉన్న వెజ్జీస్,పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల మీ ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం ఉండదు.