Skipping Morning Meal : ఉదయం బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా?.. ఈ అనారోగ్య సమస్యలు తప్పవు..!

కొంతమందిలో ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినే అలవాటు ఉండదు.. నేరుగా మధ్యాహ్నం మిల్స్ తినేస్తుంటారు. కాఫీ, టీ నీళ్లతోనే సరిపెట్టేసుకుంటుంటారు. మరికొంతమందిలో బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటారు. కానీ, స్కిప్ చేస్తుంటారు.

Skipping Morning Meal : ఉదయం బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా?.. ఈ అనారోగ్య సమస్యలు తప్పవు..!

Skipping Morning Meal Can Have Ill Effects On Health

Skipping Morning Meal : కొంతమందిలో ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినే అలవాటు ఉండదు.. నేరుగా మధ్యాహ్నం మిల్స్ తినేస్తుంటారు. కాఫీ, టీ నీళ్లతోనే సరిపెట్టేసుకుంటుంటారు. మరికొంతమందిలో బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటారు. కానీ, స్కిప్ చేస్తుంటారు. ఇలా ఒక రోజు తిని.. మరో రోజు బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తుండటం వల్ల అనారోగ్య సమస్యలకు కొనితెచ్చుకున్నట్టే అంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా చిన్నపిల్లలు బ్రేక్ ఫాస్ట్ తినేందుకు మారం చేస్తుంటారు. రెగ్యులర్ డైట్ లో మార్పుల వల్ల దాని ప్రభావం వారి ఆరోగ్యంపై పడుతుందని హెచ్చరిస్తున్నారు పోషక నిపుణులు.

పూర్ డైట్ కారణంగా ఎక్కువగా అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని చెబుతున్నారు. అమెరికాలో వయోజనుల్లో పూర్ డైట్ క్వాలిటీ కారణంగా పోషకాహారం లోపం తలెత్తిందని, ఫలితంగా వారు తొందరగా అనారోగ్యానికి గురి అయినట్టు గుర్తించారు. పూర్ డైట్ కు సంబంధించి పోషక నిపుణులు.. 19ఏళ్ల వయస్సు నుంచి ఆపై వారిలో 30,889 వయోజనులపై అధ్యయనం నిర్వహించారు. ఉదయం లేవగానే బ్రేక్ ఫాస్ట్ తోనే ఆ రోజు మొదలు కావాలి. అలా కాకుండా నేరుగా భోజనం కానిచ్చేవారిలో జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు అనేక అనారోగ్యాలకు దారితీసే ప్రమాదం ఉందని అంటున్నారు.

న్యూట్రిషనల్ గ్యాప్ కారణంగానే ఈ సమస్యకు దారితీస్తుందని చెబుతున్నారు. అందుకే ఎంత ఇబ్బందిగా అనిపించినా బద్దకాన్ని వదిలి బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎంతో రుచికరమైన మూడు బ్రేక్ ఫాస్ట్ రెసిపీలను ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..

Buttered banana-chia toast:
వెన్నతో అరటి-చియా టోస్టుతో కలిపి ఈ కొత్త వంటకాన్ని తయారుచేసుకోవచ్చు.
– బ్రెడ్ ను టోస్టు చేసి.. దానిపైభాగంలో పీనట్ వెన్నను రాయాలి.
– అరటిని ముక్కలుగా కట్ చేసి.. బ్రెడ్ పైనా ఉంచాలి.
– చియా సిడ్స్ తురిమి.. పైనా జల్లి సర్వ్ చేయాలి.

Fruit-quinoa salad:

– మామిడి, స్టాబ్రెరీలను ముక్కులుగా కట్ చేసుకోండి.. ఒక బౌలో వేయండి.
– క్యూయోనా కొన్నింటిని తీసుకోండి.. బ్లాక్ బెర్రీలు, చెర్రీలు, బ్లూ బెర్రీలను బౌలో ఉంచండి.
– వీటికి కొంచెంగా తేనెను చేర్చండి.. రుచి కోసం నిమ్మరసం
కొద్దిగా కలపండి.
– అన్నింటిని కలిపి మిక్స్ చేయండి.. ఆ తర్వాత సర్వ్ చేసుకోండి.

Yoghurt-berry smoothie: ఇదేలా తయారు చేయాలంటే.. ?

– కొన్ని తాజా బ్లాక్ బెర్రీలు, బ్లూబెర్రీలు, అరటిని తీసుకోండి.
– వనీలా సాయి మిల్క్, ప్లెయిన్ గ్రీక్ యోగార్ట్ తీసుకోని బాగా కలపండి.
– కొన్నింటి పండ్లను కూడా చేర్చి మరింత మిక్స్ చేయండి.
– మిశ్రమాన్ని ఒక గ్లాసులో పోసి.. సర్వ్ చేసుకోండి.