Soap Nuts : చుండ్రు,జుట్టు రాలే సమస్యలకు కుంకుడుకాయ బెస్ట్

కుంకుడుకాయల్లో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వలన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.

Soap Nuts : చుండ్రు,జుట్టు రాలే సమస్యలకు కుంకుడుకాయ బెస్ట్

Soap Nuts

Soap Nuts : పూర్వం మన పెద్దవాళ్ళు కుంకుడు కాయలతో తలంటు స్నానం చేసేవారు. అందుకనే ఎలాంటి జుట్టు సమస్యలు ఉండేవి కాదు. కానీ ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంతో మార్కెట్లో దొరికే వివిధ రకాల షాంపూలు వాడటం వల్ల అనేకమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం కుంకుడుకాయలకి స్థానం లేకుండా పోయింది. పేదాగొప్పా తేడా లేకుండా అందరి ఇళ్లలోకీ చౌకదో, ఖరీదైనదో షాంపూ వచ్చి చేరింది. షాంపూ సౌకర్యవంతంగా ఉండటమే అందుకు కారణం.

ప్రస్తుతం చాలా మంది చుండ్రు , జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారికి కుంకుడు కాయ చక్కగా ఉపయోగపడుతుంది. కుంకుడు కాయల రసం నాచురల్ షాంపూగా పని చేస్తుంది. జుట్టుకి పోషణనిస్తుంది. దాంతో, జుట్టు మెరుస్తూ ఉంటుంది. జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది. కుంకుడుకాయల్లో ఉన్న విటమిన్స్ వల్ల జుట్టు డ్రై గా అవ్వకుండా ఉంటుంది. సిల్కీ, స్మూత్ హెయిర్ మీ సొంతమవుతుంది. కుండుకాయల్ని ఓ 150 గ్రాములు తీసుకుని నీటిలో నానబెట్టండి. ఓ గంట తర్వాత… వాటిని ఉడకబెట్టండి. ఇలా బాగా ఉడకబెడితే వాటిలో కషాయం అంతా నీటిలోకి వచ్చేస్తుంది. రంగు మారుతుంది. తర్వాత ఆ నీరు చల్లారబెట్టి పొడిగుడ్డ లేదా చిక్కంతో ఆ కుంకుడు కాయల రసాన్ని ఫిల్టర్ చేసి వాడుకోవచ్చు.

కుంకుడుకాయ రసం నాచురల్ షాంపూ గా పనిచేస్తుంది. దాంతో జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా, నల్లగా మెరుస్తూ ఉంటుంది. కుంకుడుకాయలో ఉండే విటమిన్స్ వల్ల జుట్టు సిల్కీ ఇంకా స్మూత్ గా తయారవుతుంది. ఎండబెట్టిన కమలాతొక్కలు, నిమ్మతొక్కలు, మందారాకులు, మందారపూలు, మెంతులను పొడిచేసి కుంకుడు పొడిలో కలపవచ్చు. వీటన్నిటినీ కలిపిన పొడితో తలస్నానంచేస్తే వెండ్రుకలు నల్లగా ఉంటాయి. కుంకుడుకాయలో ఉండే విటమిన్ ‘ఎ’, ‘డి’ వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇవి జుట్టు కుదుళ్లను బాగా బలంగా ఉంచి ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి.

కుంకుడుకాయల్లో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వలన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. జుట్టు చిక్కులు లేకుండా మెత్తగా ఉంటుంది. కుంకుడు కాయలు, హెన్నా కాంబినేషన్ మంచి కండిషనర్ లా పని చేస్తుంది. దాని వల్ల జుట్టు డ్రై గా అవ్వకుండా ఉంటుంది. చుండ్రు, స్ప్లిట్ ఎండ్స్, హెయిర్ ఫాల్, వంటివన్నీ కుంకుడుకాయలని రోజువారిగా వాడుతుంటే దూరమౌతాయి. కుంకుడుకాయల్లో ఉన్న విటమిన్స్ ఏ, డీ వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. అందులో ఉన్న విటమిన్స్ జుట్టు కుదుళ్ళకి బలాన్నిచ్చి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ఈ విటమిన్స్ కొత్త ఫాలికిల్స్ ఏర్పడడానికి సహాయం చేస్తాయి. కుంకుడుకాయలతోనే తలస్నానం చేస్తూ ఉండడం వల్ల చుండ్రు సమస్య పూర్తిగా పోతుంది.

కొద్దిగా కుంకుడు కాయల పొడి, శీకాయ పొడి మిశ్రమాన్ని బాగా కలిపి మెత్తగా పేస్ట్ లా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు అంటుకునే విధంగా పెట్టాలి. ఒక అరగంట ఆగి తలస్నానం చేయడం ద్వారా తెల్ల జుట్టు రాకుండా, జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలే సమస్యను తొలగించుకోవచ్చు.