Vitamin B12 : జుట్టు, చర్మ సమస్యలకు విటమిన్ బి12 తో పరిష్కారం!

విటమిన్ బి12 ఎగ్జిమాను పూర్తిగా నివారిస్తుంది. వైరస్ ను సైతం శరీరంలో నాశనం చేస్తుంది. రెగ్యులర్ డైట్ లో సరిపడా విటమిన్ బి12 ఫుడ్ ను తీసుకుంటుంటే విటలిగోను నివారిస్తుంది.

Vitamin B12 : జుట్టు, చర్మ సమస్యలకు విటమిన్ బి12 తో పరిష్కారం!

Vitamin B12

Vitamin B12 : చర్మం మరియు జుట్టుకు సంరక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోవటం ఎంతో అవసరం. సరైన పోషకాలను తీసుకుంటూ చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎలాంటి పోషకాహారం తీసుకోవాలన్న దానిపై సరైన అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. మనిషి శరీరానికి వివిద రకాల విటమిన్స్ అవసరం అవుతాయి. అలాంటి విటమిన్స్ లో విటమిన్ బి12 కూడా ఒకటి . కొన్ని రకాల విటమిన్స్ శరీరంలో జీవక్రియలు ఆరోగ్యంగా , సహజంగా జరగడానికి తోడ్పడతాయి. విటమిన్ బి12ల్లో కోబాల్మిన్ , ఇతర న్యూట్రీషియన్స్, అధికంగా ఉన్నాయి. శరీరానికి అత్యధికంగా అవసరం అవుతాయి. శరీరానికేకాకుండా జుట్టు, చర్మ ఆరోగ్యంలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. విటమిన్ 12 జుట్టుకు, అందానికి ఏవిధంగా సహాయపడతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

విటమిన్ బి 12 పొడిగా మారిన చర్మాన్ని నివారిస్తుంది. విటమిన్ బి12లోపించడం వల్ల చర్మం పొడిగా, డల్ గా మారుతుంది. కాబట్టి, విటిమన్ బి12 అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల చర్మంను హైడ్రేషన్ లో ఉంచుతుంది, చర్మానికి తగిన మాయిశ్చరైజింగ్ను అందిస్తుంది. చర్మంలో ముడతలను తొలగిస్తుంది. శరీరానికి సరిపోయే విటమిన్ బి12 రెగ్యులర్ గా తీసుకుంటుంటే, డ్యామేజ్ అయిన చర్మంను నయం చేస్తుంది. చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. విటమిన్ బి 12 శరీరంలో కణాలు ఏర్పడటానికి దోహదపడుతుంది. ఇది ఇన్నర్ గ్లోను పెంచుతుంది. ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలంటే విటమిన్ బి12 లోపం లేకుండా రెగ్యులర్ డైట్ లో విటమిన్ బి12 పదార్థాలను చేర్చుకోవాలి. ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది. ముడుతలను మాయం చేస్తుంది. అమినో యాసిడ్స్ లోని మెలనిన్, దీన్నే టైరోసిన్ అని కూడా పిలుస్తారు. ఇది హెయిర్ పిగ్మెంటేషన్ ప్రోత్సహిస్తుంది. దాంతో హెయిర్ కలర్ పెరుగుతుంది. విటమిన్ బి12 ఎక్కువగా తీసుకోవడం వల్ల మెలనిన్ మెరుగుపడి, ఒరిజినల్ హెయిర్ కలర్ పొందవచ్చు.

విటమిన్ బి12 ఎగ్జిమాను పూర్తిగా నివారిస్తుంది. వైరస్ ను సైతం శరీరంలో నాశనం చేస్తుంది. రెగ్యులర్ డైట్ లో సరిపడా విటమిన్ బి12 ఫుడ్ ను తీసుకుంటుంటే విటలిగోను నివారిస్తుంది. విటలిగో ఒక చర్మ వ్యాధి, చర్మ మీద తెల్లగా మచ్చలు ఏర్పడుతాయి. దీని నివారణకు బి 12 తీసుకోవటం చాలా అవసరం. ఆరోగ్యకరమైన , బలమైన గోళ్ళు పెరడానికి రెగ్యులర్ డైట్ లో విటమిన్ బి12 అధికంగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ బి12 శరీరానికి మాత్రమే కాదు, జుట్టుకు కూడా చాలా అవసరం. విటమిన్ బి12 లోపం వల్ల హెయిర్ ఫోలిసెల్స్ కు పోషణ సరిగా అందకపోవడం వల్ల జుట్టు రాలడం, జుట్టు పెరుగదలను అడ్డుకోవడం జరుగుతుంది. జుట్టు రాలడం , జుట్టు సరిగా పెరగకపోవడం వంటి లక్షణాలు కనబడుతుంటే, విటమిన్ బి12 అదికంగా ఉండే ఆహారాలను తీసుకోవటం మంచిది. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.