సిగరెట్ తక్కువ తాగేవాళ్లే త్వరగా చస్తారు.. !!

సిగరెట్ తక్కువ తాగేవాళ్లే త్వరగా చస్తారు.. !!

Smoking One Cigarette Day Way Worse Experts Thought 27112

ఎలా అర్థం చేసుకున్నా సరే.. ఇది నిజం. ‘సిగరెట్ త్రాగడం ఆరోగ్యానికి హానికరం’ సినిమాకు సంబంధం లేకపోయినా ప్రతి థియేటర్లో వినిపించే డైలాగ్ ఇది. ఆ.. ఏమవుతుందిలే వాళ్లు చెప్తూ ఉంటారు. మనం వింటూ ఉంటాం అనుకుని ఇంటర్వెల్‌లో ఓ దమ్ము లాగేసి వచ్చేసి కూర్చుంటాం. కానీ, ఆ ఒక్క సిగరెట్ మీకు వచ్చే గుండెనొప్పిని మరింత ముందుకు తీసుకువస్తుందని గ్రహించారా..

21దేశాల్లో 1946-2015వరకూ 141 సర్వేలు నిర్వహించి  25శాతం హార్ట్ స్ట్రోక్ రావడం కేవలం సిగరెట్ స్మోకింగ్ కారణంగానే వస్తుందని తేల్చాయి. సాధారణంగా ఫుడ్ నిర్లక్ష్యంతో వస్తున్న గుండెనొప్పులు 25శాతం ఉంటే సిగరెట్ స్మోకింగ్ కారణంగా 48శాతం వస్తున్నాయి. తరచూ ప్రతి సందర్భానికి సీరియస్‌గా ఫీలవుతూ.. సిగరెట్ తాగే మహిళల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువ. మగాళ్ల కంటే ఎక్కువగా 57శాతం గుండె జబ్బు ప్రమాదం ఉందట.

వయస్సును బట్టి ఈ ప్రమాదానికి అవకాశాలు మరిన్ని ఎక్కువగా ఉన్నాయి. పురుషుల్లో 74శాతం నుంచి 30శాతానికి గుండె జబ్బు తీవ్రత కనిపిస్తుండగా, మహిళల్లో ఇది 119శాతం నుంచి 46శాతం ఉంది.

అందరూ అనుకుంటుండొచ్చు. లైట్ స్మోకింగ్.. ఆ ఎప్పుడైనా ఓ సిగరెట్ త్రాగడం పెద్ద ప్రమాదమేమీ కాదులే అని అనుకుంటుంటారు. రాతై, యూకేలోని అల్లాన్ హాక్షా అనే ప్రొఫెసర్ రోజుకు ఒకటి, అరా తాగే వాళ్లతో పోలిస్తే 20సిగరెట్లు అంతకంటే ఎక్కువతాగే వాళ్లలోనే ప్రమాదాలు తక్కువ అని తేల్చారు.

అమెరికాలో సిగరెట్ తాగడం వల్ల కరోనరీ గుండె జబ్బుకు గురై 3లక్షల 70వేల మందీ గురవుతుంటే అందులో లక్షా 40వేల మంది గుండె నొప్పితో చనిపోతున్నారు.

See Also | ఫోన్‌ స్క్రీన్‌పై చేరిన కరోనావైరస్ 96 గంటలు బతికే ఉంటుంది. ముట్టుకొంటే…!