Skin Wrinkles : వయస్సు 40 తరువాత చర్మంపై ముడతలా? సమస్యను నివారించుకోవటానికి..

శరీరంలో నీరు లేకపోవడం వల్ల చర్మం నిర్జీవంగా మారుతుంది. నీరు శరీరంలోని టాక్సిన్స్‌ని బయటకు పంపి చర్మానికి మెరుపును తెస్తుంది. రోజూ కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి. ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రకు కేటాయించాలి. నిద్ర లేకపోవడం వల్ల ముఖం పాలిపోయి, కళ్ల కింద నల్లటి వలయాలు కనిపిస్తాయి.

Skin Wrinkles : వయస్సు 40 తరువాత చర్మంపై ముడతలా? సమస్యను నివారించుకోవటానికి..

Skin Wrinkles : చర్మం ముడతలు పడడం వయసుతో పాటుగా వచ్చే సహజమైన మార్పు. చర్మంపై ముడతలు ఏర్పడటంతో చాలా మంది తమ వయస్సు పెరుగుతుందన్న ఆలోచనతో మదనపడుతుంటారు. ఇక అందంగా కనిపించమేమోనన్న భయం వారిని వెంటాడుతుంటుంది. దీనిని నివారించాలంటే జీవనశైలిలో మార్పుల ద్వారా వయసుతో పాటుగా చర్మం ముడతలు పడడాన్ని కొంత వరకు తగ్గించుకోవచ్చు.

చర్మంపై ముడతలు రాకుండా ఉండాలంటే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే తాజాపండ్లు, కాయగూరలు, ఆకుకూరలు రోజూ తీసుకోవాలి. విటమిన్ – ఎ అధికంగా ఉండే క్యారెట్, టొమాటో, పాలకూర, చిలగడ దుంపలు, బ్రొకోలి మొదలైనవి తరచుగా తినాలి. నీరు ఎక్కువగా ఉండే సొరకాయ, దోసకాయ, కీరదోస, ముల్లంగి లాంటి కూరగాయలు అధికంగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

శరీరంలో నీరు లేకపోవడం వల్ల చర్మం నిర్జీవంగా మారుతుంది. నీరు శరీరంలోని టాక్సిన్స్‌ని బయటకు పంపి చర్మానికి మెరుపును తెస్తుంది. రోజూ కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి. ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రకు కేటాయించాలి. నిద్ర లేకపోవడం వల్ల ముఖం పాలిపోయి, కళ్ల కింద నల్లటి వలయాలు కనిపిస్తాయి. అలాంటి సమస్యలను నివారించడానికి ప్రతిరోజూ ఏడెనిమిది గంటలు నిద్రపోవాలి. దీంతోపాటుగా క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేయాలి.

ఎక్కువసేపు ఎండలో సమయం వెచ్చించాల్సి వచ్చినప్పుడు సన్ స్క్రీన్ తప్పనిసరి. బయటి నుండి రాగానే ముఖాన్ని చల్లని నీళ్లతో శుభ్రపరుచుకోవడం, చర్మంపై ముడతలు రావడానికి చర్మాన్ని తేమగా ఉంచకపోవడం ఒక కారణం. కాబట్టి చర్మానికి తరచుగా మాయిశ్చరైజర్ రాసుకోవడం,యాంటీఏజింగ్ క్రీమ్స్ వాడడం వల్ల ఉపయోగం ఉంటుంది.

ఒక టేబుల్ స్పూన్ మేర గులాబీ నీటిని తీసుకుని అంతే మోతాదులో గ్లిజ‌రిన్‌ని క‌లుపుకోవాలి. ఈ రెండింటిలో కొన్ని చుక్క‌ల నిమ్మ‌ర‌సం వేసి క‌లిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయటం వల్ల ముడతలు ఉండవు. అలాగే ఒక అర‌టి పండును గుజ్జులా చేసుకుని టేబుల్ స్పూన్ చొప్పున తేనె, పెరుగూ క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పూత‌లా రాసి 15 నిమిషాల త‌రువాత క‌డుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం
తాజాగా ఉంటుంది.