ఎందుకో తెలుసా?: SpaceX రాకెట్‌.. అంతరిక్షంలోకి బీర్, ఫైర్, ఎలుక!

  • Published By: sreehari ,Published On : December 5, 2019 / 03:13 PM IST
ఎందుకో తెలుసా?: SpaceX రాకెట్‌.. అంతరిక్షంలోకి బీర్, ఫైర్, ఎలుక!

అంతరిక్షంలో వ్యోవగాములు ఎంతకాలం ఉండగలరు. అంతరిక్షంలో మనిషి మనుగడ ఎంతవరకు సాధ్యం. అక్కడి వాతావరణాన్ని తట్టుకుని జీవించాలంటే చాలా క్లిష్టమైన చర్య. సూక్ష్మ గురుత్వాకర్షణ (మైక్రో గ్రావిటీ)లో వ్యోమగాములు భూమి మీదలా అన్ని పనులు చేసుకోగలరా అనేదానిపై అంతర్జాతీయ స్పేస్ సిస్టమ్ (ISS) ప్రయోగం చేపడుతోంది. ఎలాన్ మస్క్ రాకెట్ కంపెనీ SpaceX అనే కొత్త ప్రాజెక్టును లాంచ్ చేస్తోంది. ఈ ప్రయోగంలో భాగంగా అంతరిక్షంలోకి మూడు విభిన్నమైన అణువులను రాకెట్ ద్వారా పంపిస్తోంది. 

ఒక రోజు ఆలస్యంగా నింగిలోకి :
జీరో గ్రావిటీలో ఈ మూడింటి స్థానచలనం ఎలా మారుతుందో పరిశీలించనుంది. ఇందుకోసం SpaceX వ్యోమ‌నౌకలో 5,700 ఫౌండ్లతో లోడ్ చేసిన సరుకుతో రాకెట్‌ను నింగిలోకి ప్రయోగిస్తోంది. వీటిలో జన్యపరంగా వృద్ధిచెందిన ఎలుక కండరాల క్షయాన్ని కూడా పంపిస్తోంది. ఫ్లోరిడాలోని కెండీ అంతరిక్ష కేంద్రం నుంచి (స్థానిక కాలమానం ప్రకారం..) గురువారం మధ్యాహ్నాం 12.30గంటలకు 9 ఫాల్కన్ రాకెట్‌తో స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సల్ కక్షలోకి ఎగురనుంది.

ఆదివారానికి ఈ రాకెట్ అంతరిక్షంతో అనుసంధానం కానుంది. షెడ్యూల్ ప్రకారం.. ఈ మిషన్ బుధవారమే టేకాఫ్ కావాల్సి ఉండగా.. పైవాతావరణంలో గాలుల తీవ్రత కారణంగా ఒకరోజు ఆలస్యంగా ప్రయోగాన్ని చేపట్టింది. నాన్ ప్రాఫిట్ జాక్సన్ ల్యాబరేటరీ నుంచి ఈ ఎలుక కండరాన్ని సేకరించారు. 

ఆ మూడింటితో ISS ప్రయోగం :
కండరాల వృద్ధిపెరిగేలా దీన్ని కణాలకు డ్రగ్స్ ఇంజెక్ట్ చేశారు. తద్వారా అంతరిక్షంలో ఉన్న మనుషుల ఎముకలు, కండరాల పరిమితి కోల్పోకుండా ఉంటారో సైంటిస్టులు అర్థం చేసుకునేందుకు సహకరించనుంది. అంతరిక్షంలో మనిషి ఉన్నప్పుడు అతడి శరీరంలోని అవయవాల పనితీరు ఎలా ఉంటుంది అనేదానిపై ప్రయోగాలు చేయడంలో ఇతర రీసెర్చర్లు ప్రయత్నిస్తున్నారు.

సాధారణ గ్రావిటీ థియరీలను పరీక్షిస్తున్నారు. ఎలుకతో పాటు మంటలు ఎగసే స్థితి, బీర్ తయారీపై కూడా పరీక్షించనున్నారు. జీరో గ్రావిటీలో మంటలు ఎలా వ్యాపిస్తాయి, మనిషిలోని హృదయ సంబంధిత వ్యాధుల సంభావ్యత ఏ మేరకు ప్రభావం ఉంటుందో కూడా టెస్ట్ చేయనున్నారు. 

ఎలుక కండర క్షయం క్షీణించకుండా వృద్ధి చెందుతుందా లేదా అనేది కూడా పరీక్షించనున్నారు. బీర్ తయారీ విధానాన్ని కూడా పరీక్షించనున్నారు. బీర్ ఓపెన్ చేయగానే పైకి ఉప్పొంగుతుంది.. అదే అంతరిక్షంలో దాని దిశ ఎలా మారుతుందో పరీక్షించాల్సి ఉంది.

భూగ్రహం మాదిరిగానే అంతరిక్షంలోని సూక్ష్మ గురుత్వాకర్షణలో మానువులు తమ జీవనానికి అవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవడంపై ప్రభావం చూపిస్తుందో టెస్టు రిజల్ట్స్ అనుసరించి శాస్త్రవేత్తలు ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. అంతరిక్షంలో మానవుల మనుగడకు అవసరమైన పరిస్థితులను అంచనా వేసేందుకు ఈ మూడింటిని నింగిలోకి ప్రయోగిస్తున్నారు. భూమికి అంతా వ్యతిరేక దిశలో ఉండే అంతరిక్షంలో SpaceX ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.